'ఆ సినిమా'కు ఇంకా ముగింపు కార్డు పడలేదు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్ర సమస్యకు ముగింపు కార్డు పడలేదు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి పోరుకు తయారవుతున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే.
రజనీ కాంత్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియార్‌కు రూ.12.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేటట్లు మిగిలిన నష్టాన్ని రజనీకాంత్ ...వేందర్ మూవీస్ సంస్థకు తక్కువ కాల్షీట్‌తో చేసే చిత్రం ద్వారా పొందాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు.. తిరుపూర్ సుబ్రమణియం సూచించారు. దానికి అంగీకరించిన వారంతా అంగీకరించి పోరాటానికి స్వస్తి పలికారు.
అయితే రజనీకాంత్ చెల్లిస్తానన్న రూ.12.5 కోట్లు మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచలేదని వారు ఆరోపించారు. ఈ విషయమై లింగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొంటూ నష్టపరిహారంగా చెల్లిస్తానన్న రూ.12.5 కోట్ల రూపాయల్లో మొత్తం రూ. 5.89 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. సినీ సంఘాలు కల్పించుకుని నిర్ణయించిన నష్టపరిహారం విషయంలో తాము మోసపోయామని వాపోయారు. కాబట్టి ఈ వ్యవహారంలో రజనీకాంత్ జోక్యం చేసుకుని రూ.12.5 కోట్లను సమానంగా పంచాలన్నారు.