నెల్లూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివార్లలోని అయ్యప్ప గుడి సెంటర్‌లోని పలు దుకాణాలలో చోరీలకు ప్రయత్నం చేశారు. జాతీయ రహదారికి సమీపంలోని శ్రీచింతాళమ్మ వైన్స్ పై వీరి కన్ను పడింది. జనావాసాలకు దూరంగా ఉండటంతో.. అక్కడ చోరీకి ప్రయత్నం చేశారు. దుకాణ ఆవరణలోకి ప్రవేశించిన తరువాత అక్కడే నిద్రిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి అలికిడికి లేచాడు...ఎవరని ప్రశ్నించేలోగానే కర్రలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
అనంతరం వాచ్ మెన్ చంద్రయ్య గదిలోకి వెళ్లి ఆయనపై దాడి చేశారు. దుకాణంలో నగదు దొరకకపోవడంతో...మద్యం బాటిళ్లను పట్టుకెళ్లారు. ఈ సంఘటన కలకలం రేపింది. అయిదో నగర పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దోపిడీ దొంగలు వీర విహారం చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. పోలీస్ పెట్రోలింగ్ ఏ విధంగా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని స్థానికులు అంటున్నారు. నేర స్థలిని పరిశీలిస్తే...ఉత్తరాది వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం, ఒకరి మృతి
Published Mon, Dec 1 2014 9:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement