= పరారీలో మరో ముగ్గురు
= వీడిన వాసుదేవనమళ్లి హత్య కేసు మిస్టరీ
= తమ్ముడి కొడుకే ప్రధాన నిందితుడు
= ఆస్తి కోసం హత్యకు స్కెచ్
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : తాలూకా పరిధిలోని వాసుదేవనహళ్లి వద్ద నవంబర్ 12న జరిగిన హనుమంతప్ప (45) అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడితో కలిసి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ శివారెడ్డి తెలిపారు. నిందితులు చిక్కబళ్లాపురం అరకెరె గ్రామానికి అశ్వత్థప్ప, చింతామణికి చెందిన డ్రైవర్ చంద్ర, ప్రధాన నిందితుడు, మృతుడి తమ్ముడి కుమారుడు ప్రవీణ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా విలేకరుల సవ ూవేశంలో వివరాలు వెల్లడించారు. గతనెల 12న సాయంత్రం 6 గంటల సమయంలో హనుమంతప్ప మెళేకోట క్రాస్ నుంచి కోడి మాంసం తీసుకుని వాసుదేవనహళ్లిలోని తోట ఇంటికి బైక్‌పై ఒంటరిగా వెళ్తుండగా కారులో వచ్చిన ఆరుగురు దుండగులు వ ూరణాయుధాలతో దాడిచేసి విచక్షణారహితంగా నరికి తల వేరుచేసి పరారయ్యారు. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు హతుడి తమ్ముడి కుమారుడే నిందితుడని తెలియడంతో షాక్‌కు గురయ్యారు.
ఆస్తిలో భాగం కోసమే
ప్రధాన నిందితుడు ప్రవీణ్ తాత పిళ్లప్పకు చెందిన 10 ఎకరాల భూమిలో తన అత్తకు (హతుడి చెల్లెలు)కూడా భాగం ఇవ్వాలనే విషయంలో హనుమంతప్ప, ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హనుమంతప్ప ఆస్తి పంపకానికి ససేమిరా అనడంతో కక్షగట్టిన ప్రవీణ్ నిందితులతో కలసి హనుమంతప్ప హత్యకు స్కెచ్ వేసి అమలు చేశాడు. హత్యకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వివ రించారు. నిందితుల నుంచి నాలుగు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హత్య కేసులో నిందితుల అరెస్టు
Published Thu, Dec 12 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement