జస్టిస్ పీసీ ఘోష్‌కు తెలిపిన నీటిపారుదల శాఖ డిప్యూటీ సీఈ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన రూ.159 కోట్ల బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి నీటిపారుదల శాఖ మహదేవ్‌పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. శాఖ ఉన్నతాధికారులకు కూడా ఆయన సమాచారం ఇవ్వలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్‌ఖాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం కమిషన్ నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీలు విడుదల చేసే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నా రా? అని కమిషన్ ప్రశ్నించగా, ఈ విషయంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.
⇒ తాను విధుల్లో చేరకముందే మేడిగడ్డ బరాజ్ పూర్తయిందని మాజీ డిప్యూటీ ఎస్‌ఈ ఎస్.సత్యనారాయణ కమిషన్‌కు తెలిపారు.
⇒2022 జూలైలో బరాజ్‌లకు భారీ వరదలు రావడంతో అప్రాన్, సీసీ బ్లాకులు కొట్టుకుపోయా యని ఎస్‌ఈగా పనిచేసిన కరుణాకర్ చెప్పారు. మరమ్మతులు చేయాలని నిర్మాణ సంస్థలకు లే ఖలు రాశామన్నారు. బరాజ్‌ల నిర్మాణం తర్వా త రెండేళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అమల్లో ఉంటుందని, మూడేళ్ల పాటు నిర్వహణను ఆ సంస్థలే చూడాల్సి ఉంటుందన్నారు.
⇒ బరాజ్‌లు డ్యామేజీకి కారణం ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, మోడల్ స్టడీస్‌లో బరాజ్‌లకు వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయారని, ప్రతీ సెకనుకు 4.35 మీటర్ల వేగంతో వరద వ స్తుందని అంచనా వేయగా, 12–14 మీటర్ల వేగంతో వచి్చందని చెన్నూరు ఈఈ–2 బి.విష్ణుప్రసాద్ బదులిచ్చారు. బరాజ్‌లలో సీపేజీని గుర్తించి 2019 డిసెంబర్ 16న సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు లేఖ రాయగా, 2020 డిసెంబర్ 22న ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం కోసం అయ్యే అంచనాలను అందించారని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment