
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తయినా సుధాకరన్ ఇంకా జైల్లోనే ఎందుకున్నారు ? రూ.10 కోట్ల జరిమానా ఖర్చు ఎందుకు, మరో ఏడాది జైల్లోనే ఉంటే పోలా..అని నిర్ణయించుకున్నారా అని రాజకీయవర్గాలు చలోక్తులు విసురుతున్నాయి. ఈ కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల శిక్ష, చెరో రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ ముగ్గురూ 2017 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభిస్తూ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. సుధాకరన్ 1996 నుంచి 2017 వరకు 92 రోజులు జైల్లో ఉన్నారు.
ఆ రోజులను శిక్షాలంలో కలుపుకున్న కోర్టు గత ఏడాది డిసెంబర్ 17వ తేదీనే విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. సుధాకరన్ రూ.10 కోట్ల జరిమానా చెల్లించలేదు. చెల్లించి ఉంటే 2 నెలల క్రితమే సుధాకరన్‌కు జైలు నుంచి విముక్తి లభించేది. చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇదే కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తిచేసుకున్న శశికళ గత నెల 27న, ఇళవరసి ఈనెల 5న జైలు నుంచి విడుదలయ్యారు. రూ.10 కోట్ల జరిమానాను మిగుల్చుకునేందుకే సుధాకరన్ అదనంగా ఏడాది జైలు శిక్షకు సిద్ధమైనట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment