నిర్ణయం కోసం నిరీక్షణ
సూపర్‌స్టార్ రజనీకాంత్ నిర్ణయం కోసం లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కె ఎస్ రవికుమార్ దర్శకుడు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను చేరుకోలేకపోయింది. దీంతో నష్టాలకు గురైన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించడంతో పాటు నిరాహారదీక్ష అంటూ రోడ్డు ఎక్కడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి రజనీకాంత్ ముందుకు వచ్చారు.
లింగా చిత్రం ఎంత వసూలు చేసింది, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నష్టం వాటిల్లింది అన్న అంశాలపై నిజాలను నిగ్గుతేల్చే బాధ్యతలను తనకు నమ్మకం అయిన సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్‌కు అప్పగించారు. ఆయన కూలంకషంగా విచారణ జరిపి లెక్కల చిట్టాను రజనీకి ఇటీవల అందచేశారు. దీన్ని రజనీకాంత్ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు పంపి మీరు ఎంత నష్టాన్ని భర్తీ చేయగలరో తెలియచేయాలని కోరారు. అయితే ఆయన నుంచి చిత్రాన్ని కొనుగోలుచేసిన ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు ఆ లెక్కల నివేదికను పంపారు. కాగా ఇరోస్ సంస్థ నష్టపరిహారాన్ని చెల్లించడానికి అనుకూలంగా లేదని సమాచారం. దీంతో లింగా డిస్ట్రిబ్యూటర్లు రజనీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు కోడంబాక్కం వర్గాల