ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను! | Rajinikanth confirms on Lingaa and entering politics | Sakshi
Sakshi News home page

ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను!

Published Sun, Aug 17 2014 11:06 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను! - Sakshi

ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను!

 ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ‘లింగా’ రూపంలో మంచి బహుమతి ఇవ్వడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీ, అనుష్క, సోనాక్షీ సిన్హా నాయకా నాయికలుగా రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం మంగళూరులో చివరి షెడ్యూల్ చేస్తున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు నిరవధికంగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. ‘‘ఈ చిత్రాన్ని నా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రజనీ ప్రకటించారు.
 
 మంగళూరు షెడ్యూల్‌లో పాల్గొనడానికి ఆయన చెన్నయ్ నుంచి అక్కడికెళ్లారు. అప్పుడు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తనను చుట్టుముట్టిన మీడియాతో రజనీ ఈ విధంగా చెప్పారు. ఓ పాత్రికేయుడు.. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అసలు ఎప్పుడు రావాలనుకుంటున్నారు?’ అని అడిగితే - ‘‘ఆ దేవుడి ఇష్టమే నా ఇష్టం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆ దేవుడు ఆశిస్తే.. నేను ఆచరిస్తాను’’ అని తనదైన స్టయిల్‌లో చెప్పారు రజనీ. ఆరోగ్యం గురించి అడగ్గా... ‘‘ఆ మధ్య అనారోగ్యంపాలయ్యాను. అందులోంచి క్షేమంగా బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. బాగున్నాను’’ అని రజనీ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement