keesaragutta
-
Keesaragutta: కేసరగిరిలో హర హర మహాదేవ శంభో శంకర (ఫొటోలు)
-
కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కీసరగుట్ట నుంచి వన్నిగూడ వైపు దట్టమైన పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు, చర్లపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. కీసరగుట్ట రెసిడెన్షియల్ పాఠశాల వెనక వైపు నుంచి టీటీడీ వేద పాఠశాల వెనుక వైపు వరకు ఉన్న కీసరగుట్ట అటవీప్రాంతంలో సోమవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 50 ఎకరాల వరకు వ్యాపించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు నీలగిరి చెట్లను పెద్ద ఎత్తున పెంచారు. ఈ మంటలకు చాలా వరకు నీలగిరి చెట్లు దగ్ధమయ్యాయి. గతంలోనూ రెండు సార్లు ఈ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. వేసవికి ముందే ఫారెస్టు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫారెస్టు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్లపల్లి ఫైర్‌స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అటవీ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
భక్తులతో కిటకిటలాడుతున్న కీసరగుట్ట శివాలయం
-
కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు
Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల) -
‘తొలుచువాండ్రు’ తొలి తెలుగు శాసనమే
సాక్షి, హైదరాబాద్: తొలి తెలుగు శాసనం ఏదన్న అంశం మరోసారి చర్చనీయంగా మారింది. మూడు రోజుల క్రితం ఏపీలోని కడప జిల్లా కలమల్లలో వెలుగు చూసిన ఓ శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలకుల సమయంలోనే దీన్ని కనుగొన్నప్పటికీ తర్వాత ఆ శాసనం కనిపించకుండా పోయింది. అయితే అప్పట్లోనే అక్షరాల నకలును తీసి ఉంచారు. ఈ నకలు ఆధారంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ఈ శాసన ప్రస్తావనను చేర్చారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ శివారులోని కీసరగుట్టలో గతంలో వెలుగు చూసిన నామక శాసనం (లేబుల్ ఇన్స్క్రిప్షన్) వివరాలను పాఠ్యపుస్తకాల్లోకి చేర్చాలన్న డిమాండ్ మొదలైంది. కడప జిల్లాలో వెలుగు చూసిన శాసనం కంటే దాదాపు వందేళ్లకుపైగా ముందే కీసరగుట్ట శాసనం లిఖించారు. దీనిప్రకారం తెలుగులో ఇదే తొలి శాసనమవుతుందన్నది చరిత్రకారుల వాదన. దీన్ని అధికారికంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కీసరగుట్టలో క్రీ.శ.430 కాలంలో విష్ణుకుండిన మహారాజు రెండో మాధవవర్మ కాలంలో గుండుపై తెలుగు లిపిలో ‘తొలుచువాండ్రు’అన్న పదాన్ని చెక్కారు. అప్పట్లో అక్కడ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు బస చేసిన ప్రాంతానికి తొలిచేవారు (శిల్పులు) అన్న పేరు పెట్టుకున్నట్టు ఈ పదం స్పష్టం చేస్తోంది. ఈ నామక శాసనం (లేబుల్ ఇన్స్క్రిప్షన్) ప్రస్తుతం తెలుగు లిపి తరహాలో లేదు. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి రూపాంతరం చెందుతున్న మొదటి త రం నాటి అక్షరాలు తొలుచువాండ్రు అన్న పదంలో మొదటి రెండు అక్షరాలు బ్రాహ్మీలిపికి దగ్గరగా ఉండగా, మిగతా అక్షరాలు బ్రాహ్మీ నుంచి తెలుగు లిపి రూపాంతరంలో ఉన్నట్టు స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఇలా తెలుగు రూపాంతర అక్షరాలు శాసనం తరహాలో వెలుగు చూడలేదు. దీంతో తొలి తెలుగు శాసనంగా దీన్ని గుర్తించాలని చరిత్రకారులు అంటున్నారు. పోయిన శాసనం కలమల్లలోనే గుర్తింపు.. ఇదిలా ఉండగా కడప జిల్లాలోని కలమల్లలో దేవాలయానికి భూమి దానాన్ని వివరిస్తూ రేనాటి చోళరాజు రేనాటి ధనంజయుడు క్రీస్తుశకం 575లో వేయించిన శాసన రాయిని మూడు రోజుల క్రితం గుర్తించారు. అయితే తొలుత బ్రిటిష్ పాలన సమయంలోనే ఈ శాసనాన్ని గుర్తించి దానిపైనున్న అక్షరాల నకలు తీశారు. శాసన రాయిని చెన్నై మ్యూజియానికి తరలించారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఆ రాయి కనిపించలేదు. దీంతో రాయి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇన్నేళ్ల తర్వాత చరిత్ర పరిశోధకులు ఆ రాయిని కలమల్ల దేవాలయంలోనే గుర్తించారు. కాగా, కీసరలో వెలుగు చూసిన అక్షరాలనే తొలి తెలుగు లేఖనంగా అధికారికంగా గుర్తించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృం దం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొ న్నారు. ఇక ఒక్క పదం ఉన్నా కూడా శాసనంగానే పరిగణించవచ్చని, కీరసలో దొరికింది తొలి తెలుగు శాసనమే అవుతుందని చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. -
కీసరలో ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్టు పార్కుకు శంకుస్థాపన
-
చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీసర మండలం కీసర పెద్దమ్మ చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు సహా భార్యాభర్తలు చెరువులో దూకి బలవన్మరణం చెందారని మేడ్చల్ పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతులు రమేశ్, మానస, మనశ్రీ, గీతశ్రీ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కీసరగుట్టపై కారు దగ్ధం
కీసర(మేడ్చల్ జిల్లా): కీసర మండలం కీసర గుట్టపై ఓకారు తగలబడిపోయింది. ప్రయాణంలో ఉన్న డస్టర్ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపుచేశారు. అయితే సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు తగలడం జరగలేదు. -
కీసరగుట్ట వద్ద నగర యువకుల హల్ చల్
- సర్పంచ్, ఎంపీటీసీలపై దాడి, పరారీ కీసర: రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన యువకుల బృందం కీసర గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మరో ఇద్దరిపై దాడిచేసిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే హౌదరాబాద్ నగరంలోని లాలాపేటకు చెందిన కొందరు యువకులు బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆదివారం సాయంత్రం కీసరగుట్ట వెళ్లారు. అదేసమయంలో కీరస సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ రమేష్ గుప్తాలతోపాటు, మరో ముగ్గురు గ్రామస్తులు కూడా పనిమీద వెళ్లొస్తున్నారు. జెడ్పీగెస్ట్ హౌస్ వద్ద అనుకోకుండా ఇరువర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో 20 మందివరకున్న యువకులు.. సర్పంచ్, ఎంపీటీసీ, మరో ముగ్గురిని చితకబాదారు. ఎంపీటీసీ రమేష్ గుప్తా అక్కడి నుంచి తప్పించుకొని కీసర గ్రామానికి వెళ్లి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో గ్రాస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి పరుగుతీశారు. దాడిచేసిన యువకుల్లో ఇద్దరు మాత్రమే చిక్కగా మిగతావారు పరారయ్యారు. దొరికిన ఇద్దరికి దేహశుద్ధిచేసిన పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ గణేష్, వెంకట్‌ను ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
భక్తులతో కిటకిటలాడిన కీసరగుట్ట
కీసర (రంగారెడ్డి) : కార్తీకమాసం చివరిరోజు కావడంతో శుక్రవారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీరామలింగేశ్వరస్వామికి తైలాభిషేకం, అన్నపూజను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. లోకంలో క్షుద్బాధ తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ ఏటా కార్తీక మాసోత్సవాల్లో చివరి రోజున స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ఈ పూజలో భాగంగా వరి అన్నంతో గర్భాలయంలో శివలింగాన్ని పూర్తిగా కప్పివేయడం జరుగుతుందని... సాయంత్రం శివలింగంపై కప్పిన వరి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
మహాశివరాత్రికి కీసర గుట్టలో ప్రత్యేక ఏర్పాట్లు
రంగారెడ్డి(కీసర): కీసర గుట్టలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా శివరాత్రి రోజూ (మంగళవారం) స్వామివారిని ద ర్శించుకునేందుకు నగరం నలుమూలల నుండి యాత్రికులుపెద్ద ఎత్తున కీసరగుట్టకు రానున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్‌దీపాలతో కీసరగుట్టప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికలు సౌకర్యార్థం ఆర్టిసీ 320 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని యాప్రాల్, సికింద్రాబాద్, ఉప్పల్, ఈసిఐఎల్ ,అమ్ముగూడ, హాకింపేట్,శామీర్‌పేట, తుర్కపల్లి, ఘట్కేసర్, తదితర ప్రాంతాల నుండి పత్రి 15 నిమిషాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతారు. అవసరమైతే 7382819339,9959226145 ఫోన్ నంబర్లుకు ఫోన్ చేస్తే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్బంగా మంగళవారం దేవాలయంలో ఉదయం 4 గం, మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, ఉదయం 6 గం. లనుండి సాముహిక అభిషేకాలు, 9 గం. రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8 గంలకు నందివాహన సేవ, రాత్రి 10 గ. భజనలు, రాత్రి 12 గం, రామలింగేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహిస్తారు. -
‘కార్తీక’ సందడి షురూ..
కీసర, న్యూస్‌లైన్: కీసరగుట్టలో కార్తీక మాసోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగాలకు, ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలోని శివలింగాలకు పసుపు, కుంకుమ, పూలు, పాలు, నూనెలతో అభిషేకాలు చేశారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపోత్సవం నిర్వహించారు. స్వామివారి పల్లకీసేవ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు కన్నుల పండువగా జరిపించారు. మహామండపంలో సామూహిక అభిషేకాలను నిర్వహిం చారు. పూజల అనంతరం భక్తులు గుట్ట దిగువన హుడాపార్కులో కుటుంబసమేతంగా వనభోజనాలు చేసి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. పూజా కార్యక్రమాల్లో కేఎల్లార్ ట్రస్టు చైర్మన్ విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ టి.నారాయణశర్మ, ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవస్థానానికి సోమవారం ఒక్కరోజే సుమారు రూ.3 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ వర్గాలు తెలిపాయి. నీటికరువు.. ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు, నిర్వాహకులు తొలిరోజే భక్తులకు మంచినీటిని అందించడంలో విఫలమయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుళాయిల నుంచి చుక్కనీరు రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివలింగాలకు అభిషేకం చేయడానికి గుట్ట కిందికి వెళ్లి మంచినీటి ప్యాకెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో మధ్యాహ్నానికి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు.