స్క్రీన్‌ టెస్ట్‌ | screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, May 30 2017 1:50 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

స్క్రీన్‌ టెస్ట్‌ - Sakshi

స్క్రీన్‌ టెస్ట్‌

1.ఈ స్టార్‌ హీరో చిన్నప్పుడు హారర్‌ సినిమాలంటే భయపడేవారట. ఇప్పుడాయన ఓ హారర్‌ థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం!
ఎ) వెంకటేశ్‌   బి) నాగార్జున
సి) రజనీకాంత్‌ డి) కమల్‌హాసన్‌  

2  అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక తెలుగు సినిమా?
ఎ) అల్లుడా మజాకా
బి) ఘరానా మొగుడు
సి) మెకానిక్‌ అల్లుడు
డి) రౌడీ అల్లుడు

3  ‘స్పైడర్‌’ లో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న రకుల్‌ప్రీత్‌ సింగ్, అంతకు ముందు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక
ఓ మహేశ్‌ సినిమాలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నారు. ఆ సినిమా ఏదో తెలుసా?
ఎ) బ్రహ్మోత్సవం   బి) శ్రీమంతుడు
సి) ఆగడు
డి) 1–నేనొక్కడినే

4 ముందు పవన్‌కల్యాణ్‌ పక్కన హీరోయిన్‌గా నటించి, తర్వాత అతని సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసిన హీరోయిన్‌?
ఎ) శ్రియా శరన్‌  బి) కాజల్‌ అగర్వాల్‌
సి) నికిషా పటేల్‌
డి) పార్వతీ మెల్టన్‌

5 పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా కోసం బాలకృష్ణ పాట పాడారు. ఆ పాట హుక్‌ లైన్‌ బయటకు వచ్చేసింది. అదేంటో తెలుసా?
ఎ) మామ.. కల్లు మామ   బి) ఒరేయ్‌ మామా..
సి) మావా... ఏక్‌ పెగ్‌ లావో
డి) జింగిడి... జింగిడి...

6 అల్లు అర్జున్‌ నటించి, నిర్మించిన ‘ఐయామ్‌ దట్‌ ఛేంజ్‌’ షార్ట్‌ ఫిల్మ్‌కు దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌
బి) సుకుమార్‌   
సి) త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
డి) పూరి జగన్నాథ్‌

7 హీరోయిన్‌ అనుష్క ఈయన దగ్గర యోగా నేర్చుకున్నారు!
ఎ) భరత్‌ ఠాగూర్‌ బి) ప్రకాశ్‌ రాయ్‌
సి) బాబా రామ్‌దేవ్‌
డి) ఎ.ఎన్‌. విఠల్‌ శెట్టి

8 ఈ తెలుగు హీరో ‘క్విక్‌ గన్‌ మురుగన్‌’ అనే ఇంగ్లిష్‌ సినిమాలో నటించారు.
ఎ) వినోద్‌
బి) భానుచందర్‌      సి) సుమన్‌
డి) రాజేంద్రప్రసాద్‌

9 హీరో కాకముందు మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు జాతీయస్థాయి క్రీడాకారుడు. అతను ఏ ఆట ఆడేవారు?
ఎ) టెన్నిస్‌ బి) బ్యాడ్మింటన్‌
సి) టేబుల్‌ టెన్నిస్‌ డి) కబడ్డీ

10 ఎన్టీఆర్‌ ‘యమదొంగ’ సినిమాలో ‘నాచోరే... నాచోరే’ పాటకు డ్యాన్స్‌ మాస్టర్‌ ఎవరు?
ఎ) బాబా భాస్కర్‌ బి) ప్రభుదేవా
సి) ప్రేమ్‌రక్షిత్‌ డి) శేఖర్‌

11‘సాహోరే... బాహుబలి’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) భళి భళి భళిరా బలి...
బి) హేస్సా... రుద్రస్సా
సి) అంత మహాబలుడైనా...
డి) ఆ జననీ దీక్షా అచలం...

 12 దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ హీరోతో ఓ సినిమా మొదలుపెట్టి కొన్ని రోజులు షూటింగ్‌ చేశారు. తర్వాత ఆ సినిమా ఆగింది!
ఎ) చిరంజీవి  బి) బాలకృష్ణ
సి) నాగార్జున
డి) వెంకటేశ్‌

13 ‘జల్సా’లో ఇలియానా క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పిన  హీరోయిన్‌ ఎవరు? హింట్‌: ముందు యాంకర్‌గా, తర్వాత హీరోయిన్‌గా హిట్స్‌
అందుకున్నారామె!
ఎ) అనసూయ బి) రష్మీ
సి) ‘కలర్స్‌’ స్వాతి
డి) శ్రియా రెడ్డి

14 సీనియర్‌ ఎన్టీఆర్‌ గుబురు గడ్డంతో ఉన్న ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) భీష్మ బి) దక్షయజ్ఞం
సి) పాండవ వనవాసం
డి) మాయాబజార్‌

15 ఈ ఫొటోలోని ఇప్పటి యంగ్‌ హీరో ఎవరు?
ఎ) నాగచైతన్య
బి) నాగశౌర్య
సి) నారా రోహిత్‌
డి) ఎన్టీఆర్‌

16 దర్శకుడు కృష్ణవంశీ, హీరో రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా?
ఎ) సింధూరం  బి) ఖడ్గం
సి) గులాబీ
డి) సముద్రం

17 ఈ హీరోయిన్‌ సింగర్‌ కూడా. క్యాన్సర్‌ను జయించిన ఆమె తెలుగులో పలు హిట్‌ పాటలు పాడారు.
ఎ) మమతా మోహన్‌దాస్‌
బి) గౌతమి   సి) మనీషా
కోయిరాలా డి) నర్గిస్‌దత్‌

18 జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా?
ఎ) బాబాయ్‌–అబ్బాయ్‌
బి) జయమ్ము నిశ్చయమ్మురా
సి) చిన్నికృష్ణుడు
డి) మొగుడు–పెళ్లాలు

19 ఈ ఫొటోలోని ఫైట్‌ మాస్టర్‌ పేరేంటో తెలుసా?
ఎ) విజయన్‌ బి) పీటర్‌ హెయిన్స్‌
సి) సెల్వ డి) డ్రాగన్‌ ప్రకాశ్‌

 మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
19 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు:

1) బి 2) సి 3) ఎ 4) ఎ
5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి
10) బి 11) సి 12) డి 13) ఎ
14) సి 15) ఎ 16) బి 17) ఎ
18) ఎ 19) ఎ 20) బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement