sashikala
-
దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి
-
దూకుడు పెంచిన శశికళ.. ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్!
నేతల కిరికిరీ కోట దాటింది.. తకరారు తారస్థాయిని తాకుతోంది.. చివరికి నాయకుల పంచాయితీ పరిధి దాటిపోతోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే.. ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోంది..! బలం కోసం.. బలగం కోసం అగ్రనేతలైన పన్నీరు, పళని స్వామి అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటూ.. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటూ శశికళ, దినకరన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బల ప్రదర్శనకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది..! సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు పార్టీపై పట్టే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. మదురై వేదికగా పన్నీరు సెల్వం బలప్రదర్శన నిర్వహించారు. చెన్నైలో తిష్ట వేసిన పళని శిబిరం పన్నీరుకు వ్యతిరేకంగా వ్యూహరచనలో నిమగ్నమైంది. మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ పురట్చి పయనం పేరిట తిరుత్తణి వైపుగా కదిలారు. ఇక, ఈమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎవరికి వారే.. గత రెండు వారాలుగా అన్నాడీఎంకేలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, చోటు చేసుకుంటున్న మలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక, ఆదివారం ఎవరికి వారు పారీ్టపై పట్టుకు తమ దైన శైలిలో దూసుకెళ్లారు. జూలై 11న జరిగే సర్వ సభ్య సమావేశంతో పార్టీని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సమావేశాన్ని నిర్వహించి తీరాలనే సంకల్పంతో ఆదివారం చెన్నైలో సుదీర్ఘ కార్యచరణలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ సమావేశానికి ముందే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా ఉన్న పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారుల జాబితా సిద్ధం చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా అన్నాడీఎంకేకు చెందిన ‘నమదు అమ్మ’ దిన పత్రికలో పబ్లీషర్స్ స్థానంలో పన్నీరు సెల్వం పేరును ఆదివారం తొలగించడం గమనార్హం. తగ్గేదేలే అంటున్న పన్నీరు.. ఢిల్లీ నుంచి ఆదివారం మదురైకు చేరుకున్న పన్నీరు సెల్వం బల ప్రదర్శనకు దిగారు. ఆయన మద్దతు దారులు వేలాదిగా విమానాశ్రయానికి చేరుకుని బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన బలాన్ని చాటే విధంగా కేడర్ తన వెంటే ఉంది అంటూ పన్నీరు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాయకులు లేకున్నా, కార్యకర్తలు అందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సమస్యలకు కారుకులెవ్వరో కేడర్ గుర్తించారని పేర్కొన్నారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత మార్గంలో పయనిస్తున్న తాను నిత్యం కేడర్‌తో కలిసి మెలిసి ఉన్నానని, వారే ఇప్పుడు తనకు బలం అని ధీమా వ్యక్తం చేశారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించిన ఆయన ప్రత్యేక వాహనంలో మద్దతు దారులతో కలిసి ముందుకు దూసుకెళ్లారు. అలాగే, మదురై వేదికగా మద్దతు దారులతో సమావేశం అయ్యారు. అనంతరం తేని వైపుగా పన్నీరు సెల్వం బల ప్రదర్శన సాగింది. ఇక, ఈనెల 28వ తేదీన రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక ప్రకటన చేయడానికి పన్నీరు సిద్ధం అవుతోన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా పన్నీరు మద్దతుదారుడైన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మరోమారు సర్వసభ్య సమావేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. జులై 11న జరగనున్న సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చిన్నమ్మ ‘పురట్చి’ పయనం అన్నాడీఎంకేను తన గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఇక, రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచనున్నారు. ఆదివారం చెన్నై టీ నగర్‌లోని నివాసం నుంచి తమిళ హక్కులు, మహిళా సాధికారత నినాదంతో పురట్చి పయనానికి చిన్నమ్మ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక వాహనంలో కోయంబేడు, పూందమల్లి, తిరువళ్లూరు, తిరుత్తణి, కోర మంగళం, కేజీ కండ్రిగ, ఆర్కే పేట, అమ్మయార్ కుప్పం వరకు చిన్నమ్మ పయనం సాగింది. అమ్మయార్ కుప్పం బహిరంగ సభ వేదిక వద్దకు చిన్నమ్మ చేరుకున్నారు. ఇక, చిన్నమ్మ ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం వ్యూహాలకు పదును పెట్టే విధంగా ముఖ్య నేతలతో సమావేశంలో మునిగారు. చిన్నమ్మ తీసుకునే నిర్ణయాలు, ఆమె వేసే అడుగులకు బలాన్ని చేకూర్చే విధంగా తిరువళ్లూరు జిల్లా అయపాక్కం వేదికగా ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో సమాలోచించడం గమనార్హం. అన్నాడీఎంకే ఆత్మగౌరవాన్ని కాపాడుతా: శశికళ తిరువళ్లూరు: అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిస్టంభన తొలగించి పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని శశికళ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం తిరువళ్లూరు జిల్లాకు ఆమె వచ్చారు. ఈ మేరకు పూందమల్లి, నేమం, తిరువళ్లూరు, పాండూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పూందమల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడీఎంకేలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుతా, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నరసింహన్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రామ్, పార్టీ నేతలు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేనే ప్రధాన కార్యదర్శి.. తిరుత్తణి: కేజీ కండ్రికలో చిన్నమ్మ శశికళ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శి తానే అని స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం పన్నీరు, పళని స్వామికి లేదు అని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అధికారం క్షేత్రస్థాయిలోనే కార్యకర్తలకు మాత్రమే ఉందని వివరించారు. జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకుల్ని అడ్డం పెడ్డుకుని పళని స్వామి ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకు అవకాశం లేదన్నారు. పన్నీరు సెల్వంతో చేతులు కలుపుతారా..? అని ప్రశ్నించగా, వేచి ఉండండీ..! అన్నాడీఎంకేకు మంచి రోజులు రాబోతున్నాయని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు -
Tamil Nadu: దినకరన్‌కు చిన్నమ్మ చెక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారు. బంధువుల నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉండిన జయలలిత మృతి తరువాత శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారి తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణం సమయంలో సీఎంగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేందుకు గవర్నర్ ఆమోదం పొందేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తనకు బదులు ఎడపాడి పళనిస్వామిని సీఎంగా చేసి పార్టీ బాధ్యతలు టీటీవీ దినకరన్‌కు అప్పగించారు. అయితే పార్టీని వీడిన పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకమై దినకరన్, శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతో అగ్గిరాసుకుంది. 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్ తనవైపునకు తిప్పుకున్నారు. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్ ఏఎంఎంకేను స్థాపించగా వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయవద్దు, ఉప ఎన్నికల్లో మాత్రమే పోటీచేయండని జైలు నుంచి శశికళ ఆదేశించారు. అయితే ఆమె ఆదేశాలను ధిక్కరించి తమిళనాడు, పాండిచ్చేరీల్లో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి మొత్తం 40 స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఘోరపరాజయం పొందారు. తన మాట పెడచెవిన పెట్టిన ఫలితంగా అవమానాలపాలు కావాల్సి వచ్చిందని దినకరన్‌పై శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అవే దుష్పలితాలు పునరావృతం కావడంతో ఏఎంఎంకే శ్రేణులు పార్టీని వీడి అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చేరడం ప్రారంభించారు. ముఖ్యనేతలంతా తమదారి చూసుకోవడంతో ఏఎంఎంకే గుడారం ఖాళీ అయ్యేదశకు చేరుకుంది. దినకరన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీ పతనం దిశగా పయనిస్తోందని కొందరు నేతలు శశికళకు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింతగా మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికికే ముప్పువాటిల్లగలదని ఆందోళన చెందిన శశికళ ఇటీవల దినకరన్‌తో ఫోన్ ద్వారా సంభాషించినట్లు సమాచారం. “పార్టీని నేను చూసుకుంటాను, కొంతకాలం బాధ్యతల నుంచి తప్పుకో’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక పార్టీ కార్యకలాపాలకు అన్న కుమారుడు, భర్త సోదరుడిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో దినకరన్ రాజకీయ ప్రకటనలు చేయడం, చెన్నై రాయపేటలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయానికి రావడం మానివేశారు. పార్టీ శ్రేణులను కలుసుకోవడం కూడా మానేశారు. -
శశికళపై మరో కేసు నమోదు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..దీంతో ఆమె పైన పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగంను బెదిరించిన ఆరోపణలపై శశికళ తో పాటు 501 మంది మద్దతుదారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ అన్నారు. చదవండి: ‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’ -
శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళతో ఫోన్లో మాట్లాడారని అన్నాడీఎంకే నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ ఇటీవల మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్‌లో ఉంటున్నారు. అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్ రాజాతో శశికళ ఇటీవల మాట్లాడారు. ఈ ఆడియా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాగా విన్సెంట్ రాజాకు పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్ మిక్సింగ్ కంపెనీ ఉంది. ఇక్కడి సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి విధులకు రాలేదు. కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్ చేసి అక్కడి గదిలో విన్సెంట్ రాజా నిద్రించాడు. సోమవారం తెల్లవారుజాము 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయటకు వచ్చి చూశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కారుపై పెట్రోలు పోసి తగలబెడుతున్నారు. విన్సెంట్‌ను చూడగానే పారిపోయారు. విన్సెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
Tamil nadu: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే పోస్టర్లు
టీ.నగర్: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున వెలసిన పోస్టర్లు పార్టీ వర్గాల్లో సంచలనం కలిగించాయి. చెన్నై ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై ప్రాంతంలో వీటిని అతికించారు. ఎన్నిక లు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్షనేత పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఓపీఎస్ తరఫున ఒక వర్గం, ఎడపాడి పళనిసామి ఆధ్వర్యంలో ఓ వర్గం తలపడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎడపాడి పళనిసామి కారును ఓపీఎస్ వర్గం అటకాయించి నినాదాలు చేసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశంలోను నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంలో శశికళ తెరవెనుక నుంచి ఓపీఎస్‌కు మార్గదర్శకం చేస్తున్నట్లు వార్తలు వెలువడడంతో సంచలనం ఏర్పడింది. ఇలావుండగా చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. అలాగే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకేలో ఇంకా ప్రతిపక్షనేత ఖరారు కాని స్థితిలో ఇలా పోస్టర్లు వెలియడం పార్టీ వర్గాలలో కలకలం రేపింది. చదవండి: విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ..! -
పన్నీరు వస్తే.. ఆహ్వానానికి రెడీ
సాక్షి, చెన్నై: విశ్రాంతిలో ఉన్న శశికళ ఇక, రాజకీయ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24న జయలలిత జయంతి రోజున ముఖ్యులతో భేటీ, ఆలయ దర్శనానికి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. జైలు నుంచి టీనగర్ ఇంటికి చేరిన శశికళ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. వారం రోజులు చిన్నమ్మ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 22న జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు శశికళ నిర్ణయించారు. వైద్యులతో సంప్రదించినానంతరం కేడర్‌లోకి చొచ్చుకెళ్లే రీతిలో కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచ వచ్చన్న చర్చ జోరందుకుంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు తగ్గ ఏర్పాట్లలో శశికళ ఉన్నట్టు సమాచారం. పన్నీరు వస్తే ఆహ్వానం.. సీఎం కుర్చీలో తనను కూర్చోబెట్టడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటో అన్న విషయం గురించి పన్నీరుకు బాగానే తెలుసునని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ ఆయన భరతుడు అయితే, చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉంటే, ఆహ్వానించేందుకు తామూ రెడీ అని ప్రకటించారు. ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని, ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. జయంతి సభలు.. ఈనెల 24న జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలో పరుగులు తీయనున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రజాకర్షణ దిశగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్లో జరిగే సభలో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పాల్గొననున్నారు. -
ఇంటి కంటే జైలు ‘పది’లం
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తయినా సుధాకరన్ ఇంకా జైల్లోనే ఎందుకున్నారు ? రూ.10 కోట్ల జరిమానా ఖర్చు ఎందుకు, మరో ఏడాది జైల్లోనే ఉంటే పోలా..అని నిర్ణయించుకున్నారా అని రాజకీయవర్గాలు చలోక్తులు విసురుతున్నాయి. ఈ కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల శిక్ష, చెరో రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ ముగ్గురూ 2017 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభిస్తూ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. సుధాకరన్ 1996 నుంచి 2017 వరకు 92 రోజులు జైల్లో ఉన్నారు. ఆ రోజులను శిక్షాలంలో కలుపుకున్న కోర్టు గత ఏడాది డిసెంబర్ 17వ తేదీనే విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. సుధాకరన్ రూ.10 కోట్ల జరిమానా చెల్లించలేదు. చెల్లించి ఉంటే 2 నెలల క్రితమే సుధాకరన్‌కు జైలు నుంచి విముక్తి లభించేది. చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇదే కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తిచేసుకున్న శశికళ గత నెల 27న, ఇళవరసి ఈనెల 5న జైలు నుంచి విడుదలయ్యారు. రూ.10 కోట్ల జరిమానాను మిగుల్చుకునేందుకే సుధాకరన్ అదనంగా ఏడాది జైలు శిక్షకు సిద్ధమైనట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఓ వైపు ఆహ్వాన ఏర్పాట్లు, మరో వైపు టెన్షన్
సాక్షి, చెన్నై: చిన్నమ్మను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలు ఆ శిబిరంలో ఉత్కంఠను రేపాయి. జైలులో చిన్నమ్మ జ్వరంతో బాధపడుతున్నట్టు, ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సమాచారంతో ఆ శిబిరంలో కలవరం బయలుదేరింది. జైలు నుంచి శశికళ బయటకు వచ్చినా, అన్నాడీఎంకేకు ఢోకా లేదని, అమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షా కాలం ముగియడంతో ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఆహా్వనం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగాయి. హొసూరు నుంచి చెన్నైకి కాన్వాయ్ రూపంలో ర్యాలీకి నిర్ణయించారు. శశికళ కోసం పోయెస్‌గార్డెన్‌లో రూపుదిద్దుకుంటున్న భవనం ఐటీ వివాదంలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. టీనగర్‌లోని చిన్నమ్మ వదినమ్మ ఇలవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో తాత్కాలికంగా చిన్నమ్మకు బస ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం చిన్నమ్మ జ్వరం బారినపడ్డ సమాచారంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్ని కలవరంలో పడేసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నమ్మను బెంగళూరులోని శివాజీ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చిన సమాచారం ఉత్కంఠలో పడేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు , స్వల్ప శ్వాస సమస్య తలెత్తినట్టుగా జైళ్ల శాఖ వర్గాలు పేర్కొనడం కాస్త ఊరట. -
శశికళ గర్భవతి కాదు
సాక్షి, చిత్తూరు : తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేపిన శశికళ గర్భవతి వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. ఆమె అసలు గర్భం దాల్చలేదని విచారణలో తేలింది. తాను శనివారం బిడ్డకు జన్మనిచ్చానని, శిశువుని వైద్యులు మాయం చేశారంటూ తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శశికళకు ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన రిపోర్టులో ఆమె గర్భవతి కాదని తేలింది. చదవండి: గర్భంలోని శిశువును మాయం.. మహిళ ఆందోళన -
చిన్నమ్మ రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆమె చెల్లించాల్సిన రూ.10 కోట్ల పది లక్షల జరిమానాను కోర్టుకు చెల్లించారు. రశీదులను పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ న్యాయవాదులు పంపించినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో శశికళ విడుదల కాబోతున్నట్టు విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె విడుదల అవుతారన్న సమాచారంతో అన్నాడీఎంకేలో చర్చ తప్పలేదు. అదే సమయంలో చిన్నమ్మ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు సైతం సాగుతున్నట్టుగా చర్చ జోరందుకుంది. అదేసమయంలో ఆమె తరఫు న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ అయితే, చిన్నమ్మ విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ముందుగానే ఆమె జైలు నుంచి బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చదవండి: రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ జరిమానా చెల్లింపు.. ఆదివారం బెంగళూరుకు వెళ్లిన రాజా చెందూర్ పాండియన్ చిన్నమ్మకు కోర్టు విధించిన జరిమానా చెల్లింపు పనిలో పడ్డారు. బెంగళూరులోని న్యాయ వాది ముత్తుకుమార్తో కలిసి రూ.10 కోట్ల 10 లక్షలను మంగళవారం సంబంధిత కోర్టులో చెల్లించారు. డీడీ రూపంలో న్యాయమూర్తి అందుకున్నారు. రశీదు బుధవారం ఉదయాన్నే ఆ కోర్టు నుంచి చిన్నమ్మ న్యాయవాదులు అందుకున్నట్టు తెలిసింది. శశికళ విడుదల విషయంగా తమ తరఫు లేఖను పరప్పన అగ్రహారచెరకు పంపించినట్టు తెలిసింది. రాజాచెందూర్ పాండియన్‌ను ప్రశ్నించగా, అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యేందుకు సైతం అవకాశాలు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అనుభవించిన జైలు జీవితం మేరకు ఆమె ముందుగానే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువేనని ధీమా వ్యక్తం చేశారు. శశికళ విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరి ణామాలు చోటుచేసుకునే ప్రసక్తే లేదని కోవైలో మీడియాతో సీఎం ఎడపాడి మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. -
శశికళ ముందస్తు విడుదల లేదు
కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లు శశికళ ముందుగానే విడుదల కాబోరని తేలిపోయింది. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న తరువాతనే వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విముక్తి లభిస్తుందని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది. సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా రుజువైంది. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది నాలుగేళ్లు పూర్తయి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది ఆఖరులో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో శశికళ విడుదలపై బెంగళూరుకు చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. చదవండి: (రియాకు రిమాండ్ పొడిగింపు) వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ విడుదలయ్యే అవకాశం ఉందని జైళ్లశాఖ అతడికి బదులిచ్చింది. శశికళకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో విడుదలవుతారని ఆమె అనుచరులు ఇంకా ఆశాభావం వ్యక్తంచేస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు çసమీపిస్తున్న తరుణంలో శశికళ ముందస్తు విడుదల ఈ విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మరో సమాచారం బయటకు వచ్చింది. చదవండి: (తెరపైకి దియా, నమ్రత!) ఈ పరిస్థితిలో సామాజిక కార్యకర్త టీ నరశింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద జైళ్లశాఖపై మరో ఉత్తరాన్ని సంధించారు. ఖైదీలకు ఇచ్చే సెలవు దినాలు, ఇలాంటి సెలవులు ఏఏ కేటగిరి ఖైదీలకు వర్తిస్తాయి, ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు వర్తిస్తుందా అని అందులో ప్రశ్నించారు. ఇందుకు జైళ్లశాఖ బధులిస్తూ...జీవితాంతం జైలుశిక్ష పడిన ఖైదీలకు మాత్రమే సెలవు దినాలు వర్తిస్తాయని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష అనుభవించేవారికి వర్తించదని స్పష్టం చేసింది. చిన్నమ్మ కోసం సైకిల్ యాత్ర నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలో మాంగుటైపాళయంకు చెందిన వడివేల్ (50) అనే వ్యక్తి అమ్మమక ఎంజీఆర్ మన్రం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకెళ్లి శశికళను కలుసుకునేందుకు ఈనెల 18న సైకిల్ యాత్రను ప్రారంభించాడు. రోజుకు 45 కి.మీ పయనిస్తూ సోమవారం రాత్రి హోసూరుకు చేరుకున్నాడు. శశికళతో ములాఖత్ కోసం జైలు అధికారులకు వినతపత్రం ఇస్తానని.. అనుమతి లభించిన పక్షంలో..‘మీరు వస్తేనే పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడగలరు, ప్రజలు మీకోసం ఎదురుచూస్తున్నారు’ అని చెబుతానని మీడియాతో అన్నారు. -
వీడియో కాన్ఫరెన్స్‌కు ఓకే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశీ మారకద్రవ్యం మోసం కేసులో శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాల్సిందిగా మద్రాసు హైకోర్టు గురువారం ఆదేశించింది. చార్జిషీటు పత్రాలను బెంగళూరు జైలుకు పంపి శశికళ సంతకాలను తీసుకోవాల్సిందిగా సూచిం చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, అమె అక్క కుమారుడు భాస్కరన్ 1996, 1997 సంవత్సరాల్లో జేజే టీవీ కోసం విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల మోసం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అలాగే కొడనాడు టీ ఎస్టేట్ కొనుగోలులో అనేక కోట్లరూపాయలు విదేశీ మారకద్రవ్యం లావాదేవీలు అక్రమంగా సాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జేజే టీవీ అక్రమాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు శశికళపై మూడు కేసులు, కొడనాడు టీ ఎస్టేట్ కొనుగోలులో విదేశీ మారకద్రవ్యం మోసంపై మరో కేసు పెట్టారు. చెన్నై ఎగ్మూరులోని ఆర్థికనేరాల కోర్టులో ఈ కేసులపై అనేక ఏళ్లుగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ కేసులో ప్ర«ధాన నిందితుడైన భాస్కరన్‌పై 2017 జూలైలో చార్జిషీటు దాఖలు చేశారు. అలాగే బెంగళూరు జైలు అధికారుల అనుమతిలో శశికళతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చార్జిషీటు పెట్టారు. అయితే చార్జిషీటు దాఖలు తరువాత శశికళ తరఫున ఎవ్వరూ కోర్టుకు హాజరుకావడం లేదని, చార్జిషీటులో శశికళ సంతకం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జనవరిలో శశికళతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ సమయంలో శశికళ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఇంటెలిజెన్స్ అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కోరారు. శశికళ కోర్కె మేరకు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ముగిసింది. కాగా, క్రాస్ ఎగ్జామిన్ కోరినందుకు శశికళను ఈనెల 13నహాజరుపరచాలని బెంగళూరు జైలు అధికారులను చెన్నైలోని ఆర్థికనేరాల కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో శశికళ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య కారణాల వల్ల మద్రాసు కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు బదులివ్వలేనని కోరుతూ సదరు ఆదేశాలపై స్టే విధించాలని శశికళ తన పిటిషన్లో పేర్కొన్నారు. చార్జిషీటు ఎలా దాఖలు చేశారో విచారణను కూడా అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శశికళ పిటిషన్ న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. ఇంటెలిజెన్స్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, శశికళతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చార్జిషీటుపై సంతకాల కోసమే ఆమెను నేరుగా హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ, శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి, చార్జిషీట్ పత్రాలను బెంగళూరు జైలుకు పంపి ఆమె సంతకాలు తీసుకోండని ఆదేశించారు. -
శశికళ సోదరుడి సొంత పార్టీ.. ‘ఏడీకే’
మన్నార్గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. -
అక్క చెప్పినట్టే అన్నీ ఆచరించా: శశికళ
దివంగత నటుడు, పత్రికా సంపాదకులు చో రామస్వామి కారణంగా తాను పోయెస్ గార్డెన్‌కు దూరంగా కొంత కాలం గడపాల్సి వచ్చిందని ప్రమాణ పత్రంలో చిన్నమ్మ శశికళ వివరించారు. అక్క జయలలిత చెప్పినట్టే నడుచుకున్నానని, తానెప్పుడూ ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. విచారణ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రంలోని కొన్ని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ విచారణకు శశికళ స్వయంగా రాలేని పరిస్థితి. ఆమె పరప్పన అగ్రహార చెరలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడమే ఇందుకు కారణం. తన న్యాయమూర్తి రాజ చెందూర్ పాండియన్ ద్వారా వాంగ్మూలాన్ని ప్రమాణ పత్రం రూపంలో ఆమె కమిషన్‌కు సమర్పించి ఉన్నారు. ఆమె నివేదించిన అంశాలు ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రుల్లో గుబులు రేకెత్తించాయి. జయలలితకు జ్వరం వచ్చిన రోజు నుంచి ఆస్పత్రిలో సాగిన చికిత్స, మరణం వరకు శశికళ ప్రమాణ పత్రంలో వివరించారు. అలాగే, ఎవరెవరు జయలలితను పరామర్శించారో తదితర వివరాలను కమిషన్ ముందుంచారు. ప్రస్తుతం శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ విచారణకు హాజరయ్యే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత గతంలో గెంటి వేయడానికి గల కారణాలు సైతం ప్రమాణ పత్రంలో పొందుపరిచి ఉండడం వెలుగులోకి వచ్చింది. 2011లో ప్రకంపనలు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జయలలిత సీఎం పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో పోయెస్ గార్డెన్లో ప్రకంపన బయలు దేరింది. శశికళను గార్డెన్ నుంచి బయటకు సాగనంపడమే కాదు, ఆమె కుటుంబీకుల మీద కేసుల మోత మోగడం అప్పట్లో చర్చకు దారి తీసింది. జయలలితకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం వ్యవహరించడంతోనే ఈ గెంటివేత అన్న చర్చ సాగింది. కొన్నాళ్లకు మళ్లీ శశికళ గార్డెన్ మెట్లు ఎక్కడం ట్విస్టుగా మారింది. అయితే, ఈ తతంగం వెనుక కారణాలేమిటో అనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి సమాధానం ఇచ్చే రీతిలో శశికళ తన ప్రమాణ పత్రంలో పేర్కొని ఉండడం గమనార్హం. 2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, ఓ రోజున అక్క జయలలిత తనను పిలిచి ఇక్కడ ఉండొద్దు.. టీ నగర్‌లోని ఇంటికి వెళ్లి పో.. అని సూచించారని తెలిపారు. అక్క ఆజ్ఞను శిరసా వహించి గార్డెన్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఈ హఠాత్ నిర్ణయంతో తొలుత తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అక్క భరోసా ఇచ్చి మరీ పంపినట్టు పేర్కొన్నారు. తాను గార్డెన్ నుంచి బయటకు రావడంలో తుగ్లక్ పత్రిక సంపాదకులుగా ఉన్న నటుడు చో రామస్వామి కీలక భూమిక పోషించినట్టు వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే సమాచారం ఆ సమయంలో జయలలితను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసిన చో రామస్వామి అన్ని వివరాలను అక్క దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. దానిపై రహస్య విచారణ సైతం సాగినట్టు పేర్కొన్నారు. . అక్క చెప్పినట్టే.. ఆ సమయంలో అక్క(జయలలిత) చెప్పినట్టే తాను విన్నానని పేర్కొన్నారు. తన కుటుంబీకులందరినీ సాగనంపిన అనంతరం ఓ రోజున అక్కే తనకు సమాచారం పంపించారని పేర్కొన్నారు. ‘నీ మీద ఏ తప్పు లేదు.. ఇక, వచ్చేయి..’ అని అక్క పిలవడంతో గార్డెన్‌లోకి మళ్లీ వచ్చానన్నారు. ఈ సమయంలో చో రామస్వామి మరో ఆలోచన ఇచ్చారన్నారు. ఆయన ఆలోచన మేరకు తాను జయలలితకు ఓ లేఖను రాశానని తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, రాజకీయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోను, నా కుటుంబంతో సంబంధాలు కల్గి ఉండను.. నీ (జయలలిత)సంక్షేమమే ముఖ్యం’ అని ఆ లేఖలో వివరించి గార్డెన్లో చేరినట్టు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అన్నాడీఎంకే వ్యవహారాల్లో గానీ, అధికార విషయాల్లో గానీ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం అక్కకు తెలుసు అని తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో అక్క ఆజ్ఞ మేరకు అనేక వివరాలను , ఇచ్చే సూచనల్ని, ఆదేశాలను ద్వితీయ శ్రేణి నేతల దృష్టికి తాను తీసుకెళ్లాని తెలిపారు. ఆ పయనం సాగిస్తూ ఉన్న సమయంలో సెప్టెంబరు 19న జయలలిత జ్వరం బారిన పడటం, ఆ తదుపరి వివరాలను ఆమె ప్రమాణ పత్రంలో వివరించి ఉండడం గమనార్హం. -
మౌనంలో చిన్నమ్మ
గుట్కా అక్రమ అమ్మకాల గుట్టును రట్టు చేసేందుకు ఐటీ అధికారులు తహతహలాడుతుండగా, శశికళ మౌనవ్రతం విచారణకు అడ్డంకిగా మారింది. వచ్చేనెల 10వ తేదీ తరువాత విచారణకు సిద్ధమని చిన్నమ్మ చెప్పడంతో బెంగళూరు జైలుకు చెన్నై ఐటీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు జైలుశిక్షను అనుభవిస్తున్న సంగతి పాఠకులకు విధితమే. ఇదిలా ఉండగా శశికళ బంధువులు బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది నవంబర్‌లో బంధువులు, మిత్రుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి పైగా అధికారులు ఏకకాలంలో 187 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో..సుమారు 50కి పైగా బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లుగా రుజువుచేసే అనేక డాక్యుమెంట్లు అధికారులకు దొరికినట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్ల పరిశీలనలో రూ.1,430 కోట్ల పన్ను ఎగవేసినట్లు లెక్కకట్టారు. ఇంత పెద్ద ఎత్తున బోగస్ కంపెనీల నిర్వహణ వెనుక శశికళ హస్తం ఉందని అనుమానించిన ఐటీ అధికారులు తనిఖీలు పూర్తికాగానే ఆమె బంధువులకు సమన్లు పంపి వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, బోగస్ కంపెనీల్లో శశికళ పేరు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేసిన బంధుమిత్రుల జాబితాలో శశికళ పేరును చేర్చినట్లు సమాచారం. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ఒక పెన్‌డ్రైవ్, కంప్యూటర్లలోని సమాచారం, డిస్కులను, గుట్కా వ్యవహారంలో ఐటీశాఖ ప్రభుత్వానికి అందజేసిన ఉత్తరం దొరికాయి. ఐటీ శాఖ ఉత్తరం శశికళ గదిలోకి ఎలా చేరిందనేది అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వీటన్నింటినీ శశికళకు నేరుగా చూసి సమాచారం సేకరించాలని, స్వయంగా విచారిస్తేగానీ ఇంకా అనేక నిజాలు వెలుగుచూడవని భావిస్తున్నారు. అయితే ఆమె పొరుగురాష్ట్రంలో జైలు ఖైదీగా ఉండడం అధికారులను ఆలోచనలో పడేసింది. విచారణ కోసం చెన్నైకి పిలిపించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని కొందరు సూచించడంతో తామే బెంగళూరుకు జైలుకు వెళ్లడం ఉత్తమమని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు ఇటీవల ఉత్తరం కూడా రాశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి శశికళ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. చిన్నమ్మ మౌనవ్రతం వల్ల విచారణలో జాప్యం నెలకొనే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని ఐటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల అభ్యంతరాన్ని తెలుసుకున్న శశికళ...విచారణకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐటీ దాడులు, గుట్కా వ్యవహారంలో శశికళను నేరుగా విచారించక తప్పని పరిస్థితులు నెలకొన్న విషయాని ఉత్తరం ద్వారా ఆమెకు తెలిపామని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విచారణకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. విచారణ తేదీ ఖరారుకాగానే చెన్నై నుంచి అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లి ఒక ప్రత్యేక గదిలో శశికళను విచారిస్తామని అన్నారు. ఈ విచారణ ఒక్కరోజులో ముగియకపోవచ్చని చెప్పారు. శశికళను విచారించిన తరువాత ఈ వ్యవహారంలో తరువాత అడుగు పడుతుందని వివరించారు. -
చిక్కుల్లో అన్నాడీఎంకే కార్యదర్శి శశికళ
-
శశికళను ఎందుకు సీఎం చేయలేదు?
చెన్నై: నగరంలోని రాజాజీ హాల్లో మంగళవారం ప్రజల సందర్శణార్థం ఉంచిన జయలలిత భౌతికదేహం పక్కన ఆమె ఆప్తురాలు శశికళా నటరాజన్ నల్లటి చీరను ధరించి వైరాగ్యంతో నిలబడి ఉన్నారు. చివరి రోజుల్లో కూడా జయ వెన్నంటి ఉన్న ఆమెకు ప్రజల రోదనలుగానీ, సందడిగానీ మరేమి వినిపిస్తున్నట్లు లేదు. ఆమె అలా శూన్యంలోకి చూస్తున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే 1987 నాటి సీన్ పునరావృతం అవుతుందా? అనిపించక మానదు. 1987లో ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన తలపక్కన జయలలిత కూడా 16 గంటల పాటు కదలక, మెదలక అలా మ్రాన్పడి కూర్చుండిపోయారు. వ్యతిరేకులు తిట్టినా, హింసించినా పట్టించుకోలేదు. ఆ దృశ్యమే ఎందరినో కదిలించి ఆమెను ఎంజీఆర్‌కు వారసురాలిని చేసింది. జయలలిత వారసురాలవుతుందనుకున్న శశికళ మరి ఎందుకు కాలేకపోయారు? అన్నా దురై, ఎంజీఆర్‌లు చనిపోయినప్పుడు తొందరపడి సీఎంను ఎంపిక చేసుకోలేదు. మరి నిన్న రాత్రికి రాత్రి పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఆగమేఘాల మీద ఎందుకు జరిగిపోయింది? [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట బీజేపీ తలదూర్చి ఎదుగుతోందని, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తలదూర్చేందుకు అవకాశం కోసం కాచుకుకూర్చోందని, ఆ అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతోనే ఈసారి పన్నీర్‌సెల్వం ప్రభుత్వాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శశికళ పేరును పరిశీలించలేదా? అన్న ప్రశ్నకు ఆమెకు పార్టీలో ముఖ్యమైన పదవి ఇవ్వాలనే విషయంలోనే ఆమె పేరు ప్రస్థావనకు వచ్చిందని, ముఖ్యమంత్రి పదవికి కాదని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మంత్రి తెలిపారు. ఆమెపై అవినీతి కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఆమె ముఖ్యమంత్రి లేదా మంత్రిపదవి చేపట్టేందుకు వీలు లేదని ఆయన చెప్పారు. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన వారు, వారు విడుదలైన రోజు నుంచి ఆరేళ్లపాటు ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్8(3) ప్రకారం పదవులు చేపట్టరాదు. జయలలితపై 20 ఏళ్ల క్రితం దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సాంకేతికంగా ఇప్పటికీ జీవించే ఉంది. ఈ కేసులో జయలలిత, ఆమె ఆప్తురాలు శశికళ, దత్త పుత్రుడు సుధాకరన్‌లకు బెంగుళూరు స్పెషల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు వందకోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొంతకాలం జైలు శిక్ష అనుభవించాక, ట్రయల్ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో జయలలిత తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం, శశికళ, సుధాకరన్‌లు కూడా జైలు నుంచి విడుదలవడం తెల్సిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడంతో అవినీతి కేసుకు మళ్లీ జీవం వచ్చింది. దానిపై సుప్రీం కోర్టు తన తీర్పును వాయిదా వేసింది. అవినీతి కేసులో ప్రధాన నిందితురాలు మరణించినప్పుడు సహ నిందితులపై కేసు నడుస్తుందా? వారికి శిక్ష పడుతుందా? అంటూ సోషల్ మీడియాలో పలువురు యూజర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే కేసు నిలబడదు. ఇలాంటి కేసులోనే ముంబై, ఢిల్లీ హైకోర్టులు పరస్పర భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో 2014లో జితేంద్ర కుమార్ సింగ్ అనే అధికారిపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అవినీతి నిరోధక చట్టం ప్రధాన లక్ష్యం లంచం తీసుకున్న ప్రభుత్వాధికారిని శిక్షించడమని, ప్రధాన నిందితుడే చనిపోయినప్పుడు చట్టం లక్ష్యం నెరవేరదుకనుక కేసును విచారణను కొనసాగించి లాభం లేదని తీర్పు చెప్పింది. -
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి..
కటకటాలపాలైన కామాంధుడు బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రి అరెస్టు సహకరించిన తల్లికి రిమాండ్ మేడ్చల్: బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రిని, సహకరించిన బాధితురాలి తల్లిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కింది బస్తీలో శశికళ(60) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. హోటల్లో పనిచేసే చంద్ర(35), ఆమె వివాహం చేసుకున్నారు. శశికళకు వయసు పైబడడంతో చంద్ర కన్ను ఆమె పెద్ద కూతురి(14)పై పడింది. బాలికపై అతడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. ఇటీవల చంద్ర శశికళ చిన్న కూతురి(11)పై కూడా అత్యాచారం చేయబోయాడు. ఈవిషయం ఈ నెల 1న వెలుగుచూసింది. ఈమేరకు పోలీసులు చంద్రపై కేసు నమోదు చేశారు. చంద్రకు శశికళ కూడా సహకరించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి నిందితులిద్దరిని రిమాండుకు తరలించారు. -
జంటపై ఆగంతకుల హత్యాయత్నం
కర్నూలు : కర్నూలు జిల్లా కౌతాలం మండలం మెగలినూరులో దారుణం జరిగింది. ఓ జంటపై ఆగంతకులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అమరేష్ అనే వ్యక్తి మృతి చెందగా, శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.