Lingaa
-
రజినీకాంత్ వేలు పెట్టారు.. అందుకే సినిమా ఫ్లాప్: డైరెక్టర్
దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. చిన్న హీరోలకు అయితే చెల్లుబాటు అవుతుంది గానీ పెద్ద హీరోల్లో కొందరు మాత్రం ప్రతి దానిలో వేలు పెడుతుంటారు. హిట్ కొడితే తమ క్రెడిట్ అన్నట్లు చెప్పుకొంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిదే తప్పు అన్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన పని గురించి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ నిజాలు బయటపెట్టారు. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్‌తో 'ముత్తు', 'నరసింహా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. ముచ్చటగా మూడోసారి కలిసి 'లింగా' తీశారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. 2014లో రిలీజైన ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్ర సెకండాఫ్‌లో రజినీకాంత్ వేలు పెట్టారని, ఎడిటింగ్ పూర్తిగా మార్చేశారని అందుకే పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)'ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ చేసేందుకు నాకు టైమ్ కూడా ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తొలగించేశారు. బెలూన్ జంపింగ్ సీన్ జోడించారు. మొత్తానికి 'లింగా'ని గందరగోళం చేశారు' అని కేఎస్ రవికుమార్ తన ఆవేదనని దాదాపు పదేళ్ల తర్వాత బయటపెట్టారు.2016లో ఇదే సినిమా గురించి ఇదే దర్శకుడు మాట్లాడుతూ.. రూ.150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడేమో సినిమాని రజినీకాంత్ గందరగోళం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో 30 శాతం మాత్రమే వసూళ్ల రూపంలో రిటర్న్ వచ్చాయని, దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు తిరిగి డబ్బులిచ్చారని టాక్.ఇకపోతే రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'.. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
రజనీకాంత్‌కు మదురై కోర్టు సమన్లు
మదురై: 'లింగా' సినిమా కథ వివాదంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మదురై కోర్టు మంగళవారం సమన్లు జారీచేసింది. తన కథను చౌర్యం చేసి.. 'లింగా' సినిమా కోసం వాడుకున్నారని రచయిత కేఆర్ రవి రథినామ్ మదురై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రజనీకాంత్‌తోపాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్, చిత్ర రచయిత బీ పొన్‌కుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు కోర్టు సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఏప్రిల్ 30వతేదీలోగా విచారణ పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు మదురై మున్సిఫ్ కోర్టు జడ్జిని ఆదేశించింది. తన స్క్రిప్ట్‌ను దొంగలించి 'లింగ' సినిమాకు వాడుకున్నారని కేఆర్ రవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన మదురై కోర్టు 2014 డిసెంబర్లో సినిమా విడుదలకు ముందే నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు పలు ఆదేశాలు ఇచ్చింది. డిమాండ్ డ్రాఫ్ట్‌గా రూ. 5 కోట్లు, అదనపు గ్యారంటీగా మరో రూ. 5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
కోర్టుకు ‘లింగా’
చెన్నై : లింగా వ్యవహారం ఆరోపణలు ఆందోళనలు దాటి కోర్టు గుమ్మం తొక్కింది. హత్యా చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆళ్వాతిరునగర్‌కు చెందిన ఆర్ సింగారవడివేలన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజినీకాంత్ నటించిన లింగా చిత్ర తిరుచ్చి, తంజావూర్ ఏరియాల విడుదల హక్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. లింగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రం విజయం సాధించడం ఖాయం అని అలాకాని పక్షంలో నష్టం వాటిల్లిన బయ్యర్లకు పరిహారం చెల్లిస్తానని రజనీకాంత్ అన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.7.13 కోట్లకు లింగా చిత్రాన్ని కొన్నానన్నారు. అయితే లింగా చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కోన్నారు. దీంతో మరో వైపు నష్టపోయిన థియేటర్ల యాజమాన్యం పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నారని వివరించారు. దాంతో ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి నిర్మాత, చిత్ర హీరోలపై ఒత్తిడి తీసుకురాగా చివరికి రజినీకాంత్ నష్టపరిహారంగా రూ.12.5 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చారని తెలిపారు. అయితే అందులో ఆరుకోట్లు మాత్రమే చెల్లించారని మిగిలింది అడిగితే కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్న తరువాత ఇస్తామన్నారని అన్నారన్నారు. వారి మాట ప్రకారం కోర్టులో కేసును వాపస్ తీసుకున్నామని... అయినా మిగిలిన రూ. ఆరు కోట్లు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా రజినీకాంత్ రెచ్చగొట్టడంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థాను ఇతర నిర్మాతలందరకీ లేఖలు రాసి తనతో సంప్రదించిన తరువాతే సింగర వడివేలన్‌కు చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వాలని చెబుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వాట్స్‌యాప్‌లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయమై గత 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషనర్ తరపున జి విజయకుమార్, ఎం సతీష్‌కుమార్ హాజరై వాదించారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రెండు వారాల పాటు కేసును వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్లీ తెరపైకి లింగా వివాదం
-
'ఆ సినిమా'కు ఇంకా ముగింపు కార్డు పడలేదు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్ర సమస్యకు ముగింపు కార్డు పడలేదు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి పోరుకు తయారవుతున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే. రజనీ కాంత్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియార్కు రూ.12.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేటట్లు మిగిలిన నష్టాన్ని రజనీకాంత్ ...వేందర్ మూవీస్ సంస్థకు తక్కువ కాల్షీట్తో చేసే చిత్రం ద్వారా పొందాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు.. తిరుపూర్ సుబ్రమణియం సూచించారు. దానికి అంగీకరించిన వారంతా అంగీకరించి పోరాటానికి స్వస్తి పలికారు. అయితే రజనీకాంత్ చెల్లిస్తానన్న రూ.12.5 కోట్లు మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచలేదని వారు ఆరోపించారు. ఈ విషయమై లింగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొంటూ నష్టపరిహారంగా చెల్లిస్తానన్న రూ.12.5 కోట్ల రూపాయల్లో మొత్తం రూ. 5.89 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. సినీ సంఘాలు కల్పించుకుని నిర్ణయించిన నష్టపరిహారం విషయంలో తాము మోసపోయామని వాపోయారు. కాబట్టి ఈ వ్యవహారంలో రజనీకాంత్ జోక్యం చేసుకుని రూ.12.5 కోట్లను సమానంగా పంచాలన్నారు. -
‘లింగా’ సమస్య మళ్లీ మొదటికి?
చెన్నై : కొలిక్కి వచ్చిందనుకున్న లింగా చిత్ర సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టపరిహారంగా రూ.10కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ డబ్బును నష్టపోయిన వారికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లింగా చిత్ర చెంగల్పట్టు ఏరియా డిస్ట్రిబ్యూటర్ మన్నన్, ఉత్తర, దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణమూర్తి, నెల్లై ఏరియా డిస్ట్రిబ్యూటర్ రూపన్ సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్రానికిగానూ చెంగల్పట్టు ఏరియాకు ఏడున్నర కోట్లు, ఆర్కాడు ఏరియాకు నాలుగు కోట్లు, నెల్లై ఏరియాకు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపా రు. మొదట్లో నష్టపరిహారం చెల్లించాలంటూ బయ్యర్లు గగ్గోలు పెట్టి, ఇప్పుడు కట్ట పంచాయితీ చేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లతో చర్చించకుండా తిరుపూర్ సుబ్రమణియన్ ఏకపక్ష నిర్ణయాలతో కట్ట పంచాయితీ చేయరాదని సూచించారు. ఇంతకు ముందు రజనీ నటించిన పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారని తెలిపా రు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లింగా చిత్ర నష్టాల్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలనడం ఎంతమాత్రమూ సమంజసం కాదని పేర్కొన్నారు. నష్టపరిహారాన్ని సక్రమం గా పంచాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. -
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
చెన్నై: రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరైన్ పిక్చర్స్ భాగస్వామి సింగరవడివేలన్ ఈ పిటిషన్ వేశారు. రజనీ తన పలుకుబడి ఉపయోగించి 'లింగా'కు వినోదపు పన్ను మినహాయింపు ఇప్పించారని, తమిళ సంస్కృతి అభివృద్ధికి దోహదపడే చిత్రాలకు మాత్రమే వినోదపు పన్ను రాయితీ వర్తిస్తుందన్నారు. 'లింగా' చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉన్నందున దీనికి రాయితీ వర్తించదన్నారు. -
రంగంలోకి రజనీ అభిమానులు
లింగా చిత్ర వ్యవహారం రంగులు మారుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రం రజనీ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 12న భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయామంటూ రోడ్డెక్కారు. కోర్టులు, నిరాహారదీక్షలు ఆందోళన బాటపట్టారు. దీంతో రజనీకాంత్ జోక్యం చేసుకోక తప్పలేదు. లింగా వసూళ్లపై దర్యాప్తు చేయించి నివేదికను నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు పంపారు. దీంతో ఆయన 10 శాతం నష్టపరిహారం చెల్లించగలనని తేల్చి చెప్పేశారు. అందుకు సమ్మతించిన డిస్ట్రిబ్యూటర్లు ఇక రజనీకాంత్‌ను నమ్మి ప్రయోజనం లేదని భిక్షాటన చేస్తామంటూ ప్రకటించారు. రజనీకాంత్ ఇంటి నుంచే ఈ భిక్షాటన పోరాటం మొదలెడుతామని వెల్లడించారు. దీన్ని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే తమిళ దర్శకుల సంఘం రజనీకి బాసటగా నిలవగా కొన్ని రాజకీయ సంఘాలు డిస్ట్రిబ్యూటర్లకు వత్తాసు పలకడం విశేషం. దక్షిణ భారత నటీనటుల సంఘం రజనీకే మద్దతు అన్న ప్రచారానికి ఆ సంఘం అధ్యక్షుడు ఖండించారు. ఇప్పటి వరకు ఈ చోద్యం చూస్తూ మౌనం వహించిన రజనీ అభిమానులు ఇప్పుడు రంగంలోకి దిగారు. డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ, నగరంలో పోస్టర్లు అంటించారు. మరో పక్క భిక్షాటన పోరు బాటకు సిద్ధమవుతున్న డిస్ట్రిబ్యూటర్లకు పోలీసులు అనుమతి లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
'లింగా' నష్టాలకు రజనీకాంత్ బాధ్యుడు కాదు
చెన్నై: 'లింగా' సినిమా నష్టాలు రావడానికి రజనీకాంత్ బాధ్యత కాదని తమిళ చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ ఇంటిముందు భిక్షాటన చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడం సరికాదని పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'రజనీకాంత్ సినిమాలు చాలా వరకు భారీ విజయం సాధించాయి. రజనీతో సినిమాలు తీసినవారు భారీ లాభాలను పొందారు. లింగా సినిమా పరాజయం కావడానికి రజనీకాంత్ కారణం కాదు. నష్టాలకు ఆయనను బాధ్యుణ్ని చేయడం సరికాదు. పరిహారం కోసం డిస్ట్రిబ్యూటర్లు భిక్షాటన చేయాలని నిర్ణయించడాన్ని ఖండిస్తున్నాం' అని నిర్మాతల మండలి ఓ ప్రకటనలో తెలిపింది. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి నుంచి భిక్షాటన చేసి ఆందోళన నిర్వహించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. -
‘లింగా’ కోసం రజనీ
లింగా చిత్ర సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ వచ్చారు. ఆయన హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన భారీ చిత్రం లింగా. గత నెల 12న ఒక్క తమిళనాడులోనే 750 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వసూళ్ల శాతం పడిపోయి బయ్యర్లు నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ చెన్నై హైకోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ లింగా చిత్ర సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. చిత్రం వసూళ్లపై పూర్తిగా ఆధారాలను సేకరించడానికి కోవైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన ఇచ్చే నివేదిక ప్రకారం, ఎవరికెంత నష్టపరిహారం చెల్లించాలి అన్న విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. -
సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యార న్నది పరిశ్రమ వర్గాల సమచారం. అయితే దర్శకుడెవరన్న విషయంపైనే రకరకాల ప్రచారం జరుగుతోంది. కోచ్చడయాన్ 3డి యానిమేషన్ చిత్రం నిరాశపరచడంతో త్వరితగతిన మరో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న రజనీ ఆలోచనకు తెరరూపమే లింగా చిత్రం. తన ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రం రూపొందించగల దిట్ట కె ఎస్ రవికుమార్ అని భావించి లింగా చిత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ చిత్రం నిర్మాతకు 200 కోట్లు వ్యాపారం చేసిందని సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లే భారీ నష్టాలకు గురయ్యామంటూ దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో నష్టపరిహారానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ తదుపరిచిత్రానికి దర్శకుడెవరన్న అంశంపై నలుగురైదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పి.వాసు, శంకర్, సురేష్‌కృష్ణ, సుందర్ సి, కెఎస్ రవికుమార్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పి.వాసు ఇప్పటికే రజనీతో చంద్రముఖి, కుచేలన్ చిత్రాలు తెరకెక్కించగా వాటిలో చంద్రముఖి అమోఘ విజయం సాధించగా కుచేలన్ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత రజనీతో చంద్రముఖి-2 రూపొందించాలని పి.వాసు ఆశించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. శంకర్ రజనీకాంత్ కలయికలో శివాజీ, ఎందిరన్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా ఎందిరన్-2 ప్రయత్నం తెరపైకి కొచ్చింది. అయితే ఈ విషయమై శంకర్ నుంచి గానీ, రజనీ నుంచి గానీ సరైన క్లారిటీ రాలేదు. అదే విధంగా కెఎస్ రవికుమార్ రజనీతో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. లింగా చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ సుదీప్ హీరోగా నటించే చిత్రంలో బిజీగా ఉన్నారు. అదే విధంగా భాషా, అన్నామలై వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సురేష్‌కృష్ణ రజనీతో భాషా-2 చేయాలని ఆశిస్తున్నారు. దీనికి స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. రజనీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే షూటింగ్ అనేలా ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్‌స్టార్ అరుణాచలం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుందర్‌సి కూడా ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు కోడంబాక్కం టాక్. మరి వీరిలో ఎవరిపై రజనీ దృష్టి పడుతుందో వేచి చూడాల్సిందే. -
కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్
చెన్నై: లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చయవద్దని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు మంచి మిత్రులన్నారు. అందుకే తాను కన్నడ వ్యక్తినైన తనతో సినిమా చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, .లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయామని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రజనీకాంత్ జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
లింగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహారదీక్షలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కష్టాలు తప్పటం లేదు. కొచ్చడయాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే లింగా కష్టాలు పంపిణీదారులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లింగా సినిమాను విడుదల చేసిన పంపిణీదారులు తాము నిండా మునిగిపోయామంటూ చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఏడుగురు పంపిణీదారులు 700 మంది థియేటర్ల యాజమానులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్క పంపిణీదారుడు దాదాపు 7- 10 కోట్ల రూపాయల మేరకు నష్టపోయామని వాపోతున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమిళుడు కాకపోవటం, ప్రదాన పంపిణీదారుడు వేందర్ సినిమా నష్టాలతో తనకు సంబంధం లేదనటం... పంపిణీదారులు, థియేటర్ యాజమానులను రోడ్డున పడేసేలా చేసింది. లింగా చిత్రం ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా వసూలు చేయలేదని, తాము 75శాతం నష్టపోయామని వారు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈ విషయమై చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ నుంచి హామీ రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. -
'లింగ' థియేటర్లో రజనీ అభిమాని మృతి
మూత్రపిండాల సమస్య ఉన్నా లెక్కచేయకుండా తన అభిమాన నటుడి సినిమా చూడాలని వచ్చిన ఓ వ్యక్తి.. సినిమా థియేటర్లోనే ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) రజనీకాంత్ వీరాభిమాని. అతడు ఎలాగైనా 'లింగ' సినిమా చూడాలని అనుకున్నాడు. తన నరానికి పెట్టిన డ్రిప్ ట్యూబ్ అలాగే ఉంచుకుని మరీ థియేటర్‌కు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో అతడికి చికిత్స జరుగుతోంది. అయినా ఎలాగోలా ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నాడు. సినిమా పూర్తయిన తర్వాత కూడా అతడు ఎంతకీ లేవకపోవడంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూడగా.. అప్పటికే మరణించాడు. పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని ఆస్పత్రికి పంపారు. -
'లింగ' వివాదానికి ఇంతటితో తెర దించండి
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రంలో ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై దర్శక, నిర్మాతలు, రచయిత స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. ఆ సన్నివేశాలను, సంభాషణలనూ చిత్రం నుంచి తొలగించారు. నిర్మాత 'రాక్‌లైన్' వెంకటేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అన్నివర్గాల ప్రేక్షకులు సినిమాకు ముఖ్యులేనని, సినిమా ద్వారా సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, అయితే పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని 'లింగ' చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించిన రచయిత శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన చేశారు. పెద్ద మనసుతో 'లింగ' చిత్రంపై వివాదానికి ఇంతటితో తెర దించాల్సిందిగా అన్ని వర్గాలనూ శశాంక్ ఈ సందర్భంగా అభ్యర్తించారు. -
అసత్య ప్రచారమొద్దు
లింగాపై సత్యదూర ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచా రం సాగుతోంది. చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నారుు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది. లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను కేఎస్.రవికుమార్ ఖండించారు. -
'లింగా' పైరసీ సీడీలు సీజ్!
గుంటూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డిసెంబర్ 12న శుక్రవారం విడుదలైన లింగా చిత్రానికి సంబంధించి పైరసీ సీడీలను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ సంఖ్యలో పైరసీ సీడీలు లభించడం కలకలం రేపింది. సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటుగా 22 కంప్యూటర్ మోనిటర్లను, ఆరు ఇన్వెర్టర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హ్యాపీ బర్త్ డే లింగ..!
-
నేడు రజినీకాంత్ 63వ పుట్టినరోజు
-
ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో 'లింగా' విడుదల
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న శుక్రవారం లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు కోలహాలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా అభిమానులందరూ బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాండిచ్చేరిలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రం విడుదలైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. -
తెలిసింది గోరంత...తెలియాల్సింది కొండంత!
సినిమా హాలు లోపలికెళ్లగానే తలుపులు మూసేస్తారు. అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో బొమ్మ పడుతుంది వెండి తెర మీద. బొమ్మ పడగానే చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్లల్లో వెలుగు నిండుతుంది. ఎవణై్నతే చూడాలని వ్యయప్రయాసలకోర్చి వచ్చామో, వాడిని చూడగానే కనిపించే వెలుగు అది. ప్రేక్షకుడు వాడిని చూస్తాడు. వాడిలోని వాడిని చూస్తాడు. వేడిని చూస్తాడు. తన వాడిలో తనని తాను చూసుకుంటాడు. ఆ వెలుగు పంచిన ఆనందంలో కాస్సేపు తన జీవితాన్ని తను మర్చిపోతాడు. అలా చీకటిలో వెలుగును పంచేవాడే రజనీకాంత్. రజని అంటే చీకటి. కాంత్ అంటే వెలుగునిచ్చేవాడు. ఒక సాధారణ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అనడానికి కొలమానం రజనీకాంత్. ఒక అసాధారణ వ్యక్తి ఎంత ఒదిగి ఉండవచ్చు అన్నదానికీ కొలమానం రజనీకాంత్. కింద నుంచి పైకొచ్చినా, పై నుండి కిందికొచ్చినా, తల కిందులుగా తపస్సు చేసినా రజనీకాంత్‌ని కొట్టేవాడు ఈ తరంలో లేడు. ఎందుకంటే రజనీకాంత్ ఎవణై్ననా కొట్టేయగలడు కాబట్టి. ఇదంతా ఎందుకంటే... ఇవ్వాళ రజనీకాంత్ పుట్టిన రోజు. ‘లింగ’గా మరోసారి పుట్టిన రోజు. రజనీ ఒక పుట్టిన రోజే ఎంతో ఘనంగా ఉంటుంది. రెండు పుట్టిన రోజులు ఒకే రోజొస్తే ఇంకెంత ఘనంగా ఉంటుందో? చాలా మంది నటులకి పాత్ర పూనుకుంది అంటాం. వాళ్లు కూడా ఫలానా పాత్ర చాలా కాలం నాలో ఉండిపోయింది, అలాగే బిహేవ్ చేసేవాణ్ణి అనడం వింటాం. ఒక్కసారయినా రజనీ సార్ బాషా లాగో, బాబా లాగో, రోబో లాగో, నరసింహలాగో, ముత్తులాగో, అరుణాచలం లాగో, శివాజీలాగో, లింగాలాగో కొన్ని రోజులుంటే ఎంత బావుణ్ణు. సమాజంలో ఎన్ని వ్యవస్థలు ఆదరాబాదరాగా ప్రక్షాళనై పోయేవి? స్వచ్ఛభారత్ ఎంత తొందరగా సాధ్యమై పోయేది? అనిపిస్తుంటుంది నాకు. ఈయన మరీ డౌన్ టు ఎర్త్ - పాత్ర ఎత్తు ఆకాశమంత హైగా ఉంటుంది. ప్యాకప్ చెప్పగానే మనిషి పాతాళమంత లోతైన భావజాలంతో ఒదిగిపోయి ఉంటాడు. చాలా రోజులు ఆయన్ని ఆయన చూసుకోవడం వల్ల కలిగిన ఇన్సెక్యూరిటీ కారణం అనుకునే వాణ్ణి. కానీ కాదు. ఏ ప్రభావమూ తనపైన పడలేని, పడనీయని యోగ స్థితి అది. సినిమాయే జీవితంగా చెన్నై వచ్చిన బస్ కండక్టర్... సీఎమ్ కాన్వాయ్ వస్తుందని తనని ఇంటికెళ్లనీయకపోతే, కారు దిగి, సీఎమ్‌కే ట్రాఫిక్ జామ్ రుచి చూపించిన సూపర్‌స్టార్. ఒకటి అసలు - ఒకటి నకిలీ. నకిలీని అసలనుకుని భ్రమ పడకుండా, అసలుని నకిలీగా భావించకుండా - ఏ మకిలీ అంటని స్వచ్ఛతని మనసులోను, మెదడులోను, మాటలోను, నడవడిలోను, నిజాయతీలోను నింపుకున్న వ్యక్తి రజనీ మాత్రమే. అందుకే ఆయనలో అంత వెలుగు. అందుకే ఆయన్ని చూసిన ప్రేక్షకుడి కళ్లల్లో మరింత వెలుగు. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ రిచ్‌నెస్ - అంటే, రజనీకాంత్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఆయన అంత సింపుల్. అలాగే ఆయన ఎన్నో మంచి లక్షణాలకి శాంపిల్. మరెన్నో రుగ్మతలకి పిల్. అశావహ దృక్ఫథం మనిషికి ఆక్సిజన్ లాంటిది. రజనీకాంత్ ఆ ఆక్సిజన్. రజనీ కాంత్ ఒక రెడ్ బుల్. రజనీకాంత్‌ని విశ్లేషించలేము. విసుగొచ్చేదాకా విశేషణాలతో పొగడగలము. జీసస్, బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి... వీళ్లందరినీ మానవుల రూపంలో ఉన్న దేవుళ్లుగా కొలుస్తాం. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే అవకాశం తర్వాతి తరంలో ఎవరికైనా ఉంటే అది రజనీ సార్కే. కమర్షియల్ సినిమా నుంచి ఈ స్థితి సాధించడం మరీ కష్టమైన విషయం. ఆయనకి అందరు హీరోలకీ ఉన్నట్టు ఫ్యాన్స్ లేరు. చాలామంది దేవుళ్లకున్నట్టు భక్తులున్నారు. ఆయనకి గుడి లేదు. కటౌట్లకి పాలాభిషేకాలు, రక్తంతో తిలకాలూ లేవు. ధార్మిక సేవా కార్యక్రమాలున్నాయి. ఆయనకి పబ్లిసిటీ లేదు. ఆయన వెనకే పబ్లిక్ ఉన్నారు. ఆయనకి రాజకీయాలు తెలీదు. రాజకీయాల్లో ఆయనున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, నిలబెట్టగలరు. కానీ దాని జోలికెళ్లరు. డబ్బు సంపాదించాక పక్క వ్యాపారాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న ఎంతోమంది స్టార్లున్నారు. కానీ ఆయన ఏ ఐపిఎల్ టీమ్కీ ఫ్రాంఛైజీ కాదు. ఏ వ్యాపారానికీ అధినేత కాదు. ఆయనకి స్కీముల్లేవు. అందుకే ఏ స్కాముల్లోనూ లేరు. ఆయనకి ఈ రోజు ఎలా బతకాలో తెలుసు. నిన్న తనేమిటో గుర్తు. రేపటి గురించిన ఆలోచన లేదు. అందుకే అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. తన మీద, తన వయసు మీద తనే జోకులేసుకోగలుగుతున్నారు. నటనే జీవితమయ్యాక కూడా, జీవితంలో నటించకుండా ఉండగలుగుతున్నారు. రజనీ ఒక స్ఫూర్తి పాఠం. రజనీ ఒక అతీత శక్తి. రజనీ ఒక జనాకర్షణ యంత్రం. రజనీ ఒక తారకమంత్రం. మనిషి నుంచి మనీషిగా మారే ప్రయాణం రజనీకాంత్. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాడు. రజనీకాంత్ అంటే చీకటిలో వెలుగు నింపేవాడు. అందుకే రజనీకాంత్ - ఒక గురువు. ప్రతి మనిషీ బ్రతకడానికి నేర్చుకోవలసిన తప్పనిసరి పాఠం రజనీకాంత్. ఈ పాఠం చదువుతున్నా, విన్నా, వెండితెర మీద చూసినా ఆనందం. తాదాత్మ్యం. దటీజ్ రజనీ సర్. లాంగ్ లివ్ రజనీ సర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సర్. మీ...వి.ఎన్. ఆదిత్య దర్శకుడు -
లింగాకు పోటీగా....
