
సాక్షి, కీసర: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీసర మండలం కీసర పెద్దమ్మ చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు సహా భార్యాభర్తలు చెరువులో దూకి బలవన్మరణం చెందారని మేడ్చల్ పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతులు రమేశ్, మానస, మనశ్రీ, గీతశ్రీ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.