బాహుబలిలో హాట్ హాట్గా స్వీటీ! | anushka shetty to act in hot scenes for bahubali | Sakshi
Sakshi News home page

బాహుబలిలో హాట్ హాట్గా స్వీటీ!

Published Tue, Mar 18 2014 7:12 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలిలో హాట్ హాట్గా స్వీటీ! - Sakshi

బాహుబలిలో హాట్ హాట్గా స్వీటీ!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న చిత్రం బాహుబలి.ఈ సినిమా గురించి రోజుకో వార్త పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. బాహుబలి మూవీలో స్వీటీ.. అదే మన అనుష్క డోస్‌ పెంచి రొమాన్స్‌ చేయడానికి రెడీ అయిందట!! దర్శకుడు రాజమౌళి సినిమాల్లో హీరోలను ఎంత హై ఓల్టేజ్‌ లో చూపిస్తాడో, హీరోయిన్‌ను కూడా అంతే అందంగా చూపిస్తాడు.

అలాంటి రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి మూవీ గురించి  ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. బాహుబలి చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో అనుష్క మీద కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయనే తెలిసింది. చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న మూవీ కావడంతో అనుష్క పాత్రకు ఇది తప్పనిసరి అయ్యిందంటున్నారు. రాజమౌళి మూవీలో హీరో, హీరోయిన్స్, విలన్ లతోపాటు, ఇతర పాత్రలకూ ప్రాధాన్యం ఉంటుంది. అనుష్క నటిస్తున్న పాత్ర కథానుసారంగా ఓ సీన్ లో హాట్ రొమాన్స్ చేయాల్సి వస్తుంది. యుద్ధానికి దారి తీసే ముందు ఈ సీన్ చాలా కీలకంగా ఉంటుందంటూ చిత్రయూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అనుష్క ఇప్పటి వరకూ చేయని రొమాన్స్ ను బాహుబలి మూవీలో రాజమౌళి చూపించబోతున్నాడని ఇప్పటికే కొంత కథ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని రాజమౌళి భావించినా, ఇప్పటికైతే ఇది లీకైపోయి.. టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement