రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం | Gaddar Ready to Work With Pawan kalyan and Rajinikanth | Sakshi
Sakshi News home page

రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం

Published Thu, Jun 29 2017 9:42 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం - Sakshi

రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం

ప్రజా గాయకుడు గద్దర్‌
సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్‌ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీనటుడు రజినీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని చెప్పారు. తమ తరపున ప్రతినిధులు వెళ్లి విధి విధానాలను వివరించారని, రజినీకాంత్, పవన్‌ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.

200 పార్లమెంట్‌ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్‌ ఏర్పాటుకు స్థలం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలు చూడాలనే.. సికా ఉద్యమంలోకి పవన్, రజినీకాంత్‌ను ఆహ్వానించామని గద్దర్‌ పేర్కొన్నారు. పాడేరు ఏజన్సీలో కరపత్రాలు పోలీసుల పనేనని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement