Chandra
-
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్‌ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
అనుమతి లేకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన రూ.159 కోట్ల బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి నీటిపారుదల శాఖ మహదేవ్పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. శాఖ ఉన్నతాధికారులకు కూడా ఆయన సమాచారం ఇవ్వలేదు.కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్‌ఖాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం కమిషన్ నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీలు విడుదల చేసే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నా రా? అని కమిషన్ ప్రశ్నించగా, ఈ విషయంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు. ⇒ తాను విధుల్లో చేరకముందే మేడిగడ్డ బరాజ్ పూర్తయిందని మాజీ డిప్యూటీ ఎస్ఈ ఎస్.సత్యనారాయణ కమిషన్‌కు తెలిపారు. ⇒2022 జూలైలో బరాజ్‌లకు భారీ వరదలు రావడంతో అప్రాన్, సీసీ బ్లాకులు కొట్టుకుపోయా యని ఎస్ఈగా పనిచేసిన కరుణాకర్ చెప్పారు. మరమ్మతులు చేయాలని నిర్మాణ సంస్థలకు లే ఖలు రాశామన్నారు. బరాజ్‌ల నిర్మాణం తర్వా త రెండేళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అమల్లో ఉంటుందని, మూడేళ్ల పాటు నిర్వహణను ఆ సంస్థలే చూడాల్సి ఉంటుందన్నారు. ⇒ బరాజ్‌లు డ్యామేజీకి కారణం ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, మోడల్ స్టడీస్‌లో బరాజ్‌లకు వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయారని, ప్రతీ సెకనుకు 4.35 మీటర్ల వేగంతో వరద వ స్తుందని అంచనా వేయగా, 12–14 మీటర్ల వేగంతో వచి్చందని చెన్నూరు ఈఈ–2 బి.విష్ణుప్రసాద్ బదులిచ్చారు. బరాజ్‌లలో సీపేజీని గుర్తించి 2019 డిసెంబర్ 16న సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు లేఖ రాయగా, 2020 డిసెంబర్ 22న ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం కోసం అయ్యే అంచనాలను అందించారని బదులిచ్చారు. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్‌లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
సన్నీ చంద్ర నుంచి అడివి శేష్ గా పేరు మార్చుకోవడానికి కారణం తెలిస్తే
-
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!? -
పెళ్లింట విషాదం
భూత్పూర్: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు. ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐగా పనిచేస్తున్నారు. కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అతివేగమే కారణం.. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
పర్యాటక మంత్రి హామీతోనైనా.. చంద్రగఢ్ దశ మారేనా?
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటక మంత్రి హామీతోనైనా.. అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్‌లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్‌కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ‘చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండపై 18వ శతాబ్దంలో నాటి సంస్థానాదీశుడైన చంద్రసేనుడు చంద్రగఢ్ కోటను నిర్మించారు. కోట మధ్యలో రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు తాగునీటి కోసం రాతిపొరల మధ్య ఏర్పాటుచేసిన ఎనిమిది చిన్న చిన్న కొలనులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఏడాది పొడవునా నీరు ఉండటం విశేషం.’ ఇదీ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు. -
సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు?
సౌరభ్ చంద్రకర్ పేరు ఎప్పుడైనా విన్నారా? కొంతకాలం క్రితం వరకు ఈ పేరు గురించి ఎప్పుడూ చర్చ జరగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పతాక శీర్షికల్లో ఈ పేరు కనిపిస్తోంది. సౌరభ్ చంద్రకర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘా పెట్టడం, అధికారుల విచారణలో వెల్లడైన షాకింగ్ వివరాలే ఇందుకు కారణంగా నిలిచాయి. సౌరభ్ తన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీల ఇంట జరిగిన పెళ్లిళ్లు గుర్తుకొస్తాయి. ఈ పెళ్లిళ్లకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారు. లక్ష్మీ మిట్టల్ తన కుమార్తెకు పారిస్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహానికి ఆయన రూ. 240 కోట్లు ఖర్చు చేశారు. బంధువుల కోసం ప్రైవేట్ జెట్ మీడియా కథనాల ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ పెళ్లికి సౌరభ్ చంద్రకర్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. తమ బంధువులు, ప్రముఖులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్ తీసుకువచ్చేందుకు ఆయన ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్లి ఖర్చుల్లో ఎక్కువ భాగం నగదు రూపంలోనే వెచ్చించాడు. దీనిని చూస్తే సౌరభ్ దగ్గర ఎంత సంపద ఉందో అంచనా వేయవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మహదేవ్ యాప్‌తో లింక్ కలిగిన 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి, రూ.417 కోట్ల విలువైన షేర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను నడుపుతున్నాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. పలువురు ప్రముఖులు హాజరు సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోనిఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. తన పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్‌కు ఆయన రూ.120 కోట్లు చెల్లించాడు. సౌరభ్ తన బంధువులను దుబాయ్‌కు తీసుకురావడానికి నాగ్‌పూర్ నుండి ప్రైవేట్ జెట్లను పంపాడు. వివాహ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీనికి సంబంధించిన మొత్తం చెల్లింపును హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించారని సమాచారం. యోగేష్ బాపట్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హవాలా ద్వారా రూ.112 కోట్లు ఇచ్చినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించినట్లు ఈడి తెలిపింది. అదేవిధంగా హోటల్ బుకింగ్ కోసం యూఏఈ కరెన్సీలో రూ.42 కోట్లు చెల్లించాడు. ఇది కూడా చదవండి: ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే? -
ప్రముఖ చిత్రకారుడు చంద్ర ఇకలేరు
ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర(74) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన..సికింద్రాబాద్ మదర్ థెరిసా రీహబిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.వరంగల్ జిల్లాకు చెందిన రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్రశేఖర్ ఆగస్ట్ 28, 1946లో జన్మించారు. సర్వశ్రీ శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో ఆయన చిత్రలేఖనం వైపు అడుగులు వేశారు. యుక్తవయసు నుండే రేఖా చిత్రాలు గీయడం ప్రారంభించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా వార, మాస పత్రికలకు బొమ్మలు గీసిన ఖ్యాతి చంద్రకే దక్కుతుంది. నాలుగు దశాబ్దాల పాటు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్స్, రంగుల్లో బొమ్మలు, కార్లూన్లు, పెయింటింగ్స్, గ్రీటింగ్ కార్డులు, లోగోలు గీసిన చంద్రకు దేశ విదేశాలలో కోట్లాది మంది అభిమానులు వున్నారు. వేల సంఖ్యలో నవలలకు కవర్ పేజీలు వేశారు. దశాబ్దాల పాటు వార ప్రతికలకు పండగ సమయాల్లో కవర్ పేజీలు గీశారు. చంద్రకు భార్య భార్గవితో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చంద్ర మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
యశ్ మహాచంద్ర
‘కేజీయఫ్’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యశ్. ఆయన కీలక పాత్ర చేసిన ‘చంద్ర’ చిత్రాన్ని ‘మహాచంద్ర’ పేరుతో అనువదిస్తున్నారు. యశ్, ప్రేమ్ కుమార్, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. రూపా అయ్యర్ దర్శకత్వంలో షాన్వాజ్ నిర్మించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ – ‘‘కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. యశ్ కీలక పాత్రలో కనిపిస్తారు. శ్రియ అద్భుతమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: దామోదర వనాఛార్య, సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ్, కెమెరా: దాస్. -
చచ్చేవాడు.. చంపేవాడు కలిసే తిరుగుతున్నారు
‘ఆ నలుగురు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్దార్థ. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. మళ్లీ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్, టీజర్‌తో సినిమా కొత్తగా ఉండబోతోందని ముందే తెలియజేసేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పదునైన మాటలు, జబర్దస్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర పంచ్ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోన్నాయి. ఉరి తీయడానికి రమ్మని పిలిచి ప్రభుత్వం ఓ వ్యక్తికి లేఖ రాయగా, అదే టైంలో ఉరి శిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. ఈ ఇద్దరు కలిసి చేసే ప్రయాణామే ఈ సినిమా కథ. ‘హ్యాంగ్ మ్యాన్’ నేపథ్యంలో జరిగే ఈ కథలో ‘సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు... చంపేవాడు కలిసే తిరుగుతున్నారు’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. -
యువకుడి దారుణహత్య
మర్మాంగం కోసివేత గోనె సంచిలో మృతదేహం వివాహేతర సంబంధమే కారణం నిందితులిద్దరూ భార్యాభర్తలు మూడు రోజుల తర్వాత అరెస్ట్ కృష్ణరాజపురం: వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేసిన యువకుడి మర్మాంగం కోసి, హత్యచేసిన దంపతుల ఉదంతమిది. ఈ కేసులో నిందితులైన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. హతుడు, హంతకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లమాడ మండలం గూడమేకలపల్లికి చెందిన కళ్యాణి, నరసింహులు దంపతులు. కూలి పనుల కోసం కొద్దిరోజుల కిందట బెంగళూరులోని మహదేవపురకు వెళ్లారు. వీరి గ్రామానికి చెందిన చంద్ర అనే యువకుడు అప్పుడప్పుడు నరసింహులు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో కళ్యాణితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి నరసింహులు తన భార్యను మందలించాడు. అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టడంతో కళ్యాణికి మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ఇకపై వివాహేతర సంబంధం కొనసాగించడం కుదరంటూ చంద్రకు కళ్యాణి తెగేసి చెప్పింది. ఇదివరకటిలా ఉండకపోతే అందరికీ చెబుతానంటూ చంద్ర బెదిరించాడు. దీంతో కళ్యాణి దంపతులు ఇతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. బుధవారం రాత్రి మాట్లాడాలంటూ చంద్రను నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి అతడి మర్మాంగం కత్తిరించి, హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి, అక్కడే పడేసి వెళ్లిపోయారు. చంద్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహదేవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన నరసింహులు, కళ్యాణిలను శనివారం అరెస్ట్ చేశారు. -
హిట్లర్ పాలనను తలపిస్తోంది
టీడీపీ ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం ధవళేశ్వరంలో 23 మంది కాపు నాయకుల అరెస్టు ధవళేశ్వరం : రాష్ట్రంలో హిట్లర్ పాలన తలపించే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనను సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కాపు సంఘ నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరిన కాపు సంఘ నాయకులను పోలీసులు స్టేషన్ సెంటర్లో అడ్డుకున్నారు. అక్కడే నిరసనకు దిగిన కాపు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విషయం తెలసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ చేరుకొని దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావుతో చర్చించారు. అనంతరం అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదలచేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కాపులపై వివిధ సెక్షన్లు ప్రయోగిస్తూ చంద్రబాబు వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కాపు ప్రజాప్రతిని«ధులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ భూములను గంటా శ్రీనివాసరావుకు, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి నారాయణకు నజరానాగా ఇవ్వడం వల్లనే వారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధవళేశ్వరం బస్టాండ్సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. కాపు సంఘ నాయకులు పెన్నాడ జయప్రసాద్, మెండా సత్తులు, గరగ శ్రీనివాసరావు, బండారు బంపి, దొండపాటి శ్రీనివాస్, సాధనాల చంద్రశేఖర్ (శివ), ఏజీఆర్ నాయుడు, ముత్యాల పోసికుమార్, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, అల్లంపల్లి ముత్యాలు, పందిళ్ల భానుప్రసాద్, దూది సాయి, నూకరాజు, గపూర్, గాలి ప్రసన్నకుమార్, దళిత సంఘ నాయకులు రేగుళ్ల రఘు, మిరప రమేష్, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
స్కీములు వారికి... కేసులు మాకు
స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి జిల్లాలో లేదు అనపర్తి : బ్రిటిష్ వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజించు–పాలించు దుర్నీతిని అనుసరించి పాలన చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. అనపర్తిలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పచ్చ చొక్కాల వారికి అందజేస్తూ, వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ, హక్కు ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులను అణచి వేసేందుకు అధికారపార్టీ నాయకులు కుట్ర సాగుతోందన్నారు. అప్పటికే ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సెక్షన్ 30 అమలు చేయటంతో సామాన్యులు ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను సైతం చంద్రబాబు సర్కారు రాజకీయం చేస్తూ, అమాయకులపై కేసులు నమోదు చేయడం తగదని, దీనికి చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాలు స్కీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న ఆయన నిరసన కార్యక్రమాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న నిరంకుశ పాలనను గుర్తెరిగిన ప్రజలు తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల స్ధాయి నేతలను, నాయకులను, కార్యకర్తలను గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, కాపు నేతలు అడబాల వెంకటేశ్వరరావు, యక్కలదేవి శ్రీను, ర్యాలి కృష్ణ, కేదారి రంగారావు, చింతా భాస్కరరామారావు, కేదారి బాబూరావు, గొల్లు హేమసురేష్, పడాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాలు జడల కాగితాన!
‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలోని ‘ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను...’ అనే పాటకు చిన్న నేపథ్యం ఉంది. ఈ పాట రాసిన తరవాతే నేను ట్యూన్ చేశాను. ఈ పాట రాసినప్పుడే చంద్రబోస్ ఒక ట్యూన్‌తో వినిపించారు. ఆ ట్యూన్ నా మనసుకు పట్టేసింది. దాని నుంచి బయటపడటానికి నాకు మూడు రోజుల సమయం పట్టింది. ఆ తరవాత నెమ్మదిగా నా బాణీలో సంగీతం సమకూర్చాను. ఒక అమ్మాయిలో ఉండే ఆడతనం, సిగ్గు వంటి భావాలను ఈ పాటలో ఎంతో అందంగా నూటికి నూరు శాతం చూపారు చంద్రబోస్. విచిత్రం ఏమిటంటే పాట రాసింది, ట్యూన్ చేసింది మగవారే. కొరియోగ్రఫీ, గానం మాత్రం ఆడవాళ్లు. మనసులో ప్రేమ నిండిన అమ్మాయి, తనలోని భావాలను తను ప్రేమించిన అబ్బాయికి చెప్పడానికి సిగ్గు, ఆడతనం అడ్డు వస్తాయి. అటువంటి సందర్భంలో ఆమె చేష్టలు కూడా వింతగా ఉంటాయి. ఆ చేష్టలు వయసులో ఉన్న ఆడవారికి మాత్రమే తెలుస్తాయి. రచయిత అన్ని పాత్రలనూ తనలోకి ఆవాహన చేసుకుంటేనే పాట పండుతుంది. ఈడొచ్చిన అమ్మాయి మనసులోకి చంద్రబోస్ ప్రవేశిస్తేనే ఇంత బాగా రాయగలుగుతారు. ఒక జంట చూడముచ్చటగా ఉంటే ‘చిలుకా గోరింకల్లా ఉన్నారు’ అంటారు పెద్దవాళ్లు. వారిని రాధాకృష్ణులతో పోలుస్తారు. అదే అంశాన్ని చంద్రబోస్ ఈ పాటలో ‘రామచిలుక గోరువంక బొమ్మగీసి తెలుపనా... రాధాకృష్ణుల వంక చేయి చూపి తెలుపనా...’ అని వివరించారు. మరీముఖ్యంగా ప్రేమ అనేది ఎదలో ఉంటుందని, ఆ ప్రేమ అనే మృదువైన మాటను ఎలా తెలపాలో అర్థం కావడం లేదని అంటుంది ఆ అమ్మాయి. ఈ పాటలో ‘వాలు జడల కాగితాన, విరజాజుల అక్షరాలు... ’ అనే అందమైన అక్షరాలను ఇందులో పొందు పరిచారు రచయిత. ‘గాలికైన తెలియకుండ మాట చెవిన వేయనా... ’అనే వాక్యాలు చాలా అందంగా రచించారు. ఏ మాటైనా గాలి ద్వారానే అవతలి వారి చెవిలోకి ప్రవేశిస్తుంది. కాని గాలికి కూడా తెలియకుండా తన ప్రేమ మాటను అబ్బాయి చెవిలోకి వేస్తానంటుంది అమ్మాయి. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. – సంభాషణ: డా. వైజయంతి -
జారి పడి వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణ శివారులోని మోత్కుపల్లి బ్రిడ్జి కింద జారి పడి తలకు బలమైన గాయాలు కావడంతో ముక్కిడిపేటకు చెందిన చంద్ర (32) బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మంగళవారం మోత్కుపల్లిలోని ముత్యాలమ్మ జాతరకు హాజరైన చంద్ర స్నేహితులతో కలిసి బ్రిడ్జి వద్ద విందులో పాల్గొన్నాడు. అనంతరం బ్రిడ్జి కింద నడుస్తూ జారి పడటంతో తలకు మొద్దు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోవటంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం ఇతని సోదరుడు వినాయకచవితి పండుగ సమయంలో నిమజ్జన కార్యక్రమంలో గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు మరో కుమారుడు కూడా ఇలా అర్థంతరంగా మృతి చెందటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుకులకు తానే కొరివి పెట్టాల్సి వచ్చిందని చంద్ర తండ్రి బంధువుల వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నాడు. చంద్రకు భార్య, కూతురు ఉంది. -
చంద్రశేఖరరావు విమర్శలు అర్థ రహితం
– పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యాధికారుల సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు రాయవరం (మండపేట) :పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్ఆర్ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్ఆర్ఏ ఇస్తుందన్నారు. పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్ఆర్ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్ఆర్ఏ ఇస్తుందన్నారు. -
ప్రతి సినిమా వైవిధ్యభరితమే..
సినీ దర్శకుడు చంద్రమహేష్ రావులపాలెం(కొత్తపేట) : ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన చంద్రమహేష్ ఇంత వరకూ తాను చేసిన ప్రతి సినిమా వైవిధ్యభరితమైనవేనని అంటున్నారు. తన స్నేహితులు పడాల రామిరెడ్డి, సబెళ్ల సత్యనారాయణరెడ్డి(సన్ని)లను కలిసేందుకు సోమవారం నిర్మాత సామా సురేంద్రరెడ్డితో కలసి రావులపాలెం వచ్చిన ఆయన కాసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది కాకినాడ. సినిమాలపై ఇష్టంతో సురేష్ ప్రొడక్షన్స్‌లో చేరాను. కె.మురళీమోహనరావు, సురేష్‌కృష్ణ, జయంతి సీ పరాన్జీ, సురేష్ వర్మ, బోయిన సుబ్బారావు, జంధ్యాల వంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పనిచేశా. 1999లో ప్రేయసి రావే చిత్రంతో దర్శకుడిగా మారా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఉత్తమ కొత్త దర్శకుడిగా నంది అవార్డు లభించడంతోపాటు చిరంజీవి, కె.విశ్వనాథ్ వంటి పెద్దల ప్రసంశలు లభించాయి. అలాగే అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం విషం, లవ్ ఇన్ హైదరాబాద్ చిత్రాలకు దర్శకత్వం వహించా. ఇప్పటి దాకా తెలుగులో తొమ్మిది సినిమాలు చేశా. హనుమంతు సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నా. రెడ్ అలర్ట్ అనే సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని నిర్మించాం. అయితే తెలుగు, కన్నడలో రెడ్ అలర్ట్, మళయాళంలో హై అలర్ట్, తమిళంలో చెన్నై నగరంగా విడుదల చేయాలని అనుకున్నా, నిర్మాత మృతితో ఒకే సారి చేయలేకపోయాం. తమిళంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. ఒక ప్రేమకథను సిద్ధం చేసి ఒక యువ హీరోకి చెప్పాను. ఆయనకు నచ్చడంతో త్వరలో ఈ సినిమా తెలుగులో చేయనున్నాం.’’ -
నేటి నుంచి ఈ–గవర్నెన్స్ సదస్సు
సీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు విశాఖపట్నం : 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు సోమ, మంగళ వారాల్లో విశాఖలో జరగనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా నోవొటెల్ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, డాక్టర్ జితేంద్ర సింగ్, పీపీ చౌదరి, సుజనాచౌదరిలతో పాటు ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కె.హరిబాబు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల కార్యదర్శులు విజయానంద్, సి.విశ్వనా«థ్, అరుణ సుందరరాజన్, జేఎస్ దీపక్, ఉషాశర్మ తదితరులు పాల్గొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో పాటు 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఇప్పటి వరకు కేవలం 450 మంది మాత్రమే రి జిస్ట్రర్ చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రానికి ఈ సదస్సు నిర్వహణ వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఒనగూరే అవకాశాలు లేకున్నప్పటికీ రూ.2.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మొత్తం 5 ప్లీనరీ సెషన్స్ తొలి రోజు మూడు ప్లీనరీ సెషన్స్, రెండో రోజు రెండు ప్లీనరీ సెషన్స్ జరగనున్నాయి. తొలి రోజు వరుసగా ఐఓటీ అండ్ డాటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యురిటీ పాలసీ ఫర్ ది ఫ్యూచర్, డిజిటల్ కనెక్టివిటీ టూ ద లాస్ట్ మెయిల్ అనే అంశాలపై సెషన్స్ ఉంటాయి. రెండో రోజు టెక్నాలజీ లెడ్ మోనటరీ ట్రాన్జ్క్షన్స్ లీడింగ్ టు ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, ఏపీ లీడింగ్ ఇండస్ట్రీ 4.0 అనే అంశాలపై చర్చించనున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈగవర్నెన్స్ జాతీయ సదస్సు ఏర్పాట్లను ఐటీ కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. -
2 వేల నోట్లు అవసరం లేదు
► బ్యాంకులుండగా కరెన్సీతో పనేంటి? ► నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకం ► దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలుంటాయి ► తాత్కాలిక ఇబ్బందుల పరిష్కారానికి సీఎస్, డీజీతో కమిటీ ► ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి : దేశంలో కొత్తగా రెండు వేలు, 500 రూపాయల నోట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రూ.500, వెయ్యి నోట్లు రద్దు చేశాక మళ్లీ రూ.500, రెండు వేల నోట్లు అందుబాటులో పెట్టడం వల్ల లాభం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఆర్బీఐకి సాంకేతిక ఇబ్బందులున్నాయేమో తెలియదు కానీ అసలు బ్యాంకులుండగా కరెన్సీతో అవసరం ఏమిటన్నారు. ఈ నోట్లను ఎన్నికల్లో వినియోగించే అవకాశం ఉందని, గతంలో 500 ఇచ్చేవారు ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్‌గా రెండు వేలు ఇస్తారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజలు తీసుకుంటే తప్పులేదని, కానీ తాను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే చివర్లో వచ్చిన సూట్‌కేసు గెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఏర్పాటుచేసిన క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, తాను ఆయనకు ఫోన్ చేసి అభినందించానని చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలుంటాయన్నారు. దీనివల్ల దేశంలో నీతి-నిజాయితీ పెరుగుతుందని, మెరిట్‌కు ప్రాధాన్యం వస్తుందని చెప్పారు. పేదరికం తగ్గుతుందని, ధరలు నియంత్రణలోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, దేశానికి లాభాలొస్తాయని, ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు. అర్థక్రాంతి అనే సంస్థ తన వద్దకొచ్చినప్పుడు దీనిపై చర్చించి ఒక విజన్‌తోనే రూ.500, వెరుు్య నోట్లు రద్దు చేయాలని కోరానన్నారు. ఇటీవల వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయాన్ని ప్రారంభించినరోజు ఈ నోట్లు రద్దు చేయాలని కోరుతూ ప్రధాని లేఖ రాశానని తెలిపారు. అదేరోజు డ్వాక్రా మహిళలకు రెండో విడత మూలధనం విడుదల ఫైలుపై సంతకం చేశానని, ఆరోజు చేసిన రెండు సంతకాల ఫైళ్ల లక్ష్యం నెరవేరిందన్నారు. దీన్నిబట్టి వెలగపూడి వాస్తు బాగుందని అర్థమవుతుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 1,650 కోట్ల 500 నోట్లు, 670 కోట్ల వెయియ నోట్లు అమల్లో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. దేశంలో చెలామణీ అయ్యే నగదులో 39 శాతం వెయ్యి నోట్లు, 48 శాతం 500 నోట్లేనని, 85 శాతం నగదు లావాదేవీలు ఈ రెండు నోట్ల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల నల్లధనం విపరీతంగా పెరిగిపోరుు సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల్లో రూ.30 వేల కోట్లు అనధికారికంగా ఖర్చయ్యాయని అంచనా ఉందని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక నేరాలు, అవినీతి తగ్గుతుందని, టెరర్రిస్టులకు నిధులు రాక ఆగిపోతుందన్నారు. ఇప్పటివరకూ దేశంలో ఒక శాతం బ్లాక్ మనీనే సీజ్ చేశారని, పన్ను కట్టాల్సిన సొమ్ములో 67 శాతం బ్లాక్‌మనీగా ఉందని తేలిందని తెలిపారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. -
ట్రాక్టర్, ఆటో ఢీ: ఇద్దరు మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం రావిపాడు వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపురం మండలం గరిమెనపెంట నుంచి ఐదుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను రావిపాడు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఆటో డ్రైవర్ చంద్ర సహా తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమా
- విజయవాడ చంద్రబాబు జాగీరు కాదు - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ (లబ్బీపేట) చంద్రబాబు ప్రభుత్వం చిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, నెల్లూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిత్రతో పాటు మిగిలినవారికి ఏం జరిగినా చంద్రబాబు, మంత్రి కామినేనిలు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైద్య మిత్రలు అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చేరారని వార్తలు రావడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వైద్య మిత్ర తనకు గుండె జబ్బు ఉందని, అయినా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆయన ముందు కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, టైస్టులపై వ్యవహరించే రీతిలో తమతో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రామకృష్ణ స్పందిస్తూ.. విజయవాడ చంద్రబాబు జాగీరు కాదని, నగరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నంత మాత్రాన పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు కూడా జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య మిత్రాలను స్టేషన్లకు తరలించారని, వారికి ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. -
తొలిసారి ప్రపంచాన్ని చూశా..
అనుబంధం అల్లిబిల్లి పదాలతో అద్భుత అర్థాలను సృష్టించిన పాటల రచయిత అతడు. ఆయన కలమే ఓ విప్లవ గళమై నినదిస్తుంది.. అమ్మలా లాలిస్తుంది. ఆయనకు ఇన్ని భావాలను, అనుభవాలను నేర్పించింది మాత్రం ఈ మహానగరమేని చెబుతాడిప్పుడు. ఆయన చంద్రబోస్. ప్రముఖ సినీగీత రచయిత. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం చల్లగరిగ నుంచి వచ్చిన కుర్రాడు ఇప్పుడు భాగ్యనగరంతో పెనవేసుకుపోయాడు. నగరంపై ఆయన మమకారపు అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ‘1986లో హైదరాబాద్ వచ్చాను. అమ్మ, నాన్నల రక్షణ నుంచి అప్పుడే బయటకు రావటం. స్వతంత్రంగా హైదరాబాద్‌లో తిరగటం ప్రారంభమైంది. అప్పుడే తొలిసారి ప్రపంచాన్ని చూశాను. ఆకలి అనుభవం, ఒంటరితనం, అవమానం, దైన్యం, నైరాశ్యం ఇలాంటివన్నీ ఈ నగరంలో అనుభవించాను. కొంత కాలం తర్వాత సంపాదన, కీర్తి, విజయం, మానవత పొందాను. విభిన్న పార్శ్వాలు, ధ్రువాలు గల విశ్వనగరానికి సరైన నిర్వచనం హైదరాబాద్. ఇరానీ కేఫ్‌లో రూ. 2 సమోసాలతో పాటు పార్క్ హయత్‌లో రూ.3 వేల లంచ్ వరకు ఇక్కడ రుచి చూడవచ్చు. ఎంతో వైవిధ్యం ఉన్న నగరమిది. ఇక్కడ వాతావరణం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. నివాస యోగ్యమైన వాతావరణం. ఎలాంటి భయం లేని ప్రాంతం. ఇక్కడి భౌగోళిక వాతావరణం, ఉష్ణోగ్రత ఆరోగ్యకరంగా ఉంటాయి. హైదరాబాద్ అంటే ఒక్క ఊరు కాదు ఎన్నో ఊళ్ల (గ్రామాల) సమ్మేళనం. ఇక్కడ ఒక వైపు ఏపీ వారు, మరొక వైపు రాయలసీమవాసులు, తమిళులు, గుజరాత్, జైనులు, సిక్కులు, నేపాలీలు, కన్నడిగులు ఒక రేమిటి.. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు, సంస్కృతుల వారు ఇక్కడ ఉన్నారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో కలిసి కట్టుగా ఉండేందుకు స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. మంగా టిఫిన్ సెంటర్, గణపతి కాంప్లెక్స్‌ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉన్నారు. మరోపక్క భారతదేశానికే ఆరోగ్య రాజధాని ఈ నగరం. సాఫ్ట్వేర్ రంగంలో మన స్థానం మనదే. ఇప్పుడు నగరం అభివృద్ధి మెట్రో కన్నా వేగంగా పరుగెడుతోంది. అన్ని వర్గాలు, మతాలు, అన్నీ పార్టీల ప్రజానీకాన్ని ఏకం చేసేది ఒక్కటే ఒక్కటి. అదే హైదరాబాద్ దమ్ బిర్యానీ’ అంటూ ముగించారు. -
328 ఒప్పందాలు
-
తెలుగులో... మిఠాయి
కన్నడంలో విజయవంతమైన ‘బొంబాయి మిఠాయి’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకు లకు అందిస్తున్నారు. చిక్కన్న, దిశాపాండే ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. ట్రైలర్‌ను ప్రముఖ గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత అన్నారు. చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, ఉప్పల శారద తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై.ప్రసాద్, సత్యనారాయణ, -
ఇంటింటి రాట్నం
గిర్రుమని తిరుగుతుంది రంగులరాట్నం.గిర్రుమని తిరుగుతాయి... కళ్లలో నీళ్లు.ఒకసారి ప్రేమ పైనుంటుంది.మరోసారి పగ పైనుంటుంది.కానీ ఈ జీవితరాట్నం... తిరిగినంతసేపూ ఏదీశాశ్వతంగా పైన ఉండదు అని అర్థం అవుతుంది.మన ఇళ్లల్లో కూడా ఇలాంటి తల్లి, తండ్రి,అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కొడుకులు కోడళ్లు, వాళ్ల ఆత్మీయతలు, అపార్థాలు, మనస్పర్థలు కనబడతాయి.సినిమాలో చివరికి రాజకీయం ఓ పెద్ద ఘట్టంలాకనబడుతుంది. కానీ సినిమా అంతటా కుటుంబంలో ఉన్న రాజకీయం కీలక పాత్ర పోషిస్తుంది.ఎవరూ చెడ్డవాళ్లు కాదు. అందరూ మంచివాళ్లే.కానీ ఒకరికొకరు ఎల్లవేళలా మంచివాళ్లు కాదు.అది.. ఈ రంగులరాట్నం మనందరికీ తిరుగులేకుండా చెప్పేది.మనల్ని తిరిగి తిరిగి ఆలోచించేలా చేసేది. ‘తల్లీ, తరతరాలుగా మా కుటుంబాన్ని చల్లగా చూశావ్. ఈనాడు కాని దేశాలకు ప్రయాణం చేయిస్తున్నావ్. మమ్మల్ని ఒక కంట కనిపెట్టి కాపాడే భారం నీదే తల్లి’.గ్రామదేవతను వేడుకుంది అంజలీదేవి. అమె భర్త సుందర్రామయ్య (కృష్ణమూర్తి), పెద్ద కొడుకు సూర్యం (రామ్మోహన్), చిన్న కొడుకు వాసు (చంద్రమోహన్), కూతురు జయ (విజయనిర్మల).. అంతా దేవతకు దండం పెట్టుకున్నారు.ఒకప్పుడు పదిలక్షల ఆస్తికి వారసుడైన సుందర్రామయ్య వాటాలో ఇప్పుడు అప్పులు పోగా మిగిలిన ఆస్తి మూడెకరాలు. ఆ మూడెకరాలను అమ్ముకుని, పిల్లలకైనా చదువు చెప్పించుకుని ప్రయోజకులను చేద్దామన్న ఆశతో భార్యాబిడ్డల్ని తీసుకుని పట్టణానికి బయల్దేరాడు. శ్రీ మోహన విలాస్ కాఫీ హోటల్లో వాడుకగా నూనె డబ్బాలు వేస్తున్నాడు సుందర్రామయ్య. సడన్‌గా ఆ హోటల్ యజమాని దివాలా తీశాడు. సుందర్రామయ్యకు కుప్పకూలిపోయి, గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ భారం అంజలీదేవిపై పడింది. ‘సీతమ్మా.. మన ఊరొచ్చెయ్’ అన్నారు బంధువులు. అంజలీదేవికి భర్త మాటలు, సూర్యపై ఆయన పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి. ‘రాను. నేను ఈ ఊరు విడిచి రాను. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ఊరు వచ్చారో... అది నెరవేరి తీరాలి. అది నెరవేరి తీరాలి’ అంది. భర్త ఆశయం ప్రకారం అక్కడే ఉండి సూర్యాన్ని లాయర్ని చేయాలని తీర్మానించుకుంది. అందుకోసం ఎంత కష్టాన్నయినా భరించాలనుకుంది. పాలు అమ్ముతోంది. దోసెలు పోస్తోంది. సూర్య చక్కగా చదువుకుంటున్నాడు. కానీ తల్లిపడే కష్టమే తెలియడం లేదు. వాసు చదువుకుంటూనే, తల్లి కష్టానికి చేదోడుగా ఉంటున్నాడు. వాసుకు స్పోర్ట్స్‌లో, కుస్తీ పోటీల్లో బోలెడన్ని కప్పులు, మెడల్స్! వాటన్నిటినీ ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. వ్యాయామశాల ప్రొఫెసర్ శంకర్రావుకు వాసు ప్రియశిష్యుడు. వాళ్ల అమ్మాయికి (పెద్దయ్యాక వాణిశ్రీ) వాసు అంటే అభిమానం. అంజలీదేవి కష్టపడుతోంది. దగ్గుతూ వాకిలి ఊడుస్తోంది. దగ్గు ఎక్కువైంది. జ్వరం వచ్చింది. పని చేయలేకపోతోంది. సూర్య తల్లిదగ్గరకు వచ్చాడు. ‘అసలీ దోసెలు వ్యాపారం వల్లే నీకు జ్వరం వచ్చింది. మీ అమ్మ దోసెలు అమ్ముతోందని అంతా నన్ను ఎగతాళి చేసేవారే’ అన్నాడు. ‘నీకోసం ఈ దోసెల వ్యాపారమే కాదు, ఇంటింటా ముష్టెత్తమన్నా సంతోషంగా చేస్తానయ్యా.. సూరీ’ అంది ఆ అమ్మ. పరీక్ష ఫీజు 50 రూపాయలు రేపే కట్టాలన్నాడు సూర్య. పాతబాకీ కోసం ఎన్నాళ్లని తిరగనూ అన్నాడు అప్పులిచ్చిన కిట్టయ్య అప్పుడే వచ్చి. ‘రేపట్లోగా 150 చెల్లించాలి. లేకుంటే చెంబూ తపేళా పడేస్తాను’అన్నాడు కిట్టయ్య. ‘అంతవరకు రానివ్వను. ఎలాగైనా డబ్బు తెస్తాను’ అన్నాడు వాసు. అన్నట్టే డబ్బు తెచ్చాడు! ‘ఎక్కడిదిరా ఇంత డబ్బు?’... అన్న అడిగాడు. ‘నువ్వేం కంగారు పడకు ఎక్కడా కన్నం వేయలేదులే’.. తమ్ముడు చెప్పాడు. ‘ఇంత డబ్బు ఎక్కడ తెచ్చావురా’.. అమ్మ భయంగా అడిగింది. ‘కప్పులు, మెడల్స్ అమ్మేశాను’ ఏడుస్తూ చెప్పాడు. ‘వాసూ... నా చిట్టి తండ్రీ... ఊరుకో’ అంది అమ్మ. సూర్య లాయర్ అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ అప్పలస్వామి (రమణారెడ్డి) సూర్యను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. లాయర్ అండ ఉంటే తన అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగుతాయని అతడి ప్లాన్. అన్నకొడుకు సుబ్బారాయుడి చేత కూతురికి చెప్పించాడు... సూర్యను చేసుకుంటే వచ్చే లాభం ఏమిటో. ఆమె కూడా తన లాభం తను చూసుకుంది. పెళ్లికి ముందు అతనితో కొన్ని షరతులు మాట్లాడాలి అంది. నా వ్యక్తిత్వానికి భంగం రాకూడదు. నేచెప్పినట్లు అతను నడుచుకోవాలి. అతను మనింట్లో ఉండాలే కానీ వాళ్లింటికి నేను వెళ్లను. అత్త ఆడబిడ్డ నా చెప్పుచేతల్లో ఉండాలి. నాకు తెలీకుండా వాళ్ల బంధువులెవరూ మనింటికి రాకూడదు. సపోజ్ వచ్చారనుకో... మనం చెప్పినట్లు నడుచుకోవాలి. కోర్టులో ఎన్ని పనులున్నా రోజూ క్లబ్బులకి, సినిమాలకి నాతో రావాలి. ఈ షరతులన్నిటికీ అతను ఒప్పుకుంటాడేమో కనుక్కో అంది. కనుక్కోనవసరం లేదన్నాడు సుబ్బారాయుడు. అక్కణ్ణుంచి సూర్య దగ్గరకు వెళ్లాడు. ‘వనజ మా బాబాయికి ఒక్కతే కూతురు. బోలెడంత ఆస్తి. చచ్చేటంత పలుకుబడి. మరో రహస్యం. ఈ రోజుల్లో మగాడు పైకి రావాలీ అంటే పెళ్లాం ఫార్వార్డ్ అండ్ ఫ్యాషనబుల్‌గా ఉండాలి. మా వనజలాంటి పెళ్లామే ఉంటే నీకు ఏనాటికైనా విదేశీ యాత్ర. ఏమంటావ్’ అన్నాడు. ఏమంటాడు? ఒకే అన్నాడు సూర్య. అమ్మను కూడా ఒప్పించాడు. పెళ్లయిపోయింది. అప్పలస్వామి హ్యాపీ. సూర్యం, అతడి భార్య, తల్లి, తమ్ముడు, చెల్లి వేరే కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకో ట్రాక్‌లో సూర్య చెల్లికి, ఆమె స్నేహితురాలు అన్నయ్య అయిన వేణుకి మనసులు కలిసాయి. మరో ట్రాక్‌లో చంద్రమోహన్‌కి, ప్రొఫెసర్ శంకర్రావు కూతురు వాణీశ్రీకి మధ్య ప్రేమ. కోటీశ్వరుడి కొడుకైన వేణుతో విజయనిర్మల పెళ్లి జరిగింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. తన భర్త ఫొటోని స్టోర్ రూమ్‌లో పడేయడంతో కలత చెందిన అంజలీదేవి కూడా ఇల్లొదిలి వెళ్లి చిన్న కొడుకు చంద్రమోహన్ దగ్గర ఉంది. చంద్రమోహన్ ఉండేది తన గురువుగారి దగ్గర పార్క్ వీధి ఇంట్లో. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. వాసుని కన్విన్స్ చేసి అతడి చేత నామినేషన్ వేయించారు గురువు శంకర్రావు దగ్గరుండే అతడి శ్రేయోభిలాషులు.అప్పలస్వామి మీద అదే వార్డుకి నిలబడ్డాడు వాసు. అప్పలస్వామి, సుబ్బరాయుడు. ఐడియా వేశారు. వాసు మీదకి అతడి అన్న సూర్యాన్ని పోటీగా నిలబెట్టారు. ‘సూర్యం నెగ్గితే మనం నె గ్గినట్టే. సూర్యం ఓడితే ఇక అన్నదమ్ములు మొహమొహాలు చూసుకోరు. ఇక ఆ దెబ్బతో వాసుగాడి పీడా విరగడైపోతుంది’ ఇదీ పథకం. ‘‘అమ్మా... అన్నయ్యల మధ్య ఈ పోటీ ఆపాలమ్మా. అన్నయ్యలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దెబ్బలాట కూడా జరగొచ్చంటున్నారు. నాకేదో భయంగా ఉందమ్మా’ అంది విజయనిర్మల. ‘భయపడి చేసేదేముందమ్మా... ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు. భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అని ఆ తల్లి హృదయం ఆక్రోశించింది. వాసు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో రమణారెడ్డి మరో పథకం వేశాడు. సూర్యం చేత తల్లికి చెప్పించి ఎన్నికల నుంచి వాసు ఉపసంహరించుకునేలా చేశాడు. ‘ఈ ఎలక్షన్ నుంచి వాసు తప్పుకుంటాడు’ అని చంద్రమోహన్ గురువు ప్రకటించాడు. సూర్య ఏకగ్రీవం అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు.మిగిలింది చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి. ముహూర్తం రోజు రానే వచ్చింది. చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి సూర్యం రాలేదు. నోటీసులు వచ్చాయి! శంకర్రావు ఇల్లు జప్తు. పార్క్ లెసైన్సు రద్దు. ఇదీ సారాంశం. పెళ్లయిపోయింది. నోటీసులు చూసి గురూజీ కుప్పకూలిపోయాడు. ‘వాడు మనిషో, రాక్షసుడో ఇప్పుడే తెలుస్తాని అని అన్న దగ్గరికి బయల్దేరాడు వాసు. ‘మీ పాదాల పట్టుకుని ప్రమాణం చేసి చెప్తున్నాను. పార్క్ నోటీసు రద్దన్నా కావాలి. లేదా మా అమ్మకు ఒక్కడే కొడుకు మిగలాలి’ అని బయల్దేరాడు. అతడి వెనకే జనం. అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటున్నారు. రక్తాలు కారుతున్నాయి. తల్లి పరుగెత్తుకొచ్చింది. సూర్య విసిరిన టీపాయ్ తల్లి తలకు తగిలింది. ఆమె నేలపై ఒరిగిపోయింది. సూర్యంలో పరివర్తన మొదలైంది. కొడుకులిద్దరి రక్తాన్ని చూసి ఆ తల్లి దుఃఖించింది. ఈ ఘోరం చూడ్డానికేనా నన్ను బ్రతికించావు అని దేవుడిని అడిగింది. ‘ఈ పాపమంతా నాదేనమ్మా,. నిన్ను గాయపరిచిన ఈ చేతులు... ’ అంటూ రోదిస్తున్నాడు సూర్యం. ‘ఇది ఏపాటి గాయం నాయనా. ద్వేషాలతో, ఈర్ష్యలతో, స్వార్థాలతో, స్వాభిమానాలతో, పగలతో, ప్రతీకారాలతో, పశుప్రాయులై ఏనాడు మీ బ్రతుకును నరకంగా చేసుకున్నారో ఆ నాడే మీ తల్లి హృదయం గాయపడింది నాయనా... ’‘అమ్మా... నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా’ ఏడుస్తున్నాడు సూర్యం. ‘ఈ క్షణం నుంచి నీ పలుకే నాకు వేదవాక్కు. నీ పాదాలకు ప్రమాణం చేస్తున్నానమ్మా. ఆజ్ఞాపించమ్మా..’ అన్నాడు సూర్యం. ‘తల్లి తనకోసం ఏం కోరుతుంది నాయనా. ఏది కోరినా తన బిడ్డల కోసం. వాళ్ల ఆనందం కోసం. ముగ్గురు బిడ్డలను కన్న మీ తల్లి మొదలు 40 కోట్ల ప్రజలను కన్న భరతమాత వరకు ఏ తల్లయినా మనసారా వాంఛించేది ఒక్కటే. తన బిడ్డల అభ్యున్నతి. వాళ్ల ఆనందం. ఐకమత్యం. అన్యోన్యత’ అంది తల్లి. అదే ఊరు. అదే గ్రామదేవత. ఆమె ఆశీర్వాదం కోసం ఈ తల్లీ కొడుకులు ఆ దేవత ఎదుట నిలుచుని ఉన్నారు.మళ్లీ అదే పాట.. ‘కలిమి నిలవదు.. లేమి మిగలదు.. కలకాలం ఒక రీతి గడవదు. ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నము’ సినిమా ఎండ్. పాటలు 1. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేరదిగివచ్చునో... 2. కనరాని దేవుడే కనిపించినాడే 3. వెన్నెల రేయి చందమామ వెచ్చగ ఉన్నది మావా 4. కోయిల కోయ్ అని పిలిచినది... ఓయ్ అని నా మది పలికినది. 5. కన్నుల దాగిన అనురాగం మన పెదవులకందని నవరాగం నటీ నటులు అంజలీదేవి (సీతమ్మ) చంద్రమోహన్ (వాసు), రామ్మోహన్ (సూర్య) వాణిశ్రీ (జమునారాణి), సుకన్య (సూర్య భార్య) రమణారెడ్డి (అప్పలస్వామి) పుష్పవల్లి (అప్పలస్వామి భార్య) కృష్ణమూర్తి (సుందర్రామయ్య) విజయనిర్మల (సూర్య, వాసుల చెల్లెలు) త్యాగరాజు (వస్తాదు శంకర్రావు) వివరాలు-విశేషాలు విడుదల: 1966 దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి సంగీతం: ఎస్.రాజేశ్వర్‌రావు, బి.గోపాలం మాటలు: డి.వి.నరసరాజు నేపథ్యగానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్. జానకీ తదితరులు పాటలు: కొసరాజు, దాశరథి, సి.నారాయణరెడ్డి -
ఎంచుకున్న సంకెళ్లు
‘‘ఊరి నుంచి చంద్రం వచ్చి వెళ్లాడు’’ రామం ఇంట్లోకి అడుగుపెడుతూనే చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ చెప్పింది లక్ష్మి.‘‘అమ్మకెలా ఉందట?’’ సోఫాలో కూలబడుతూ అడిగాడు రామం. మనం జీవితంలో వేసే ప్రశ్నలలో చాలా వాటికి సమాధానం తెలిసే వేస్తాం. మన యాంత్రికమైన సంభాషణలకి అవి ఒక ఊతం మాత్రమే.‘‘ఎలా ఉంటుంది! ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోమంటే మన మాట వింటారా, ఆ ఆర్.ఎం.పి. డాక్టరు ఇచ్చే అరకొర మందులకి ఆవిడ ఉబ్బసం ఏం తగ్గుతుందీ! అలాగే ఉన్నారంట.’’రామానికి తెలుసు - ఆవిడ అలాగే ఉంటుంది, ఆ ఊళ్లోనే ఉంటుంది. జబ్బు తగ్గుతుందని తెలిసినా తమ దగ్గరికి మటుకు రాదు. కొడుకు బడ్జెట్‌కి మరింత భారం కాకూడదనో, కోడలితో వైరం ఎందుకనో, ఉన్న ఇంటిని వదులుకో లేకనో ఆవిడ గడప దాటదు. తనే వెళ్లి ఆవిడని కొన్నాళ్లు చూసుకునే తీరికా స్వతంత్రమూ రామానికి లేవు. ఊరి నుంచి అందిన కబురుతో తల్లి అనారోగ్యం మళ్లీ వాస్తవికతలోకి రావడంతో రామం నిస్తేజంగా మారి పోయాడు. మళ్లీ అవే యాంత్రికమైన సంభాషణలూ, విశ్లేషణలూ, ఆలోచనలూ. మధ్యమధ్యలో అకస్మాత్తుగా ఏదో ఉపాయం స్ఫురణకు వస్తుంది. అంతలోనే అది ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని తేలిపోవడంతో ఆ క్షణికోద్రేకం సడలిపోతుంది. ఆ రాత్రి భోజనాలు ముగిసి నిద్రకు సిద్ధమవుతుండగా, ‘‘లక్ష్మీ’’ అంటూ పిలిచాడు రామం. ఆ స్వరంలోని మార్దవాన్ని గ్రహించిన వెంటనే అర్థమైపోయింది లక్ష్మికి, అతనేదో నిర్ణయానికి వచ్చాడనీ, ఆ నిర్ణయంపై తన సమర్థనని కోరుకుంటున్నాడనీ!‘‘మరేం లేదు’’ తటపటాయిస్తూ మొదలుపెట్టాడు రామం- ‘‘అమ్మని ఎంతగా బతిమాలినా ఇక్కడికి రాదు. అక్కడ ఉంటే తన ఆరోగ్యం సవ్యంగా ఉండటం లేదు. అందుకని నెలనెలా ఓ రెండు వేలు తనకి పంపితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తనకొచ్చే బొటాబొటీ పింఛను ఏ మూలకీ సరిపోతున్నట్లు లేదు. ఏమంటావూ?’’ ఎటో చూస్తూ అడిగాడు రామం. లక్ష్మికి తెలుసు, ఇటువంటిదేదో రామం నోటి వెంట వస్తుందని. ఎందుకంటే తమ జీవితాలలో చాలా సమస్యలకి పరిష్కారం డబ్బుతోనే ముడిపడి ఉంది. ఆప్యాయతలూ, అనుబంధాలూ, సంతుష్టి అని ఎన్ని కబుర్లు చెప్పినా అవన్నీ పూట గడిచిన తర్వాతే కదా! కానీ నెలనెలా రెండు వేలంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఇప్పటికే నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకు భవిత కోసం ఎన్నో వదులు కోవలసి వస్తోంది. అన్నీ మానుకుని జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా ఓ పేరాసెట మాల్తో సరిపెట్టుకుంటే గానీ నెలాఖరుకి ఓ రెండువేలు మిగలట్లేదు. అలాంటిది ఇంకో రెండువేలంటే ఎక్కడి నుంచి వస్తాయి! అందునా వయసు మీదపడిన ఆయన తల్లికోసం, ఎన్నటికీ వీడని ఆవిడ అనారోగ్యం కోసం, అవే రెండు వేలు తమ కొడుకు పేరున వేస్తే మరింత సద్విని యోగం అవుతాయి కదా! అరనిమిషం లోనే లక్ష్మి ఇదంతా ఆలోచించేసింది. కానీ దేన్నీ బయటకి అనలేదు. కొన్ని భావాలని ఉన్నవి ఉన్నట్లుగా వ్యక్తీకరించడానికి సంస్కారం అడ్డు వస్తుంది. అందుకనే లక్ష్మి, రామాన్ని మరోవిధంగా నిలువ రించడానికి ప్రయత్నించింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితులలో నెలనెలా రెండువేలంటే ఎక్కడి నుంచి తేగలం!’’ ‘‘కష్టమేననుకో’’ నిట్టూరుస్తూ బదులిచ్చాడు రామం. ‘‘కానీ ఒక్కో పద్దులోనూ కాస్త కాస్త పొదుపు చేస్తే సాధ్యమేననిపిస్తోంది.’’ ఏమీ మాట్లాడలేదు లక్ష్మి. దాంతో రామమే మళ్లీ అందుకున్నాడు. ‘‘పాలప్యాకెట్లూ, బియ్యం, కూరలు కాస్త చవక రకానివి తెచ్చుకుంటే నెలకి ఎంతలేదన్నా ఓ ఎనిమిదొందలు మిగులుతాయి. ఎలాగూ చలికాలం కాబట్టి ఫ్రిజ్ ఆఫ్ చేసి పారేస్తే ఓ రెండు వందలు కరెంటు ఆదా అవుతుంది, సెల్‌ఫోన్ కూడా అత్యవసరానికి తప్ప వాడ కుండా ఉంటే మూడు వందలు మిగుల్తాయి’’ ఆశువుగా చెప్పుకుపోతున్నాడు రామం, మధ్యలో ఆపేస్తే ఆ నిశ్శబ్దాన్ని భరించడం కష్టం. అసంతృప్తితో కూడిన ఆ నిశ్శబ్దాన్నీ ఆపై పెగిలే పొడిపొడి మాటలనీ చివరికెలాగూ భరించక తప్పదు. ‘‘నా బండి పక్కన పడేసి రోజూ బస్సులో ఆఫీసుకి వెళ్తే, నెలకో ఎనిమిది వందలన్నా ఆదా అవుతాయి, ఇహపోతే...’’ తటపటాయిస్తూ చివరి అంకానికి చేరుకున్నాడు రామం. ‘‘నీకా ఎలాగూ సీరియల్స్ చూసే అలవాటు లేదు, నాకేమో ఆదివారాలు తప్ప టీవీ చూసే తీరికుం డదు. అందుకని కేబుల్ కనెక్షన్ తీయించేస్తే రెండు వందలు మిగుల్తాయి. అంతగా బాబి గాడు మారాం చేస్తే ఓ కార్టూన్ సీడీ కొనిపెడితే సరిపోతుంది’’ అంటూ ముగించాడు.లక్ష్మి ఉలకలేదు, పలకలేదు. రామం చెప్పిన లెక్కల్ని మనసులో బేరీజు వేస్తూ కూడుకుంది - మొత్తం 2,300 రూ॥ఆ మిగతా మూడు వందలూ తనని ఊరించడానికే నని తెలుసు లక్ష్మికి. తనిప్పుడు అనాల్సిన మాటలేమిటో కూడా తెలుసు. ‘‘సరే మీ ఇష్టం!’’ అంటూ నిర్లిప్తంగా అటు తిరిగి పడుకుంది, ఆమె తన మనసులోని అసంతృప్తిని వెల్లడించకపోయినా ఈపాటికి తన కళ్లు చెమ్మగిల్లే ఉంటాయని రామానికి తెలుసు. మర్నాడు ఉదయం బాబిగాడు పాలు తాగనని మారాం చేశాడు. కానీ పాలు పల్చబడ్డాయని మటుకు తెలుసుకోలేక పోయాడు. రామానికి కూడా టీ సయించలేదు గానీ ‘అదే అలవాటైపోతుందిలే’ అనుకుంటూ ఒక్క గుక్కలో తాగేసి నడుచుకుంటూ తన ఇంటికి దగ్గరలో ఉన్న బస్టాప్‌కి బయల్దేరాడు.వచ్చే బస్సూ, పోయే బస్సూ - అన్నీ కిటకిటలాడేవే! ఎప్పుడో ఓసారి తన బండికి రిపేరైతేనే, బస్సెక్కడానికి నామోషీ పడే రామానికి, ఇకపై రోజూ ఆ రద్దీలోనే ఇరుక్కుని ఆఫీసుకి వెళ్లాలన్న ఆలోచన ఇబ్బందికరంగా తోచింది. ఆ బస్సులో అందరూ తనబోటి మనుషులే - కానీ ఎందుకనో ఈవేళ తానొక మెట్టు దిగజారానన్న భావన, తను చేస్తున్న త్యాగం కంటే పడుతున్న ఇబ్బందే ఎక్కువేమోనన్న దుగ్ధ. ‘ అలవాటైపో తుందిలే’ అనుకుంటూ కళ్లు మూసుకుని బస్సు రాడ్డుకి వేలాడసాగాడు. ఆ సాయంత్రం రైతుబజారు దగ్గర ఆగి ఏయే కూరలు చవగ్గా ఉన్నాయో వాకబు చేసి మరీ కొనుక్కుని ఇంటికి బయల్దేరాడు. ఈ లెక్కన తనకిష్టమైన బీన్స్ కానీ బాబిగాడికి ఇష్టమైన క్యారెట్లు కానీ ఇకపై కొనలేకపోవచ్చు. రామం ఇల్లు చేరుకునేసరికి ఇల్లంతా నిస్తేజంగా తోచింది. టీవీ శబ్దంతో ప్రతిధ్వనించే హాలు గోడలన్నీ మూగబోయి ఉన్నాయి. కందిరీగలా ఝంకారం చేసే ఫ్రిజ్ నిశ్చలంగా ఉంది - ఒక్క రోజులోనే ఎంతటి మార్పు. ఈ మార్పుని తాను నెలల తరబడి భరించగలడా! కష్టమే... ఎందుకంటే కొద్దిరోజుల్లోనే అతని నూతన కార్యాచరణకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆ శనివారం సాయంత్రం రామం ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి దిగాలుగా కూర్చునుంది, ‘‘ఏమైంది?’’ ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ భయం భయంగా అడిగాడు రామం. ‘‘ఇంకా ఏం కావాలి, మీ పొదుపు మా ప్రాణాల మీదకి తెచ్చేట్లుంది’’ విసురుగా జవాబిచ్చింది లక్ష్మి. ఉపోద్ఘాతం లేకుండా పురాణం ప్రారంభమవదు కదా!‘‘బాబిగాడు మూడురోజుల నుంచీ సరిగా తిండి తినడం లేదు. ఆ ముతక బియ్యం వాడికి సయించట్లేదు. పైగా బడి నుంచి రాగానే ఫ్రిజ్‌లో నీళ్లు ఉండట్లేదని రోజూ అలుగుతున్నాడు. పనిమనిషి కూడా మీ టీవీ పనిచేయట్లేదేంటని రోజూ అడుగుతోంది’’ - అదీ అసలు సంగతి! ‘‘టీవీ పాడైపోయిందని చెప్పక పోయావా?’’ అనునయించాడు రామం. ‘‘అదీ అయ్యింది. దానికది ఏమందో తెలుసా! ‘‘మీకు కొత్త టీవీ కొనుక్కోవడం అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి. చెన్నైలో మా తమ్ముడు వాళ్లింట్లో పాత టీవీ ఒకటుంది. ఓ వేయి రూపాయలిస్తే దాన్ని తెప్పించి పెడతానంది.’’ఆ మాటలు విన్న రామానికి కూడా లక్ష్మి మనసులోని మంట తగులుకుంది. అసలే అటు ఆఫీసులో రామం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ప్రతి ఒక్కరూ ఎందుకని బండి వేసుకురావటం లేదని అడిగేవారే. బండి రిపేరులో ఉందని చెప్పగానే తమకి తోచిన సలహాలని ఇచ్చేవారే. ఇక వారం నుంచీ ఎవరికీ తనంతట తానుగా ఫోను చేయక పోవడంతో ‘ఇన్కమింగ్ రామం’ అంటూ ఓ మారుపేరు కూడా పెట్టేశారు. ‘‘ఈ ఒక్క నెలా ఓపిక పట్టు లక్ష్మీ! అంతగా అయితే వచ్చే నెల నుంచీ వేయి రూపాయలే పంపుదాంలే!’’ అంటూ ఆమె పక్క కూలబడ్డాడు. అలవాటు తప్పిన బస్సు ప్రయాణాలకి ఇంట్లో చికాకులు కూడా తోడవడంతో మోకాళ్లపై తల వాల్చుకుని నిస్సత్తువగా కూలబడి పోయాడు రామం. ఆలోచనాపరుల కోసం ఓ థింకర్ విగ్రహాన్ని రూపొందించినట్లే, మధ్య తరగతి మనుషుల కోసం ఓ విగ్రహాన్ని చెక్కాలనుకుంటే, దానికి సరిగ్గా సరి పోతుంది, రామం ప్రస్తుత భంగిమ. ఇన్ని సర్దుబాట్లు చేసి నెలాఖరుకి ఎంతో కొంత కూడబెట్టినా, అనుకోని ఖర్చులు రానే వచ్చాయి. లక్ష్మి వాళ్ల అక్క, బావ రాకరాక సిటీకి రావడంతో, వాళ్లకి సిటీలోని పర్యాటక ప్రదేశాలన్నీ చూపించి ఓ పన్నెండు వందల రూపాయలతో వాళ్లిద్దరికీ బట్టలు పెట్టి పంపాడు రామం. అంత చేసినా తాము పెట్టిన బట్టలకి వాళ్ల మొహాలలో వెలుగే కనిపించకపోవడంతో ఉసూరుమనిపించింది. ‘‘మీ అమ్మగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది’’ రామం ఇంటికి రాగానే అతని చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ ఓ ఉత్తరాన్ని అతని చేతిలో పెట్టింది లక్ష్మి.తల్లి ప్రస్తావనతో రామం మనసు చివుక్కుమంది. ఈ నెల పంపుదామను కున్న డబ్బు ఇంకా పంపనే లేదు, వచ్చే నెలకి గానీ ఎంతో కొంత పంపే సావకాశం చిక్కేట్లు లేదు. తాను డబ్బు పంపుతానని అమ్మతో ఏమీ చెప్పలేదే! మరెందుకు రాసిందో ఉత్తరం అనుకుంటూ తెరిచి చదవసాగాడు. ‘‘రామానికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయునది. చలికాలం దాటిపోవడంతో నా ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లుగానే తోస్తోంది. అక్కడ నువ్వు, లక్ష్మీ, పిల్లవాడూ క్షేమంగానే ఉన్నారని తలుస్తాను. బాబిగాడి పుట్టిన రోజు కోసమని వాడికిష్టమైన సున్నుండలూ, జంతికలూ చేసి ఉంచాను. వాటిని చంద్రానికిచ్చి పట్నానికి పంపు తున్నాను. అదే చేత్తో ఓ ఐదు వందలు కూడా పంపుతున్నాను. వాటితో పిల్లవాడికి మంచి బట్టలు కొనగలవు. వీలు చూసుకుని మీరందరూ ఓసారి మనింటికి రండి. మీ ఆరోగ్యాలు జా...’’ చివరికి వచ్చేసరికి అక్షరాలు అలికి నట్లుగా అయిపోయాయి. తల్లి దయకి కళ్ల వెంబడి నీరు ధార కడుతుండగా సోఫాలో వాలిపోయాడు రామం. రామంలో ఊహించని ఈ బేలతనానికి బిత్తరపోయి అతని చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని చదువుతున్న లక్ష్మి వంక చూస్తూ గద్గద స్వరంతో అన్నాడు రామం- ‘‘ప్రపంచీకరణ వలన మన మధ్యతరగతి ప్రజలంతా తెగ సుఖపడిపోతున్నారని, నాయకులూ, మేధావులూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు గానీ, నిజంగా మనమేం బావుకుంటున్నాం చెప్పు! ప్రతి వ్యక్తీ తన జీతానికి అనువైన చట్రంలో బిగుసుకుని పోతున్నాడు. అవసరానికీ, విలాసాలకీ మధ్యనున్న సరిహద్దులు అతి సులువుగా చెరిగిపోతున్నాయి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో, లేక తనే ఆ విలాసాలకి అలవాటుపడో ఉన్న స్థాయి నుంచి ఒక్క మెట్టు కూడా కిందకి దిగలేని నిస్సహాయతలో ఉన్నాం. కార్పొరేట్ చదువులూ, ఏసీలు, కార్లూ, హోటల్ తిళ్లూ, ఎల్ఈడీలూ, ఇంటి లోన్లూ... అంటూ ఎవరి రాబడికి తగ్గట్టు వాళ్లు ఖర్చుపెట్టక తప్పట్లేదు.’’లక్ష్మికి అతడిని ఎలా సముదాయిం చాలో తోచలేదు. తనలోని బాధే వేరొక రిలో వ్యక్తమవుతున్నప్పుడు ఎలా సముదా యించగలదు? కానీ అతనికి సాంత్వన కలిగేట్లు ఒక్కమాట మటుకు అనగలిగింది - ‘‘వచ్చేవారం వెళ్లి ఆవిడతో ఓ రెండు రోజులు గడుపుదాం. ఇక్కడికి వచ్చి ఉంటారేమో మరోసారి అడిగి చూద్దాం!’’ కానీ ఆ పైవారం ఆడిట్ పని మొదలవ్వడంతో ఆ ఊసే మర్చిపోయారంతా! కె.ఎల్.సూర్య -
అద్దె ఇంటికి చంద్రబాబు!
-
అద్దె ఇంటికి చంద్రబాబు!
జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఇల్లు ఖరారు? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పుడు అద్దె ఇంటి వేటలో పడ్డారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంతవరకు కుటుంబ సమేతంగా నివసించడానికి ఓ అద్దె ఇంటి కోసం బాబు అన్వేషిస్తున్నారు. ఆయన, కుటుంబం, వాస్తు, భద్రత ఈ నాలుగింటి మధ్యా ఏకాభిప్రాయం కుదరక గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఇంటి అన్వేషణ ఓ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఉన్న భవనం దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. బాబు మూడోసారి సీఎం పీఠం ఎక్కిన తరవాత వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేశారు. ఇలా బయటి కార్యక్రమాలు పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఇంటిపై దృష్టి పెట్టారు. ఈ ఇంటిని చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులు సూచించారు. -
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి..
కటకటాలపాలైన కామాంధుడు బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రి అరెస్టు సహకరించిన తల్లికి రిమాండ్ మేడ్చల్: బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రిని, సహకరించిన బాధితురాలి తల్లిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కింది బస్తీలో శశికళ(60) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. హోటల్లో పనిచేసే చంద్ర(35), ఆమె వివాహం చేసుకున్నారు. శశికళకు వయసు పైబడడంతో చంద్ర కన్ను ఆమె పెద్ద కూతురి(14)పై పడింది. బాలికపై అతడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. ఇటీవల చంద్ర శశికళ చిన్న కూతురి(11)పై కూడా అత్యాచారం చేయబోయాడు. ఈవిషయం ఈ నెల 1న వెలుగుచూసింది. ఈమేరకు పోలీసులు చంద్రపై కేసు నమోదు చేశారు. చంద్రకు శశికళ కూడా సహకరించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి నిందితులిద్దరిని రిమాండుకు తరలించారు. -
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం, ఒకరి మృతి
నెల్లూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివార్లలోని అయ్యప్ప గుడి సెంటర్లోని పలు దుకాణాలలో చోరీలకు ప్రయత్నం చేశారు. జాతీయ రహదారికి సమీపంలోని శ్రీచింతాళమ్మ వైన్స్ పై వీరి కన్ను పడింది. జనావాసాలకు దూరంగా ఉండటంతో.. అక్కడ చోరీకి ప్రయత్నం చేశారు. దుకాణ ఆవరణలోకి ప్రవేశించిన తరువాత అక్కడే నిద్రిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి అలికిడికి లేచాడు...ఎవరని ప్రశ్నించేలోగానే కర్రలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అనంతరం వాచ్ మెన్ చంద్రయ్య గదిలోకి వెళ్లి ఆయనపై దాడి చేశారు. దుకాణంలో నగదు దొరకకపోవడంతో...మద్యం బాటిళ్లను పట్టుకెళ్లారు. ఈ సంఘటన కలకలం రేపింది. అయిదో నగర పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దోపిడీ దొంగలు వీర విహారం చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. పోలీస్ పెట్రోలింగ్ ఏ విధంగా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని స్థానికులు అంటున్నారు. నేర స్థలిని పరిశీలిస్తే...ఉత్తరాది వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’మూవీ న్యూ స్టిల్స్
-
మాటలకు చేతలకు.. పొంతనకుదిరేనా?
సీఎం ప్రకటనపై నిపుణుల సందేహం తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పి, ఇప్పడు మాట మార్చిన బాబు రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం తిరుపతిలో ఐటీఐఆర్‌నూ ఏర్పాటుచేస్తామని ఒకసారి.. ఐటీ హబ్‌గా మార్చుతామని మరోసారి భిన్నమైన ప్రకటనలు కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేస్తామన్న ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా.. కాదు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్న బాబు శాసనసభలో హామీలకు నిధులేవి? సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల అమలుపై నిపుణులు, రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రగతిపై గతంలో ఒకలా.. గురువారం మరోలా భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్న అంశాన్ని నిపుణులు గుర్తు చేస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక జూన్ 16న విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గురువారం శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) ఛైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. గురువారం చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా తమ గొప్పగా చెప్పుకునే యత్నం..: తిరుపతికి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయానికి రూ.వంద కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు సెప్టెంబరు 26, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఇప్పటికే చేపట్టారు. ఇటీవ ల రేణిగుంట విమానాశ్రయాన్ని పరిశీలించిన ఐఐఏ ఛైర్మన్ అలోక్‌సిన్హా అంతర్జాతీయ విమానాశ్రయంగా రేణిగుంట ఎయిర్‌పోర్టును మార్చలేమని స్పష్టీకరించారు. కేవలం అంతర్జాతీయహోదా కల్పించే పనులే చేయవచ్చునని చెప్పారు. కానీ.. చం ద్రబాబు మాత్రం రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే కనీసం 4,500 ఎకరాల భూమి అవసరం. కానీ.. అక్కడ ఆ మేరకు భూమి అందుబాటులో లేకపోవడం గమనార్హం. చిత్తూరులో అపో లో హెల్త్‌సెంటర్ ఏర్పాటుకు తొమ్మిదేళ్లక్రితమే ఆ సంస్థకు ప్రభుత్వం భూ మి కేటాయించింది. ఆ సంస్థ అక్కడ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ ను తామే ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. కేం ద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐఐటీని మంజూరు చేసింది. ఆ ఐఐటీ నే తిరుపతిలో ఏర్పాటుచేస్తామనిబాబు చెప్పారు. కేంద్రం ఐఐఎస్ఈ ఆర్‌ను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కానీ.. అవేమీ పట్టకుండా తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటుచేస్తామని ప్రకటిచండం గమనార్హం. ఏ ర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(ఎన్ఐఎమ్జెడ్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ.. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన శ్రీకాళహస్తి స్పైన్‌పై మాత్రం చంద్రబాబు స్పందించలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు రూ.1,500 కోట్లతో శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని పూర్తిచేస్తేనే ఏర్పేడులో ఎన్ఐఎమ్జెడ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. బడ్జెట్లో నిధులేవీ? తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని గురువారం శాసనసభలో సీఎం ప్రకటించారు. మెట్రోరైల్‌ను కూడా తి రుపతికి తీసుకొస్తామని చెప్పారు. కానీ.. ఇటీవల విశాఖపట్నం, విజయవాడ-తెనాలి-గుంటూరులకు మాత్రమే మె ట్రోరైల్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పడు తిరుపతిలో మెట్రో రైల్‌ను ఏర్పాటుచేసే అంశంపై చంద్రబాబు స్పందించలేదు. మెగా సిటీకి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పిన చంద్రబాబు.. మెట్రో రైల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించాలని చెప్పకనే చెప్పా రు. కానీ.. మెట్రో రైల్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్ర కటించారు. మామిడి తోటలు విస్తారంగా ఉన్న జిల్లాలో హార్టికల్చర్ జోన్ ఏర్పాటుచేయడం ఆహ్వానించదగ్గదే. ఫుడ్ పార్క్దీ అదే పరిస్థితి. కానీ.. తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఇప్పటికే ఆధ్మాత్మిక కారిడార్‌గా అనధికారిగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ కారిడార్‌నే అధికారికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వీటిని పరిశీలించిన నిపుణులు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా చంద్రబాబు వ్యహరిస్తోన్న తీరును చూస్తే మాటలకు చేతలకు పొంతన కుదిరేట్టు లేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
నమ్మించి గొంతుకోశారు..
డ్వాక్రాకు రుణమాఫీ లేదన్న బ్యాంకు అధికారి మండిపడ్డ మహిళలు కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ వర్తించదని ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజరు రవికుమార్ స్పష్టం చేయడంతో వారంతా అవాక్కయ్యారు. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచ్చి మండుటెండలో ఎదురు చూస్తే చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. గుడ్లవల్లేరు : ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే బ్యాంకు ప్రాంగణంలో రుణమాఫీపై బుధవారం విజయవాడ జోనల్ చీఫ్ మేనేజర్ పి.వి.రవికుమార్ రైతులు, డ్వాక్రా మహిళలకు స్థానిక బ్రాంచి మేనేజరు కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సులో రవికుమార్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వర్తించదని, ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ కింద కేటాయిస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ విషయమై ప్రభుత్వం మరిన్ని విధివిధానాల్ని త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. పంట రుణమాఫీకి షరతులు వర్తిస్తాయ్... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను జీవో నంబరు 174 ప్రకారం నిర్వర్తించనున్నట్లు రవికుమార్ తెలియజేశారు. రైతులు బ్యాంకులో 2013 డిసెంబరు 31వ తేదీ నాటికి తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలతో పాటు గతంలో దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన పంట రుణాలు, వ్యవసాయ నిమిత్తం బంగారంపై తీసుకున్న పంట రుణాల మొత్తానికి మాఫీ వర్తిస్తుందన్నారు. ఈ రుణాలు 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన మొత్తానికి నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల పరిమితి వరకూ మాత్రమే రుణమాఫీ వర్తించనున్నట్లు పేర్కొన్నారు. 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన రుణాల్ని రైతులు ఆ తేదీ తర్వాత చెల్లించిన వాటికి కూడా నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందన్నారు. చంద్రబాబు మోసం చేశాడంటూ మహిళల ఆరోపణ... చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తారని పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచాచమని అయితే అధికారులు చెప్పిన మాటలను బట్టి తమను చంద్రబాబు మోసం చేశారని అర్థమైందని వాపోయారు. తమ పద్ధతిలో తాము పొదుపు చేసుకుంటూ రుణాల్ని సవ్యంగా చెల్లిస్తున్న సమయంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ వలన రుణాల చెల్లింపే గాక పొదుపు చేయడం మానేశామన్నారు. ఓట్లు వేయించుకున్న బాబు తమకు బాగానే బుద్ధి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. గ్రామ సర్పంచులు పామర్తి హనుమంతరావు, పడమటి సుజాత, భూషణం, రైతులు జగన్మోహనరావు, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రుణమాఫీ అంటూ రైతులకు నోటీసులా? రుణమాఫీ చేస్తామన్న బాబు బ్యాంకర్లతో రైతులకు నోటీసులు ఇప్పించడం అన్యాయమని రైతులు బాడిగ భాస్కరరావు, చిన పాములు అన్నారు. రుణమాఫీ చేయాలంటే ఒక్క మహానేత వైఎస్‌కే సాధ్యమైందన్నారు. అర్ధం లేని నిబంధనల పేరిట రుణమాఫీలోనూ బాబు రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కౌలుదారులకు రుణమాఫీ వర్తించదా? రుణమాఫీ కౌలుదారులకు ఎందుకు వర్తింపజేయరని వెణుతురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంటి కౌలుదారులే ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అలాంటి వారికి రుణమాఫీ లేకుండా సాగు చేయనివారికి రుణమాఫీ చేయటం అన్యాయమని తెలిపారు. -
మాఫీపై బాబుకు నిరసనల సెగ
తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు గాజువాక, అనకాపల్లి, చోడవరంలో పర్యటించగా పలుచోట్ల రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై చంద్రబాబు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. బ్యాంకులు తిరిగి రుణాలు చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం రుణమాఫీపై ప్రశ్నించినవారిపై తీవ్రంగా ఊగిపోయారు. అనకాపల్లికి సమీపంలోని తుమ్మపాల చెరకు ఫ్యాక్టరీ రైతులతో జరిగిన ముఖాముఖీలో మాఫీపై ప్రశ్నించిన ఓ రైతును యూజ్‌లెస్‌ఫెలో అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గంధవరం గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ మహిళ డ్వాక్రా మహిళలపై నిరసన వ్యక్తం చేయగా... చేసేవాళ్లు ఉంటే అడిగేవారు ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ పట్టభద్రులు, ప్రస్తుతం కోర్సు చదువుతున్న నిరుద్యోగులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని, ప్రస్తుతం డీఎడ్ అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న డీఎస్సీలో అవకాశం కల్పించాలని చోడవరంలో విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 14 నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నామని వెలుగు సీఏలు గజపతినగరం గ్రామంలో విన్నవించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. -
ఎడముఖం పెడముఖం
బాబు సమక్షంలోనూ మారని మంత్రుల తీరు సీఎం పర్యటనలోనూ కొనసాగిన విభేదాలు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రడు,గంటాశ్రీనివాసరావుల విభేదాలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు పర్యటనలోనూ బయటపడ్డాయి. కలిసి పనిచేసుకోవాలని గతంలో చంద్రబాబు వీరిద్దరికి హితవు పలికినా.. తమ పద్ధతి ఇంతేనని చాటుకుంటున్నారు. సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి తొలిరోజు పర్యటన ముగిసేవరకు అక్కడక్కడా చిన్న పలకరింపు మినహా అసలు మాట్లాడుకోలేదు. చివరకు ప్రసంగించే వాహనంపైకి బాబు ఎక్కి మాట్లాడుతున్నా వెనుక ఇద్దరూ దూరందూరంగా నిల్చున్నారు. ఆ తర్వాత గంధవరంలో అయ్యనపాత్రుడు కాన్వాయ్‌ను వదిలి చోడవరం బహిరంగ సభ వద్దకు ముందుగానే వెళ్లిపోయారు. చాలామంది ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేయగా, వీరు మాత్రం విడివిడిగా తమ పని కానిచ్చారు. చోడవరం బహిరంగ సభ వేదికపైనా ఇద్దరూ వేర్వేరుగా కూర్చున్నారు. గంటా,వ్యవసాయ మంత్రి పుల్లారావు పక్కపక్కన కూర్చుని ఇద్దరూ అదేపనిగా మాట్లాడుకుంటే అయ్యన్న మౌనంగా కూర్చున్నారు. కనీసం బాబు సమక్షంలోనూ పలకరించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాస్తవానికి సీఎం జిల్లా పర్యటన తొలుత ఖరారైనప్పుడు అధికారులు ఇద్దరు మంత్రులను సమీక్షకు ఆహ్వానించారు. దీనికి అయ్యన్న ముందుహాజరవ్వగా, గంటా ఆలస్యంగా వచ్చారు. దీంతో అయ్యన్న గంటాను ఉద్దేశించి ఎంత సేపు వెయిట్ చేయించావేంటి అని ఆగ్రహించారు. దీనికి గంటా కూడా గతంలో నువ్వుకూడా అలాగే చేశావు కదా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనకాపల్లిలో రాత్రి బస విషయంలోనూ ఇద్దరి మధ్య పంతాలు నడిచాయి. అనకాపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రి బస ఉండాలని గంటా పట్టుబట్టగా, అయ్యన్న మాత్రం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రలోనే బస ఉండాలని పట్టుబట్టి చివరకు మాట నెగ్గించుకున్నారు. చివరకు ఇలా సీఎం పర్యటనలోనూ ఇద్దరు దూరందూరంగానే ఉండడంతో జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిలో ఎవరిని ముందుగా పలకరించాలో తెలియక దూరంగా వెళ్లిపోయారు. -
ఎసీబీ వలలో వెదురుకుప్పం ఆర్ఐ
వెదురుకుప్పం: వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్ర గురువారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు మండలంలోని దామరకుప్పం గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలు పోగొట్టుకున్నాడు. రామచంద్రారెడ్డి కుమారుడు అత్తూరు రాజేంద్రరెడ్డి ఈ మేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారించి పాసుపుస్తకాలు బస్సులో పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు. పాసు పుస్తకాల జిరాక్సు కాపీలతో పాటు పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్తో వెదురుకుప్పం తహసీల్దార్ ఇంద్రసేనకు డూప్లికెట్ పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. దీంతో తహసీల్దార్ కింది స్థాయి సిబ్బందికి సంబంధిత ఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫైల్ సిద్ధం చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఏవో కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తూ రాజేంద్రరెడ్డిని వేధించాడు. దీంతో విసిగి వేసారిపోయిన రాజేంద్రరెడ్డి తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు రాజేంద్రరెడ్డికి డబ్బులు ఇచ్చి ఆర్‌ఐకు ఇవ్వాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆర్ఐ చంద్రకు రూ.3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో సీఐలు రామకిషోర్,చంద్రశేఖర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో అధికారులు అవినీతికి పాల్పడినా,డబ్బులు డిమాండ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నా సెల్ ః9440446190, 9440446120,9440446138, 9440446193,9440808112 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శంకర్‌రెడ్డి కోరారు. రెవిన్యూ అధికారుల్లో గబులు వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా సిబ్బంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ నాయకులు కూడా ఈ విషయూన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆర్ఐను పట్టుకోవడంతో సిబ్బందిలో గుబులు పట్టుకుంది. కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలియడంతో వీఆర్వోలు పత్తా లేకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన సిబ్బందిలో నెలకొంది. -
పాత టార్గెట్...కొత్త విజన్ !
సాక్షి, చిత్తూరు: విజన్ 2020 పేరుతో రాష్ట్రాన్ని స్వ ర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు పాత టార్గెట్‌కు చేరుకునేందుకు కొత్త విజన్ రూపొందించుకున్నారు. ఇప్పుడు విజన్ 2029 పేరుతో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చేసేందుకు ఏడు అంశాలతో ‘సెవెన్ మిషన్’ ప్రకటించారు. అభివృద్ధి కోసం ఏడు అంశాలను రూపొందించి, వాటి కార్యసాధనకు ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ ట్రస్టీలు, దాతల నుంచి విరాళాలు సేకరించి ముందుకె ళ్తామని విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్ల సమీక్షలో ‘బాబు’ ప్రకటించారు. అయితే చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు. జిల్లా కలెక్టర్లతో పాటు అన్నిశాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు జిల్లా అభివృద్ధి కోసం జిల్లాల వారీగా ప్రత్యేక మిషన్ రూపొందిస్తారని భావించారు. అయితే ‘కలిపికొట్టరా కావేటి రంగా!’ అన్నట్లు 13జిల్లాల అభివృద్ధికి ఏడు అంశాలతో ఓ మిషన్ ప్రకటించి, దానికి తాను చైర్మన్‌గా, కొందరు మంత్రులను వైస్ చైర్మన్లుగా నియమించారు. 13 జిల్లాల్లో ఏ జిల్లా ఎంత వెనుకబడి ఉంది? ఏ జిల్లాలో ఎలాంటి ఆర్థిక వనరులున్నాయి ? జిల్లా నైసర్గిక స్వరూపం, ఆర్థిక వనరులు, ప్రకృతి సంపద నేపథ్యంలో ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి ? వాటికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి? అనే దిశగా చర్చ జరుగుతుందని అంతా భావించారు. కానీ సమావేశం మరోలా జరగడంతో జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టంకాలేదు. దీనిపై జిల్లా అధికారులు కూడా తలలుపట్టుకుంటున్నారు. అలాగే రాబోయే 20 ఏళ్లలో 664 మండలాలను నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మండలాన్ని నగరం చేయడం అం టే ఏమిటో ? అది 20 ఏళ్లలో ఎలా సాధ్యపడుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. విజన్ 2029 సాధనకు ప్రభుత్వం ప్రకటించిన మార్గం ఇదే.. విజన్ 2029 పేరుతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేందుకు చంద్రబాబు ప్రకటించిన విజన్ ఇలా ఉంది. ఏడు అంశాలతో ఓ మిషన్ ఏర్పాటు చేశారు. ప్రతీ మిషన్‌కు ప్రత్యేక సెక్రటేరియట్‌తో పాటు ఓ సీఈఓను నియమిస్తారు. అలాగే అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నిపుణులను, ప్రముఖులను సభ్యులుగా తీసుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలు సలహామండలిగా పనిచేస్తాయి. వీటి నిర్వహణను రాష్ట్రస్థాయిలో మంత్రులతో పాటు సీఈఓ, ప్రత్యేక సెక్రటేరియట్ పనిచేస్తుంది. అలాగే జిల్లాస్థాయిలో ఏడు మిషన్లకు కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. అలాగే ఎంఐఎంయూ జిల్లా స్థాయిలో స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇది కలెక్టర్ కోఆర్డినేషన్లో పనిచేస్తుంది. అన్నిశాఖల సమన్వయంతో ప్రతీ మిషన్ పనిచేయాలి. ఈ ఏడు అంశాలపై సమావేశంలో పవర్‌పాయింట్ ద్వారా కలెక్టర్లకు అవగాహన కల్పించారు. అలాగే వీటి పనితీరు, సమాచార సేకరణ రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను 2014-2019కి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇదే పంథాలో రాష్ట్రాన్ని 2022కు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ‘ఇండియా ఎట్-75’గా ఎదగాలని సూచించారు. 2029కి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నారు. ఈ కాలంలో మూడు మెగా సిటీలను, 12 పట్టణాలను నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు. మూడు మెగాసిటీల్లో తిరుపతి కూడా ఉండడం విశేషం. ఏడు మిషన్లు ఇవే.. 1. ప్రాథమికరంగ మిషన్: వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. 2. ఉత్పత్తిరంగ మిషన్: జీఎస్డీపీని పెంచేందుకు పనిచేస్తుంది. అంటే ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేకంగా పనిచేస్తుంది. 3. మౌలిక వసతుల రంగం: అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, కొత్త వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తుంది. 4. సేవారంగ మిషన్: ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు పనిచేస్తుంది. 5. పట్టణాభివృద్ధి మిషన్: రాష్ట్రంలో 3 మెగాసిటీలు, 12 పట్టణాలను సిటీలుగా మార్చడం, 20 ఏళ్లలో 664 మండలాలను నగరాలుగా అభివృద్ధి చేస్తారట. 6. నైపుణ్య వృద్ధి(స్కిల్ డెవలప్మెంట్ మిషన్): ఉపాధి అవకాశాలను పెంచడం 7. సాధికారిత మిషన్: స్త్రీ, శిశు సంక్షేమం కోసం పనిచేస్తుంది. చిత్తూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ? సమావేశంలో చిత్తూరు గురించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమగ్ర ప్రణాళికతో సిద్ధమై వెళ్లారు. అయితే చిత్తూరుపై సీఎం ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే సమావేశం అనంతరం కుప్పం అభివృద్ధిపై మరోసారి రాజధానిలో సమీక్ష నిర్వహిద్దామని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది. -
మీరు ముక్కుసూటిగా పోతే మాకు దెబ్బ
మీరంతా మా డెరైక్షన్‌లో పనిచేయండి..: కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో చంద్రబాబు విజయవాడ: ‘‘ప్రభుత్వపరంగా మేమొక డెరైక్షన్‌లో పోతున్నాం. మీరు అట్లా కాకుండా.. ‘మేం కరెక్టుగా ముక్కుసూటిగా పోతున్నామ’ంటే.. మీరు పోతారు. దెబ్బ తగిలేది మాకు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. నేను చెబుతున్నదాంట్లో మీరంతా స్పష్టంగా ఉండాలి. అందరూ అదే డెరైక్షన్‌లో పనిచేయాలి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు నిర్దేశించారు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఆ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్క పనీ మాపై ప్రభావం చూపుతుంది. కలెక్టర్ బాగా పనిచేస్తే మేం మరో ఐదారు సీట్లు గెలుస్తాం. మళ్లీ అధికారంలోకొస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో బాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సదస్సు సాగింది. 13 జిల్లాల కలెక్టర్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక కలెక్టర్లు, ఎస్పీలతో విడిగా మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వాళ్లందరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది ‘‘ప్రజాస్వామ్యంలో ఒక విధానం ఉంటుంది. రేపటి రోజున మేం పోతే మీరెవరూ మాకు కనబడరు. మళ్లీ మేం వెళ్లేది కార్యకర్తల దగ్గరకే. వాళ్లందరనీ మేం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వ హామీలు నెరవేర్చడానికి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి జిల్లాల్లో కలెక్టర్లే సంపద సృష్టించాలి. ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలి. కలెక్టర్లు తప్పు చేస్తే కాపాడలేను. కాలక్షేపం చేస్తే సరిపోతుందనే ఆలోచన వద్దు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంపికైన కేడర్ ఆఫీసర్లలో ఇది మరీ ఎక్కువగా ఉంది. కష్టపడి పని చేయాలి. రుణ మాఫీకి ఆర్బీఐ అడ్డుపడుతోంది... ైరె తులకు, పేదలకు మేం చాలా హామీలిచ్చాం. రైతు రుణాను, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నాం. ఇప్పుడు ఆర్బీఐ అడ్డుపడుతోంది. రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని ఆర్బీఐకి మరోసారి లేఖ రాస్తా. చేయకపోతే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తాం. జిల్లా స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఎలాగైనా పంట రుణాలు ఇప్పించే బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలి. ఏపీ విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్ చేస్తుంది. అయితే ఏపీ విద్యార్థులెవరో తెలంగాణ ప్రభుత్వమే తేల్చాలి. రుణాల మాఫీ, నిత్యావసర సరుకులు, ఫించన్లు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ కోసం ప్రతి ఒక్కరినీ ఆధార్‌కు అనుసంధానం చేయండి. రాష్ట్రం మధ్యలోనే రాజధాని కొత్త రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉంటుంది. అదెక్కడో మేమే నిర్ణయిస్తాం. మనుషులు, ప్రత్యేక జీవనం, ఉపాధి అవకాశాలు, సకల సదుపాయాలు ఉన్నచోటే రాజధాని ఉంటుంది. విశాఖ, తిరుపతి, విజయవాడలను మెగాసిటీలుగా, మరో 13 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. -
ఆగస్ట్ 16న ‘సౌత్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్-2013
-
అయ్యన్నపాత్రుడు , గంటా మధ్య విభేదాలు
మరోసారి బయటపడ్డ అయ్యన్న, గంటా మధ్య విభేదాలు సమీక్షకు గంటా మూడు గంటలు ఆలస్యం అయ్యన్న అసహనం పరస్పరం విసుర్లు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే వీరిద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమీక్షలో తేటతెల్లమైంది. సీఎం చంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అయ్యన్న ఉదయం 10 గంటలకే ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రి గంటా మాత్రం సమావేశం ఉందని తెలిసీ గంభీరం పర్యటనకు వెళ్లిపోయారు. దీంతో అయ్యన్న గంటా ఎంతసేపటికీ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్‌తోపాటు అధికారులంతా గంటా వెనుకే వెళ్లడంతో అయ్యన్న వద్ద ఒక్క జిల్లా అధికారి మినహా మరెవరూ లేరు. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండడంతో వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ఆయన బయటకు వచ్చేశారు. ఈలోగా గంటా రావడంతో ఆయన్ను ఉద్దేశించి ‘ఏం మంత్రిగారు.. మమ్మల్ని మూడు గంటలు నిరీక్షింపచేస్తారా’? అని ప్రశ్నించగా, ‘నువ్వు కూడా నన్ను గతంలో చాలా వెయిట్ చేయించావు కదా’ అని గంటా బదులిచ్చి నేరుగా లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా సమావేశం ముగించారు. నవ్వులు విరిశాయ్... చేతులు కలుస్తాయా? అవును... మీరు చూస్తున్నది మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులనే. ఈ చిత్రం ఆదివారం సాయంత్రం చోడవరంలో కనిపించింది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షకు చోడవరం వచ్చిన వీరు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కార్యాలయంలో పక్కపక్కనే కూర్చున్నారు. చలోక్తులు వేసుకొని నవ్వుకున్నారు. గంటా ముందు ముభావంగానే ఉన్నా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే రాజుపై చలోక్తులు వేయడంతో గంటాతో పాటు ఎంపీ ముత్తంశెట్టి కూడా చిరునవ్వు చిందించారు. దీంతో రాజు కాస్త చిన్నబుచ్చుకున్నట్లు కనిపించినా తర్వాత ఆయన కూడా నవ్వులు కలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చలో మాత్రం గంటా ఆధిక్యం ప్రదర్శించడంతో అయ్యన్న వినడానికే పరిమితమయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులిద్దరూ వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించడం గమనార్హం. మీ శాఖలో నేను వేలుపెట్టలేదంటూ అయ్యన్న చెబితే... ఈ విషయం ఫోన్లో అడిగావు కదా అంటూ గంటా సమాధానమివ్వడం ఈ పర్యటనలో కొసమెరుపు. మరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కలసినట్టేనా అంటే ఏమో అనే సంశయమే ఇంకా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. - చోడవరం టౌన్ చెప్పింది చాల్లే.. : ముత్తంశెట్టిపై గంటా విసుర్లు విశాఖపట్నం : ఇంతవరకూ గంటా మాటే వేదమని భావించిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి నిండుసభలో నివ్వెరపోయారు. వేపగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి తన ప్రసంగంతో రాష్ట్ర మంత్రి నారాయణను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మంత్రి నారాయణను కొనియాడుతూనే నగరంలో పెండింగ్ ప్రాజెక్టుల జాప్యాన్ని, అధికారుల అనాలోచిత చర్యలను గుర్తు చేశారు. ఇలా ప్రసంగిస్తుండగా, మంత్రి గంటా ఆయన వైపు ఒకింత అసహనంగా చూశారు. ఎంపీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ‘చాల్లే చెప్పింది.. ఇక ఆపు...’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ముత్తంశెట్టి అవాక్కయ్యారు. మీరు ఎంపీ పదవిని అనుభవించారు... అయినా మంత్రిగారు కాస్త ఒత్తిడితో ఉన్నట్లున్నారు...సభకు నమస్కారం అంటూ ప్రసంగం ఆపేశారు. ఆ తర్వాత మంత్రి గంటా మైకుతీసుకుని ముత్తంశెట్టిని మరోమారు చమత్కరించారు. ముత్తంశెట్టికి ఎంపీ పదవి తొలిసారి...అందుకే ఇంత ఉత్సాహం అంటూ...వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
బాబ్బాబు ప్లీజ్..
ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవులపైనే అందరి దృష్టి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు బాబు హామీలు నెరవేర్చేనా? జిల్లాల్లో ‘నామినేటెడ్’ కాక రాజుకుంది. ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవుల కోసం టీడీపీ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని ముఖ్య నేతలు పదవుల కోసం పోటీ పడుతుండటంతో అధినేత ఎవరికి పట్టం కడతారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రులు, ఎంపీలు కూడా తమ వర్గ నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : నామినేటెడ్ పదవుల పంపకానికి ప్రభుత్వం ‘పచ్చ’జెండా ఇచ్చేసింది. ఎలాగైనా కీలక పదవులు పొందాలని టీడీపీ నేతల్లో ఆరాటం మొదలైంది. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, వీజీటీఎం ఉడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారే పార్టీలో తమ గాడ్ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నేరుగా చంద్రబాబును కలిసి ‘గతంలో మీరు చెప్పినట్టే నడుచుకున్నామని, మీరు కూడా మాకు హామీ ఇచ్చినట్లుగానే నామినేటెడ్ పదవి ఇవ్వాలని’ కోరుతున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం పట్టు... స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పదవీకాలం కొద్దికాలం కిందట ముగిసింది. ఎలాగైనా తానే తిరిగి ఎమ్మెల్సీ పదవి పొందాలని ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. బుద్దా వెంకన్న గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ఎమ్మెల్యే సీటు మరొకరికి కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వెంకన్న అంగీకరించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైవీబీ రాజేంద్రప్రసాద్, పంచుమర్తి అనూరాధ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. వారికి కూడా చంద్రబాబు ఇదే తరహా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి వీరి మధ్య పోటీ తీవ్రమైంది. మరోవైపు పామర్రు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ఎంపీ కేశినేని నాని మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు పందేరం విషయంలో టీడీపీ నాయకులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఉడా’ చైర్మన్ గిరీ కోసం.. ఉడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి తమకు పదవి కేటాయించాలని పలువురు నేతలు అధినేతను కోరుతున్నట్లు తెలిసింది. జగ్గయ్యపేటకు చెందిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ తొండెపు దశరథజనార్దన్, గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన నాగుల్‌మీరా, బందరు టికెట్ కోసం ప్రయత్నించిన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, టీడీపీ విజయవాడ అర్బన్ ఉపాధ్యక్షుడు ముష్ఠి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇప్పటికే సీఎంతో చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్లు సమాచారం. తనకే ఉడా చైర్మన్ పదవి వస్తుందని రవి ప్రసాచారం సాగిస్తున్నారు. చంద్రబాబు కూడా నామినేటెడ్ పదవి ఇస్తానని రవికి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాగుల్‌మీరాకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి ఆశీస్సులు ఉన్నాయి. పంచుమర్తి అనూరాధ నేరుగా చంద్రబాబుతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. బుద్దా వెంకన్నకు మంత్రి దేవినేని ఉమా అండగా ఉన్నారు. యలమంచిలి రవికి సుజనా చౌదరి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర కూడా తమ అనుచరులకు ఉడా చైర్మన్ పదవి దక్కించుకునేందకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ వారికే ఉడా చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన విషయాన్ని ఇక్కడి నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘వణుకూరి’ ముమ్మర ప్రయత్నాలు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చివరిలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పదవి పొందారు. ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. శ్రీనివాసరెడ్డి కూడా రాయపాటి ద్వారా తన పదవిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి పదవులు ! ఇప్పటికే జిల్లాలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమైన మంత్రి పదవులు దక్కాయి. ఎమ్మెల్యేలుగా కూడా వారే ఎక్కువ మంది ఉన్నారు. మేయర్ పదవి కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారికి దక్కింది. ఉడా చైర్మన్ పదవి విషయంలో బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీలోనే పలువురు పట్టుపడుతున్నారు. అయితే బాబు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే. -
నెంటూరు చిన్నారులకు ఊరట!
వర్గల్: వర్గల్ మండలం నెంటూరు చిన్నారుల దీన స్థితి, వృద్ధులకు పెనుభారమైన వైనంపై సోమవారం ‘పండుటాకులకు పెద్ద కష్టం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగం స్పందించింది. సోమవారం మెదక్‌లోని చైల్డ్ లైన్ సంస్థ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు రజని, నందిని చదువుకు ఆసరాగా నిలుస్తామని పేర్కొంటూ ఫోన్ ద్వారా వారి వివరాలు సేకరించారు. మరోవైపు సమగ్ర బాలల సంరక్షణ పథకం కింద చిన్నారులకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సాయం వర్తింపజేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నడుం బిగించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ అధీనంలోని ఐసీపీఎస్ (సమగ్ర బాలల సంరక్షణ పథకం) కౌన్సిలర్ రాజు ఈ మేరకు మంగళవారం నెంటూరును సందర్శించారు. చిన్నారుల నానమ్మ చీరాల రామవ్వను కలిసి, పిల్లల వివరాలు తెలుసుకున్నారు. ఆగస్టు నుంచి పిల్లలకు ప్రతి నెలా నగదు సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
= పరారీలో మరో ముగ్గురు = వీడిన వాసుదేవనమళ్లి హత్య కేసు మిస్టరీ = తమ్ముడి కొడుకే ప్రధాన నిందితుడు = ఆస్తి కోసం హత్యకు స్కెచ్ దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : తాలూకా పరిధిలోని వాసుదేవనహళ్లి వద్ద నవంబర్ 12న జరిగిన హనుమంతప్ప (45) అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడితో కలిసి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ శివారెడ్డి తెలిపారు. నిందితులు చిక్కబళ్లాపురం అరకెరె గ్రామానికి అశ్వత్థప్ప, చింతామణికి చెందిన డ్రైవర్ చంద్ర, ప్రధాన నిందితుడు, మృతుడి తమ్ముడి కుమారుడు ప్రవీణ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విలేకరుల సవ ూవేశంలో వివరాలు వెల్లడించారు. గతనెల 12న సాయంత్రం 6 గంటల సమయంలో హనుమంతప్ప మెళేకోట క్రాస్ నుంచి కోడి మాంసం తీసుకుని వాసుదేవనహళ్లిలోని తోట ఇంటికి బైక్‌పై ఒంటరిగా వెళ్తుండగా కారులో వచ్చిన ఆరుగురు దుండగులు వ ూరణాయుధాలతో దాడిచేసి విచక్షణారహితంగా నరికి తల వేరుచేసి పరారయ్యారు. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు హతుడి తమ్ముడి కుమారుడే నిందితుడని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. ఆస్తిలో భాగం కోసమే ప్రధాన నిందితుడు ప్రవీణ్ తాత పిళ్లప్పకు చెందిన 10 ఎకరాల భూమిలో తన అత్తకు (హతుడి చెల్లెలు)కూడా భాగం ఇవ్వాలనే విషయంలో హనుమంతప్ప, ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హనుమంతప్ప ఆస్తి పంపకానికి ససేమిరా అనడంతో కక్షగట్టిన ప్రవీణ్ నిందితులతో కలసి హనుమంతప్ప హత్యకు స్కెచ్ వేసి అమలు చేశాడు. హత్యకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వివ రించారు. నిందితుల నుంచి నాలుగు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.