‘లింగా’ కోసం రజనీ | Rajinikanth Resolve Lingaa cinema problem | Sakshi

‘లింగా’ కోసం రజనీ

Jan 25 2015 12:34 AM | Updated on Sep 2 2017 8:12 PM

‘లింగా’ కోసం రజనీ

‘లింగా’ కోసం రజనీ

లింగా చిత్ర సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ వచ్చారు. ఆయన హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన

 లింగా చిత్ర సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ వచ్చారు. ఆయన హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన భారీ చిత్రం లింగా.  గత నెల 12న ఒక్క తమిళనాడులోనే 750 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వసూళ్ల శాతం పడిపోయి బయ్యర్లు నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ చెన్నై హైకోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ లింగా చిత్ర సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. చిత్రం వసూళ్లపై పూర్తిగా ఆధారాలను సేకరించడానికి కోవైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన ఇచ్చే నివేదిక ప్రకారం, ఎవరికెంత నష్టపరిహారం చెల్లించాలి అన్న విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement