Rock Line Venkatesh
-
చచ్చేవాడు.. చంపేవాడు కలిసే తిరుగుతున్నారు
‘ఆ నలుగురు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్దార్థ. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. మళ్లీ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్, టీజర్‌తో సినిమా కొత్తగా ఉండబోతోందని ముందే తెలియజేసేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పదునైన మాటలు, జబర్దస్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర పంచ్ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోన్నాయి. ఉరి తీయడానికి రమ్మని పిలిచి ప్రభుత్వం ఓ వ్యక్తికి లేఖ రాయగా, అదే టైంలో ఉరి శిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. ఈ ఇద్దరు కలిసి చేసే ప్రయాణామే ఈ సినిమా కథ. ‘హ్యాంగ్ మ్యాన్’ నేపథ్యంలో జరిగే ఈ కథలో ‘సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు... చంపేవాడు కలిసే తిరుగుతున్నారు’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. -
ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'
ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సందేశాత్మక చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో అదే బాటలో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణ సారథ్యంలో ఆటగదరా శివా అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో పాటు ఆధ్యాత్మిక భావాలను కూడా చూపేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అంతా కొత్తవారితోనే తెరకెక్కించాలని నిర్ణయించారు. తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా సినిమాను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్, బాలీవుడ్ సినిమా భజరంగీ బాయ్ జాన్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు. ఆటగదరా శివా సినిమాను కూడా తన గత చిత్రాల స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. -
‘లింగా’ కోసం రజనీ
లింగా చిత్ర సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ వచ్చారు. ఆయన హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన భారీ చిత్రం లింగా. గత నెల 12న ఒక్క తమిళనాడులోనే 750 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వసూళ్ల శాతం పడిపోయి బయ్యర్లు నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ చెన్నై హైకోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ లింగా చిత్ర సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. చిత్రం వసూళ్లపై పూర్తిగా ఆధారాలను సేకరించడానికి కోవైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన ఇచ్చే నివేదిక ప్రకారం, ఎవరికెంత నష్టపరిహారం చెల్లించాలి అన్న విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. -
రజనీ ఇమేజ్‌కు భంగం
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ ఇమేజ్‌కు భంగం కలిగించారని, లింగా చిత్రాన్ని నష్టపరిచారని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లపై ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు కొందరు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దానికి పరాకాష్టగా శనివారం చెన్నైలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టి కలకలం సృష్టించారు. దీనికి స్పం దించిన ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నిర్మించిన లింగా చిత్రం విడుదల హక్కులను ఇరాస ఎంటర్ టైన్మెంట్ సంస్థకు విక్రయించానని వారి నుంచి ఆ హక్కులను వేందర్‌మూవీస్ పొందిందని వివరించారు. ఆ సంస్థ నిర్వాహకులు వారికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించుకున్నారన్నారు. అయినా లింగా చిత్రంతో నష్టాలకు గురైన వారికి న్యాయం చేయాలని భావించానని రజనీకాంత్ ఇదే విషయం చెప్పారని అన్నారు. చిత్రం విడుదలైన ఐదువారాల తరువాత నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను గానీ, రజనీకాంత్‌ను గానీ కలిసి పరిస్థితి వివరిస్తే వారికి తప్పక న్యాయం చేసేవాళ్లం అన్నారు. అలా కాకుండా కర్ణాటక నుంచి వచ్చారు220 కోట్లు దండుకుపోయారు అంటూ తిరుచ్చి ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్, ఇతర డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నారన్నారు. తాను 220 కోట్లు దోచుకున్నట్లు నిరూపిస్తే వారి నష్టాన్ని ఇప్పుడే సెటిల్ చేస్తానని లేదంటే సింగారవేలన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఈ చిత్రాలకు లింగా ఫీవర్
లింగా చిత్రం చాలా చిత్రాల విడుదలకు అయోమయంలో పడేసిందనే చె ప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లిం గా. అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయనుంది. చిత్రం కేసులు, కోర్టులు అంటూ పలు బంధనాలను తెంచుకుని ముందుగా నిర్ణయించిన ప్రకారమే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. దీంతో మంగళవారం నుంచి టికెట్లు విడుదలవుతోందంటే చిత్ర పరిశ్రమలు ఎంత ఆసక్తి నెలకొంటుందో అభిమానుల్లో ఎంత ఉత్కంఠ చోటు చేసుకుం టుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తరువాత ఇస్తున్న మరో ఫక్తు మాస్ మసాలా చిత్రం లింగా. చిత్ర టీజర్‌కు, పాటలకు ఇప్పటికే చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో యావద్భారత సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లింగా చిత్రాన్ని ఒక్క తమిళనాడులోనే 500 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కర్ణాటక, హిందీ తదితర భాషల్లో 2,500 థియేటర్లలో విడుదలకు లింగా చిత్రం సిద్ధం అవుతోందని సమాచారం. ఇతర చిత్రాలకు దడ : లింగా చిత్ర విడుదల వివరాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇతర చిత్రాల నిర్మాతల్లో మాత్రం దడ పుట్టిస్తోంది. లింగా చిత్రంపై ఆ చిత్ర యూనిట్ చెబుతున్న దాన్ని బట్టి భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఆ చిత్రం తరువాత విడుదల కానున్న చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది. లింగా చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుండగా మరో రెండు వారాల్లోపే అంటే క్రిస్మస్ సందర్భంగా మరో ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి లో దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో బాలా నిర్మించిన పిశాచు, ప్రభుసాల్మన్ తెరపై ఆవిష్కరించిన కయల్ చిత్రా లు ఈ నెల 19 న, నటు డు సిద్ధార్థ్ నటించిన ఎనక్కుళ్ ఒరువన్, ఎస్.జె.సూర్య స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇసై, కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన కప్పల్, మగిల్ తిరుమేని దర్శకత్వంలో ఆర్య, హన్సిక జంటగా నటించిన మెగామాన్, ఎళిల్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు హీరోగా నటించిన వెళ్లక్కార దుైరె చిత్రాలు ఈనెల 25న విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ చిత్రాలన్నింటికీ లిం గా ఫీవర్ పట్టుకుందన్నది నిజం. లింగా తమిళనాడులో మాత్రమే 500 థియేటర్లలో విడుదల కానుండడంతో పొంగల్ (సంక్రాం తి) వరకు ఈ చిత్రాన్నే ప్రదర్శించడానికి చాలా థియేటర్ల యాజమాన్యం నిర్ణ యం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరిలో మరో మూడు భారీ చిత్రా లు అజిత్ ఎన్నై అరిందాల్, విక్రమ్ నటిం చిన ఐ, విశాల్ చిత్రం ఆంబళ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అంటే లింగా విడుదలకు ఈ మూడు చిత్రాల విడుదలకు మధ్య నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ ఉం ది. అలాగే లింగాకు క్రిస్మస్కు విడుదలయ్యే చిత్రాలకు మధ్య సరిగ్గా రెం డు వారాల గ్యాప్ కూడా లేదు. దీంతో ఈ ఏడు చిత్రాలకు లింగా చిత్రం ఎన్ని థియేటర్లను త్యాగం చేస్తుంది, వాటిలో ఏ చిత్రం ఎన్ని థియేటర్లను దక్కించుకుంటుంది అన్నది తెలియని పరిస్థితి. -
‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లా ఆయన్ను వెంటాడా!
‘‘సినిమారంగంలోనే ఉండాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా. డెరైక్టర్ కావాలన్న నా కల నెరవేరింది’’ అని చెప్పారు బాబీ (కె.ఎస్. రవీంద్ర). రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ ‘పవర్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన విషయం తెలిసిందే. రవితేజ, హన్సిక, రెజీనా నాయకా నాయికలుగా రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ పది చిత్రాల అనుభవం ఉన్న దర్శకునిలా ఈ సినిమా చేశావని పలువురు అగ్రదర్శకులు ప్రశంసించారని బాబీ చెప్పారు. ఆదివారం పత్రికలవారితో ఆయన మాట్లాడుతూ - ‘‘రవితేజ కెరీర్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రం ఇది. ఈ మధ్యకాలంలో టేబుల్ ప్రాఫిట్ చవిచూసిన చిత్రం కూడా. నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టే, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో, ‘పవర్’ని పక్కా కమర్షియల్ చిత్రంగా తీర్చిదిద్దాను. ఇందులో రవితేజ లుక్ బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది కదా? అన్న ప్రశ్నకు.. ‘‘ఒకరిద్దరికి నచ్చలేదేమో కానీ, ఓవరాల్‌గా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రనిర్మాత మళ్లీ నాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్నిబట్టి ఏ స్థాయి హిట్టో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. దాదాపు పదేళ్ల క్రితం తన స్వస్థలం గుంటూరులో ఓ వేడుకలో రచయిత చిన్నికృష్ణతో పరిచయం ఏర్పడిందని, ఆయన అవకాశాలిప్పిస్తారనే ఆశతో హైదరాబాద్ వచ్చేశానని బాబీ అన్నారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లా చిన్నికృష్ణ వెంటపడ్డానని, ఓ పది రోజుల తర్వాత ఒక సీన్ ఇచ్చి రాసుకు రమ్మన్నారని చెప్పారు బాబి. ఆ ఒక్క సీన్‌ని నాలుగు విధాలుగా రాయడంతో మెచ్చుకుని చిన్నికృష్ణ అవకాశం ఇచ్చారని, అదే తననీ స్థాయికి తీసుకొచ్చేలా చేసిందని బాబీ తెలిపారు.