distributors fasting
-
మళ్లీ తెరపైకి లింగా వివాదం
-
'ఆ సినిమా'కు ఇంకా ముగింపు కార్డు పడలేదు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్ర సమస్యకు ముగింపు కార్డు పడలేదు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి పోరుకు తయారవుతున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే. రజనీ కాంత్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియార్కు రూ.12.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేటట్లు మిగిలిన నష్టాన్ని రజనీకాంత్ ...వేందర్ మూవీస్ సంస్థకు తక్కువ కాల్షీట్తో చేసే చిత్రం ద్వారా పొందాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు.. తిరుపూర్ సుబ్రమణియం సూచించారు. దానికి అంగీకరించిన వారంతా అంగీకరించి పోరాటానికి స్వస్తి పలికారు. అయితే రజనీకాంత్ చెల్లిస్తానన్న రూ.12.5 కోట్లు మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచలేదని వారు ఆరోపించారు. ఈ విషయమై లింగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొంటూ నష్టపరిహారంగా చెల్లిస్తానన్న రూ.12.5 కోట్ల రూపాయల్లో మొత్తం రూ. 5.89 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. సినీ సంఘాలు కల్పించుకుని నిర్ణయించిన నష్టపరిహారం విషయంలో తాము మోసపోయామని వాపోయారు. కాబట్టి ఈ వ్యవహారంలో రజనీకాంత్ జోక్యం చేసుకుని రూ.12.5 కోట్లను సమానంగా పంచాలన్నారు. -
కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్
చెన్నై: లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చయవద్దని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు మంచి మిత్రులన్నారు. అందుకే తాను కన్నడ వ్యక్తినైన తనతో సినిమా చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, .లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయామని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రజనీకాంత్ జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
లింగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహారదీక్షలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కష్టాలు తప్పటం లేదు. కొచ్చడయాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే లింగా కష్టాలు పంపిణీదారులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లింగా సినిమాను విడుదల చేసిన పంపిణీదారులు తాము నిండా మునిగిపోయామంటూ చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఏడుగురు పంపిణీదారులు 700 మంది థియేటర్ల యాజమానులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్క పంపిణీదారుడు దాదాపు 7- 10 కోట్ల రూపాయల మేరకు నష్టపోయామని వాపోతున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమిళుడు కాకపోవటం, ప్రదాన పంపిణీదారుడు వేందర్ సినిమా నష్టాలతో తనకు సంబంధం లేదనటం... పంపిణీదారులు, థియేటర్ యాజమానులను రోడ్డున పడేసేలా చేసింది. లింగా చిత్రం ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా వసూలు చేయలేదని, తాము 75శాతం నష్టపోయామని వారు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈ విషయమై చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ నుంచి హామీ రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.