
‘ఆ నలుగురు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్దార్థ. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. మళ్లీ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్, టీజర్‌తో సినిమా కొత్తగా ఉండబోతోందని ముందే తెలియజేసేశారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పదునైన మాటలు, జబర్దస్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర పంచ్ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోన్నాయి. ఉరి తీయడానికి రమ్మని పిలిచి ప్రభుత్వం ఓ వ్యక్తికి లేఖ రాయగా, అదే టైంలో ఉరి శిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. ఈ ఇద్దరు కలిసి చేసే ప్రయాణామే ఈ సినిమా కథ. ‘హ్యాంగ్ మ్యాన్’ నేపథ్యంలో జరిగే ఈ కథలో ‘సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు... చంపేవాడు కలిసే తిరుగుతున్నారు’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment