
'లింగా' పైరసీ సీడీలు సీజ్!
గుంటూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డిసెంబర్ 12న శుక్రవారం విడుదలైన లింగా చిత్రానికి సంబంధించి పైరసీ సీడీలను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ సంఖ్యలో పైరసీ సీడీలు లభించడం కలకలం రేపింది. సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి.
మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటుగా 22 కంప్యూటర్ మోనిటర్లను, ఆరు ఇన్వెర్టర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.