Medchal police
-
HYD: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. గంజాయితో మరో బ్యాచ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠాల గుట్టు రట్టు అయ్యింది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు పలువురు. విద్యార్థులే లక్ష్యంగా.. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మరీ కేటుగాళ్లు ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌లో డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ(Special Operation Team) బృందం దాడులు జరిపింది. ఈ తనిఖీల్లో MDMA(methylenedioxy-methylamphetamine)తో పట్టుబడ్డారు యువకులు. మొత్తం 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయి తో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బృందం. ఈ దాడులకు సంబంధించి ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసింది. మరోవైపు.. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 33,750 విలువ గల 1.35కేజీల గంజాయి సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు. వీళ్లంతా నగరంలో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మేడ్చల్: జవహార్‌నగర్ బాలిక అదృశ్యం విషాదాంతం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఏం జరిగింది? దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్ఐవీ సోకే విధంగా వైద్యం -
బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!
సాక్షి, మేడ్చల్: నిన్న జరిగిన మేడ్చల్ బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక కన్న తండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. పోలీసులకు అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండడంతో అతని తీరుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన బాలిక నిందితుడి మొదటి భార్య కూతురిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం తుఫ్రాన్‌పేట్ నుంచి కుటుంబంతో మేడ్చల్‌కు వారి కుంటుంబం వలస వచ్చినట్లు తెలిసింది. కాగా మేడ్చల్‌లోని ఓ బస్తీ సమీపంలో శనివారం గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దానికి అనుగుణంగా విచారణ చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో నలుగురు యువకులు మృతి
శామీర్‌పేట్/తొర్రూరు రూరల్ (పాలకుర్తి): తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనుకున్న నలుగురు యువకుల లక్ష్యం నెరవేరకుండానే జీవితాన్ని చాలించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు వలస వచ్చి తాము లీజుకు తీసుకున్న ఫౌల్ట్రీ ఫామ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. స్వయం ఉపాధి ద్వారా నలుగురుకీ ఊరి లో ఆదర్శంగా నిలుస్తారనుకున్న ఆ యువకుల అకాల మరణం గ్రామస్తుల్ని విషాదంలో నింపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మరాశిపేట శివారు కేజీఎల్ పౌల్ట్రీఫామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, వెంకటాపూర్‌కు చెందిన గాదగాని వెంకన్న, అరుణ దంపతుల రెండో కుమారుడు అరవింద్‌గౌడ్(23), మొగుళ్ల వెంకన్న, సోమనర్సమ్మ దంపతుల కుమారుడు శివశంకర్‌గౌడ్(21)లు శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో నెల క్రితం సుధాకర్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌ను లీజుకు తీసుకుని కోళ్ల పెంపకం చేపట్టారు. వీరికి తోడుగా ఉండేందుకు వారి స్వగ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను, సుభద్ర దంపతుల కుమారుడు మహేశ్ ముదిరాజ్(22)ను వారం రోజుల క్రితం తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. కాగా, ఈ ముగ్గురినీ కలిసేందుకు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్‌రెడ్డి(25) వెంకటాపురం నుంచి గురువారం బొమ్మరాశిపేటకు వచ్చాడు. రాత్రి సుమారు 1 గంట వరకు వీరంతా కోడిపిల్లలకు వాక్సిన్ వేశారు. అనంతరం భోజనం చేసి పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. ఉదయం 11 గంటలకు కేజీఎల్(అభ్యుదయ) కంపెనీ సూపర్వైజర్ సతీశ్ కోడిపిల్లల పరిశీలనకు పౌల్ట్రీఫామ్ దగ్గరకు వచ్చాడు. కోడిపిల్లలకు నీరు కూడా పెట్టలేదని గమనించిన సతీశ్ యువకులు నిద్రించిన గది వద్దకు వెళ్ళి వారిని పిలవగా ఎవరూ స్పందించలేదు. దీంతో సతీశ్ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మృతిచెందినట్టు కన్పించారు. వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డిలు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటే వీరి మృతికి కారణమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. నివేదిక అనంతరమే.. ఈ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపటి వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని కొందరు, కోడి పిల్లలకిచ్చే వ్యాక్సిన్ ద్రావణం ఆహారంలో కలవడం వల్లేనని, వీరంటే గిట్టని వారెవరో ఆహారంలో విషం కలిపి ఉంటారన్న మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరి మృతికి విషాహారమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. -
ఆలకించదు.. ఆశ్రయమూ ఇవ్వదు
సాక్షి, హైదరాబాద్ : పేరుకే సఖి.. దుఖితురాలి గోడు పట్టదు. అడ్డగోలు నిబంధనల సాకుతో చూపి ఆశ్రయం ఇవ్వలేమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చినవారిని ఆదరించకుండా తిప్పిపంపారు. ఇదీ ఓ విధి వంచితురాలి దీనగాధ. కామాంధుడు కాటేశాడు. పరువు సాకుతో తల్లిదండ్రులు ముఖం చాటేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గర్భం దాల్చిన బాలికను తిప్పి పంపిన సఖి అధికారులు తాజాగా మరో ఘటనలోనూ బాధితురాలికి ఆశ్రయం ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. పరువు పోయిందని భావించిన తల్లిదండ్రులు బాలికను సాకడానికి నిరాకరించారు. దీంతో ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాలికకు ఆశ్రయం కల్పించాలని పోలీసులు గురువారం రంగారెడ్డి జిల్లా ‘సఖి’కేంద్రాన్ని సంప్రదించారు. కానీ, గర్భిణిగా ఉండటంతో ఆ అమ్మాయికి వసతి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. చైర్మన్ స్పందిస్తూ రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కస్తూర్బా షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. ఆపదలో ఉన్న బాలిక లేదా మహిళను అక్కున చేర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్భయ, పొక్సో, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం లాంటి కీలకమైన చట్టాల అమలు బాధ్యత ఈ కేంద్రాలకు ఉంది. కానీ, సఖి కేంద్రాలకు వచ్చే ఎమర్జెన్సీ కేసులపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను సాకుగా చూపుతూ వెనక్కు పంపుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సఖి కేంద్రాల లక్ష్యం గాడితప్పుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భం దాల్చిన బాలిక ఇబ్బంది పడొద్దని... కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గర్భం దాల్చిన బాలికకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే స్టేట్ హోమ్‌కు తరలించాలని పోలీసులకు సూచించినట్లు రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రం నిర్వహకురాలు సుమిత్ర తెలిపారు. గర్భం దాల్చిన బాలిక గురువారం సఖి కేంద్రాన్ని ఆశ్రయించగా వెనక్కి పంపిన విషయం తెలిసింది. ఏడు నెలల గర్భిణిని వాహనంలో సఖి కేంద్రానికి, స్టేట్ హోమ్‌కు ప్రయాణం చేయించడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. స్టేట్ హోమ్‌కు పక్కనే శిశువిహార్ ఉందని, అనుకోని క్షణంలో ఆ బాలిక ప్రసవిస్తే శిశువును పక్కనున్న శిశువిహార్‌కు తరలించవచ్చన్నారు. దీంతో మాతా, శిశువును రక్షించడం సులవవుతుందనే స్టేట్‌హోమ్‌కు పంపించాలని సూచించినట్లు చెప్పారు. కానీ, ఆ బాలికను స్టేట్‌హోమ్‌కు తరలించకుండా నాచారంలోని ప్రైవేటు హోమ్‌కు తరలించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, బాలికకు ఆరోగ్య సమస్యలు, ప్రమాదం జరిగితే అందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లిఖిత పూర్వక ఆదేశాలుండాలి అత్యవసర కేసుల స్వీకరణ విషయంలో లిఖితపూర్వక ఆదేశాలు ఉండాలనే నిబంధన పెట్టాం. మౌఖిక ఆదేశాలతో కేసులు స్వీకరించొద్దని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. అప్పట్నుంచి లిఖిత పూర్వక సూచనలుండాలని సఖి కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ ఆదేశాలు సీడబ్ల్యూసీ నుంచి ఇవ్వాలి. వారు స్పందించి లేఖ ఇస్తే వెంటనే వారికి సహాయ కార్యక్రమాలు మొదలుపెడతాం. –గిరిజ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ -
చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీసర మండలం కీసర పెద్దమ్మ చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు సహా భార్యాభర్తలు చెరువులో దూకి బలవన్మరణం చెందారని మేడ్చల్ పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతులు రమేశ్, మానస, మనశ్రీ, గీతశ్రీ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడ్చల్‌లో రెండు కార్లు ఢీ
సాక్షి, మేడ్చల్: సంక్రాంతి పండుగరోజు మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కీసరం మండలం రాంపల్లి క్రాస్‌రోడ్డు దగ్గర ఆదివారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న కరీంగూడకు చెందిన ఓమ్‌ప్రకాష్‌రెడ్డి (24), అఖిలేష్‌రెడ్డి(23) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘఠన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తూనికల్లో మోసం... కేసు నమోదు
మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): ఓ మిక్సింగ్ కంపెనీకి సరఫరా చేసే సామాగ్రి బరువు ఎక్కువ చూపించి మోసం చేస్తున్న వారిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మునీరాబాద్‌లో నగరానికి చెందిన రాజశేఖర్ డాంబరు కాంక్రీట్ మిక్సింగ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి నగరానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి సూర్య ట్రాన్స్పోర్ట్ ద్వారా డాంబరును సరఫరా చేస్తున్నాడు. సోమవారం కంపెనీకి డాంబర్ లోడ్ వచ్చింది. దీంతో పూడూర్‌లోని తుల్జా భవాని కాంటాలో తూకం వేయగా 24 టన్నుల 940 కిలోలు వచ్చింది. వే బిల్లును చూసిన రాజశేఖర్‌కు అనుమానం వచ్చి వేరే కాంటాలో తూకం వేయించగా అక్కడ 22 టన్నుల 420 కిలోల బరువు వచ్చింది. దీంతో ఆయన తనను మోసం చేస్తున్న సప్లయర్ రాజేష్‌తోపాటు ట్రాన్స్పోర్ట్ వారిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బైక్ రేసింగ్ : పోలీసుల అదుపులో యువకులు
హైదరాబాద్ : మేడ్చల్‌లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ క్రమంలో యువకులకు.... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థరాత్రుళ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. -
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి..
కటకటాలపాలైన కామాంధుడు బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రి అరెస్టు సహకరించిన తల్లికి రిమాండ్ మేడ్చల్: బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రిని, సహకరించిన బాధితురాలి తల్లిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కింది బస్తీలో శశికళ(60) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. హోటల్లో పనిచేసే చంద్ర(35), ఆమె వివాహం చేసుకున్నారు. శశికళకు వయసు పైబడడంతో చంద్ర కన్ను ఆమె పెద్ద కూతురి(14)పై పడింది. బాలికపై అతడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. ఇటీవల చంద్ర శశికళ చిన్న కూతురి(11)పై కూడా అత్యాచారం చేయబోయాడు. ఈవిషయం ఈ నెల 1న వెలుగుచూసింది. ఈమేరకు పోలీసులు చంద్రపై కేసు నమోదు చేశారు. చంద్రకు శశికళ కూడా సహకరించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి నిందితులిద్దరిని రిమాండుకు తరలించారు.