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగాతో ఢీ కొట్టడానికి చిట్టెలుకల్లాంటి రెండు చిత్రాలు ఇసుమంత కూడా భయపడకుండా రెడీ అవుతుండడం విశేషమే. రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా జంటగా నటించిన అత్యంత భారీ, బ్రహ్మాండ చిత్రం లింగా. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు అంతా కొత్త తారలతో రూపొందిన యారో ఒరువన్, ఇన్నుమా నమ్మైనంబ రాంగ అనే లోబడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కథ, కథనం, మాటలు, దర్శకత్వం, నిర్మాత ఇలా అన్నితానై కెఎన్ పైజు నిర్మించిన చిత్రం యారో ఒరువన్. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని లింగా చిత్రానికి పోటీగా విడుదల చేయడం గురించి కె ఎన్ పైజు మాట్లాడుతూ రజనీకాంత్ చిత్రం చూడటానికి వచ్చి టికెట్లు దొరక్క మిగిలిపోరుున ప్రేక్షకులు తమ చిత్రానికివచ్చినా చాలు యారో ఒరువన్ హిట్ అయినట్లే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఈ చిత్రం చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచరాదని అంటున్నారు. అలాంటి ఆశతోనే ఇన్నుమా నమ్మైనంబరాంగ చిత్ర నిర్మాత దర్శకనిర్మాత ఉన్నారు. మరి లింగా చిత్రం ఈ రెండు చిత్రాల నిర్మాతలను గట్టెక్కిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. -
రజనీ బర్త్‌డే స్పెషల్ : లింగావతారం
-
లింగాపై స్టే కుదరదు
లింగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఆ చిత్రంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఫిర్యాదు చెన్నై హైకోర్టులో విచారణకు వచ్చింది. బాలాజీ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లింగా చిత్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటూ తాము తెలుగులో చిరంజీవి, సోనాలిబింద్రే నటించిన ఇంద్ర చిత్రం తమిళ రీమేక్ హక్కులు పొందామని వెల్లడించారు. ఈ చిత్ర కథ రజనీకాంత్ నటించిన లింగా చిత్ర కథ ఒకేలా ఉన్నాయని తెలిపారు. ఇంద్ర ఇతివృత్తంతోనే లింగా చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. లింగా చిత్రం విడుదలైతే తాము తీవ్రంగా నష్టపోతామని కాబట్టి ఆ చిత్ర విడుదలపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరారు. అదే విధంగా ఒక లా కమిషన్ ఏర్పాటు చేసి లింగా చిత్రాన్ని ఇంద్ర చిత్రాన్ని చూసి కథ గురించి నిర్ణయం వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో లింగా చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగా చిత్రానికి తాను దర్శకుడిని మాత్రమేనని వివరించారు. అయినా లింగా చిత్ర కథకు, తెలుగు చిత్రం ఇంద్ర కథకు సంబంధం లేదన్నారు. భారతదేశం లోని డ్యామ్‌ల ఇతివృత్తాన్ని తీసుకుని కథ, కథనాలను తయారు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్‌దారుడి ఉద్దేశం చూస్తుంటే లింగా చిత్రానికి సంబంధించిన వారందరినీ బెదిరించేలా ఉందని ఆరోపించారు. ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి లింగా చిత్రంపై తాత్కాలిక నిషేధం విధంచడం కుదరదని వెల్లడిస్తూ కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు. -
ఈ వయసులో డ్యూయెట్లు నిజంగా శిక్షే : రజనీకాంత్
‘‘నా మొదటి సినిమా తొలి సీన్ చేస్తున్నప్పుడు పడనంత టెన్షన్ ఈ సినిమా కోసం పడ్డాను. ఆ టెన్షన్‌కి కారణం ఇద్దరమ్మాయిలు’’ ... ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ‘లింగ’ ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ కాసేపు తమాషాగా, ఇంకాసేపు సీరియస్‌గా ప్రసంగించారు. ఇదో అద్భుతం ‘‘దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నేను చేసిన చిత్రం ‘లింగ’. మధ్యలో ‘కోచడయాన్’ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా. ‘లింగ’ పరంగా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇది చాలా పెద్ద సినిమా. ఇందులో భారీ తారాగణం ఉన్నందువల్ల, భారీ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్ల ఈ చిత్రం పెద్దది అనడం లేదు. ఈ కథ చాలా గొప్పది. స్వాతంత్య్రం రాకమునుపు, ఆ తర్వాత జరిగే కథ ఇది. ప్రధానంగా ఓ ఆనకట్ట నిర్మాణం నేపథ్యంలో సాగుతుంది. దాదాపు 60, 70 సన్నివేశాల్లో వేల మంది నటీనటులు, ఏనుగులు, రిస్కీ ఫైట్స్, పెద్ద పెద్ద సెట్స్.. ఇలా భారీ ఎత్తున ఉన్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ఆ ఘనత టెక్నీషియన్లదే. అలాగే, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్లానింగ్‌ని మెచ్చుకోవాల్సిందే. రాజమౌళితో సినిమా చేస్తా... 30, 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలా? అని కేయస్ రవికుమార్, నేను ఆలోచించాం. ఎంత పెద్ద సినిమా అయినా తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చని యువతరానికి చెప్పాలనుకున్నాం... సాధించాం. ఒక్క విషయం.. నేను ‘బహుబలి’ గురించి ప్రస్తావించడంలేదు. ఆ చిత్రాన్ని రాజమౌళి ఎంతో గొప్పగా తీస్తున్నారు. నేను కూడా షూటింగ్ చూశాను. తప్పకుండా భారతదేశంలో రాజమౌళి నంబర్ వన్ టెక్నీషియన్. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తా. ఈ ఇద్దరమ్మాయిలే కారణం నా మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’ మొదటి సీన్ అప్పుడు పడని టెన్షన్ ఈ చిత్రం అప్పుడు పడ్డాను. దానికి కారణం అనుష్క, సోనాక్షి. అనుష్క చాలా మంచి అమ్మాయి. సోనాక్షి నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఈ ఇద్దరితో డ్యూయెట్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏ ఆర్టిస్ట్‌కైనా భగవంతుడు విధించే శిక్ష ఏంటో చెప్పనా?.. 60 ఏళ్ల వయసులో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడటం. అలాగే, జగపతిబాబు గురించి చెప్పాలి. మేమిద్దరం ‘కథానాయకుడు’లో నటించాం. కానీ, తనేంటో ‘లింగ’ సమయంలో అర్థమైంది. చిత్రపరిశ్రమలో నేను చూసిన జెంటిల్మెన్లో జగపతిబాబు ఒకరు. రజనీ సినిమాలో కథ ఉంటుందా అన్నారు ఈ నెల 12న లింగ’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఈ కథ మాది’ అంటూ చెన్నయ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు కేసు పెట్టారు. దానికి స్పందిస్తూ.. ‘ఏంటీ రజనీ సినిమాలో కథ ఉంటుందా? ఆ కథ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తప్పకుండా ‘లింగ’ చూడాలి’ అని కొంతమంది ట్విట్టర్లో స్పందించారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. కానీ, ఆ కథ పొన్కుమరన్ది. ఆ నలుగురిదీ కాదు. నన్ను క్షమించండి హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ చేసిన రోజున రావాలనే అనుకున్నా. కానీ, మా కుటుంబానికి చెందిన రెండు ముఖ్యమైన పెళ్లిళ్లు ఉండటంతో రాలేకపోయా. నన్ను క్షమించండి. హుద్ హుద్ బాధితుల సహాయార్థం నా వంతుగా కొంత ఫండ్ ఇస్తా’’ అని రజనీకాంత్ చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘రజనీతో గతంలో సూపర్ హిట్ సినిమా తీశాను. మేమిద్దరం మరో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. భవిష్యత్తులో మరో అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పారు. కె. విశ్వనాథ్ మాట్లాడుతూ -‘‘బాపుగారు, బాలచందర్గార్లతో వారం రోజులైనా పని చేయాలనీ, రజనీకాంత్‌తో సినిమా చేయాలనీ ఉండేది. ‘ఉత్తమ విలన్’లో బాలచందర్‌గారితో నటించా. ‘లింగ’లో రజనీతో చేశాను’’ అని తెలిపారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘అతిశయోక్తి కాదు కానీ, రజనీ అంత గొప్ప మనిషి లేరు. ఎవరేమన్నా పట్టించుకోరు.. ఆశీర్వదిస్తారు. అలా ఎలా ఉండగలుగుతున్నారు? అనడిగితే -‘‘ప్రతి రోజూ ఏదో సందర్భంలో నేనో బస్ కండక్టర్ని అనే విషయం గుర్తొస్తుంటుంది’’ అన్నారు. అదీ రజనీకాంత్ అంటే’’ అని చెప్పారు. కేయస్ రవికుమార్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు రజనీకాంత్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ ఘనత దక్కించుకున్న మొదటి సినిమా ఇదే. రజనీగారి పుట్టినరోజుకి ఇది మంచి బహుమతి అవుతుంది’’ అన్నారు. రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చేయడం నా ఏడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పారు. ఈ వేడుకలో రమేశ్ ప్రసాద్, నందు అహుజా, రత్నవేలు, పొన్కుమరన్, బీవీయస్‌యన్ ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి కొర్రపాటి, అనుష్క, సోనాక్షీ సిన్హా, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు.