రంగారెడ్డి(కీసర): కీసర గుట్టలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా శివరాత్రి రోజూ (మంగళవారం) స్వామివారిని ద ర్శించుకునేందుకు నగరం నలుమూలల నుండి యాత్రికులుపెద్ద ఎత్తున కీసరగుట్టకు రానున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్‌దీపాలతో కీసరగుట్టప్రాంగణాన్ని అందంగా అలంకరించారు.
ఈ ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికలు సౌకర్యార్థం ఆర్‌టిసీ 320 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని యాప్రాల్, సికింద్రాబాద్, ఉప్పల్, ఈసిఐఎల్ ,అమ్ముగూడ, హాకింపేట్,శామీర్‌పేట, తుర్కపల్లి, ఘట్‌కేసర్, తదితర ప్రాంతాల నుండి పత్రి 15 నిమిషాలకు ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతారు. అవసరమైతే 7382819339,9959226145 ఫోన్ నంబర్లుకు ఫోన్ చేస్తే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్బంగా మంగళవారం దేవాలయంలో ఉదయం 4 గం, మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, ఉదయం 6 గం. లనుండి సాముహిక అభిషేకాలు, 9 గం. రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8 గంలకు నందివాహన సేవ, రాత్రి 10 గ. భజనలు, రాత్రి 12 గం, రామలింగేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహిస్తారు.