కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి.. | Stepfather raped the child | Sakshi
Sakshi News home page

కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి..

Published Fri, Dec 5 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి.. - Sakshi

కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి..

కటకటాలపాలైన కామాంధుడు

బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రి అరెస్టు
సహకరించిన తల్లికి రిమాండ్‌


 మేడ్చల్: బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రిని, సహకరించిన బాధితురాలి తల్లిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కింది బస్తీలో శశికళ(60) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. హోటల్‌లో పనిచేసే చంద్ర(35), ఆమె వివాహం చేసుకున్నారు. శశికళకు వయసు పైబడడంతో చంద్ర కన్ను ఆమె పెద్ద కూతురి(14)పై పడింది. బాలికపై అతడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది.

ఇటీవల చంద్ర శశికళ చిన్న కూతురి(11)పై కూడా అత్యాచారం చేయబోయాడు. ఈవిషయం ఈ నెల 1న వెలుగుచూసింది. ఈమేరకు పోలీసులు చంద్రపై కేసు నమోదు చేశారు. చంద్రకు శశికళ కూడా సహకరించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి నిందితులిద్దరిని రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement