రన్నింగ్ రైల్లో రజనీ ఫైట్ | Rajinikanth Fights in running train | Sakshi
Sakshi News home page

రన్నింగ్ రైల్లో రజనీ ఫైట్

Published Sun, Jun 15 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

రన్నింగ్ రైల్లో రజనీ ఫైట్

రన్నింగ్ రైల్లో రజనీ ఫైట్

 రన్నింగ్ రైల్లో రజనీకాంత్ అదిరే ఫైట్ చేశారట. ఈ విషయం లింగా చిత్ర యూనిట్ చెబుతోంది. రన్నింగ్ రైల్లో ఫైట్స్ అనేది రజనీ చిత్రాలకు హిట్ సెంటిమెంట్ అని చెప్పవచ్చు. 1980లలో రజనీకాంత్ నటించిన మురట్టుకాళై, అన్బుక్కు నాన్ అడిమై చిత్రాల్లో ట్రైన్ ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. అలాగే 2010లో నటించిన ఎంది రన్ చిత్రంలో రజనీ రైల్లో పోరాడే దృశ్యాలు అలరించాయి. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా కోచ్చడయాన్ వంటి ప్రయోగాత్మక చిత్రం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రం లింగా. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
 రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు ప్రతినాయకులుగా దేవ్‌సింగ్, టాలీ వుడ్ నటుడు జగపతిబాబుతోపాటు హాలీవుడ్ నటుడొకరు నటిస్తున్నారు. ఈ చిత్రంలో చోటు చేసుకున్న రన్నింగ్ రైలు పోరాట దృశ్యాల్ని ఇటీవల చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశం లింగా చిత్రంలో ప్రత్యేకతను సంతరించుకుంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు కాల ఘట్టాల్లో జరిగే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్ మైసూరులో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ను ప్రస్తుతం హైదరాబాద్ భారీ సెట్‌లో జరుగుతోంది. లింగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement