ఫైల్ ఫోటో
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..దీంతో ఆమె పైన పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగంను బెదిరించిన ఆరోపణలపై శశికళ తో పాటు 501 మంది మద్దతుదారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ అన్నారు.
చదవండి: ‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’
Comments
Please login to add a commentAdd a comment