సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగాతో ఢీ కొట్టడానికి చిట్టెలుకల్లాంటి రెండు చిత్రాలు ఇసుమంత కూడా భయపడకుండా రెడీ అవుతుండడం విశేషమే. రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా జంటగా నటించిన అత్యంత భారీ, బ్రహ్మాండ చిత్రం లింగా. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు అంతా కొత్త తారలతో రూపొందిన యారో ఒరువన్, ఇన్నుమా నమ్మైనంబ రాంగ అనే లోబడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కథ, కథనం, మాటలు, దర్శకత్వం, నిర్మాత ఇలా అన్నితానై కెఎన్ పైజు నిర్మించిన చిత్రం యారో ఒరువన్.
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని లింగా చిత్రానికి పోటీగా విడుదల చేయడం గురించి కె ఎన్ పైజు మాట్లాడుతూ రజనీకాంత్ చిత్రం చూడటానికి వచ్చి టికెట్లు దొరక్క మిగిలిపోరుున ప్రేక్షకులు తమ చిత్రానికివచ్చినా చాలు యారో ఒరువన్ హిట్ అయినట్లే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఈ చిత్రం చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచరాదని అంటున్నారు. అలాంటి ఆశతోనే ఇన్నుమా నమ్మైనంబరాంగ చిత్ర నిర్మాత దర్శకనిర్మాత ఉన్నారు. మరి లింగా చిత్రం ఈ రెండు చిత్రాల నిర్మాతలను గట్టెక్కిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.
లింగాకు పోటీగా....
Published Thu, Dec 11 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement