ఈ చిత్రాలకు లింగా ఫీవర్ | Rajini files caveat to prevent passing of interim orders in Lingaa case | Sakshi
Sakshi News home page

ఈ చిత్రాలకు లింగా ఫీవర్

Published Tue, Dec 9 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

ఈ చిత్రాలకు లింగా ఫీవర్

ఈ చిత్రాలకు లింగా ఫీవర్

లింగా చిత్రం చాలా చిత్రాల విడుదలకు అయోమయంలో పడేసిందనే చె ప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లిం గా. అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేయనుంది. చిత్రం కేసులు, కోర్టులు అంటూ పలు బంధనాలను తెంచుకుని ముందుగా నిర్ణయించిన ప్రకారమే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది.
 
 దీంతో మంగళవారం నుంచి టికెట్లు విడుదలవుతోందంటే చిత్ర పరిశ్రమలు ఎంత ఆసక్తి నెలకొంటుందో అభిమానుల్లో ఎంత ఉత్కంఠ చోటు చేసుకుం టుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తరువాత ఇస్తున్న మరో ఫక్తు మాస్ మసాలా చిత్రం లింగా. చిత్ర టీజర్‌కు, పాటలకు ఇప్పటికే చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో యావద్భారత సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లింగా చిత్రాన్ని ఒక్క తమిళనాడులోనే 500 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కర్ణాటక, హిందీ తదితర భాషల్లో 2,500 థియేటర్లలో విడుదలకు లింగా చిత్రం సిద్ధం అవుతోందని సమాచారం.
 
 ఇతర చిత్రాలకు దడ :
 లింగా చిత్ర విడుదల వివరాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇతర చిత్రాల నిర్మాతల్లో మాత్రం దడ పుట్టిస్తోంది. లింగా చిత్రంపై ఆ చిత్ర యూనిట్ చెబుతున్న దాన్ని బట్టి భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఆ చిత్రం తరువాత విడుదల కానున్న చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది. లింగా చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుండగా మరో రెండు వారాల్లోపే అంటే క్రిస్మస్ సందర్భంగా మరో ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి లో దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో బాలా నిర్మించిన పిశాచు, ప్రభుసాల్మన్ తెరపై ఆవిష్కరించిన కయల్ చిత్రా లు ఈ నెల 19 న, నటు డు సిద్ధార్థ్ నటించిన ఎనక్కుళ్ ఒరువన్, ఎస్.జె.సూర్య స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇసై, కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన కప్పల్, మగిల్ తిరుమేని దర్శకత్వంలో ఆర్య, హన్సిక జంటగా నటించిన మెగామాన్, ఎళిల్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు హీరోగా నటించిన వెళ్లక్కార దుైరె  చిత్రాలు ఈనెల 25న విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ చిత్రాలన్నింటికీ లిం గా ఫీవర్ పట్టుకుందన్నది నిజం.
 
 లింగా తమిళనాడులో మాత్రమే 500 థియేటర్లలో విడుదల కానుండడంతో పొంగల్ (సంక్రాం తి) వరకు ఈ చిత్రాన్నే ప్రదర్శించడానికి చాలా థియేటర్ల యాజమాన్యం నిర్ణ యం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరిలో మరో మూడు భారీ చిత్రా లు అజిత్ ఎన్నై అరిందాల్, విక్రమ్ నటిం చిన ఐ, విశాల్ చిత్రం ఆంబళ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అంటే లింగా విడుదలకు ఈ మూడు చిత్రాల విడుదలకు మధ్య నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ ఉం ది. అలాగే లింగాకు క్రిస్మస్‌కు విడుదలయ్యే చిత్రాలకు మధ్య సరిగ్గా రెం డు వారాల గ్యాప్ కూడా లేదు. దీంతో ఈ ఏడు చిత్రాలకు లింగా చిత్రం ఎన్ని థియేటర్లను త్యాగం చేస్తుంది, వాటిలో ఏ చిత్రం ఎన్ని థియేటర్లను దక్కించుకుంటుంది అన్నది తెలియని పరిస్థితి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement