
సాక్షి, చిత్తూరు : తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేపిన శశికళ గర్భవతి వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. ఆమె అసలు గర్భం దాల్చలేదని విచారణలో తేలింది. తాను శనివారం బిడ్డకు జన్మనిచ్చానని, శిశువుని వైద్యులు మాయం చేశారంటూ తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శశికళకు ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన రిపోర్టులో ఆమె గర్భవతి కాదని తేలింది. చదవండి: గర్భంలోని శిశువును మాయం.. మహిళ ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment