మహా శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ తమ శక్తి మేరకు ఎంతో కొంత ఉపవాసం ఉంటారు. కొందరూ మధ్యహ్నాం వరకు తినరు మరికొందరూ రోజంతా ఏం తినకుండా రాత్రి జాగరం కూడా చేసి మరసటి రోజు ఉదయం గానీ తినరు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పళ్లు, పాలు వంటివి తీసుకోని ఆ భోళా శంకరుడుని ప్రార్థించొచ్చు. అలాంటి వారు ఈ పర్వదినం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో చూద్దామా!.
సగ్గుబియ్యం: ఇది తక్షణ శక్తి ఇస్తుంది. ఉపవాసం చేసే వాళ్లకు చాలా మంచిది. ఈ సగ్గుబియ్యందో చేసిన జావా లేదా పాలతో చేసే సగ్గుబియ్యం జావా తాగితే మంచిది. ఉపవాసం ఉన్న వాళ్లకు మంచి ఎనర్జీ బూస్టప్‌గా ఉంటుంది.
బంగాళ దుంప!: ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉడక బెట్టుకుని లేదా దానికి సంబంధించిన రెసిపీలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయాలు లేకుండా నచ్చిన రెసిపీ చేసుకుంటే మంచిది
పాల సంబంధిత రెసిపీలు..
శివుడికి పాల సంబంధిత పదార్థాలను నైవద్యంగా పెట్టడం జరుగుతంది. అలాంటివి తీసుకుంటే ఉపవాసం ఉన్నవాళ్లు కళ్లు తిరగడం వంటివి తలెత్తవు.
పండ్లు, డ్రైఫ్రూట్స్
పండ్లు తినడం మంచిదే కానీ, మరీ సిట్రస్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఉపవాసం కారణంగా పొట్టలో ఆటోమేటిగ్గా యాసిడ్‌లు ఫామ్ అవుతాయి. ఇక ఇలాంటి పుల్లటి పళ్లు తీసుకుంటే మరింత గ్యాస్ ఫామ్ అయ్యే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది.
తీసుకోకూడని పదార్థాలు..
తృణ ధాన్యాలు..
గోధుమలు, అరికెలు, జొన్నలు, సామలు వంటి తృణ ధాన్యాలకు సంబంధించిన పదార్థాలు వినియోగించకూడదు. అలాగే ఎలాంటి పిండి పదార్ధాలు వినియోగించ కూడదు.
ఉల్లి, వెల్లుల్లి..
సాధారణంగా ఇలాంటి పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి జోలికిపోరు. ఇవి తమో రజో గుణాలను ప్రేరిపిస్తుందని మునులు వీటిని ఇలాంటి పర్వదినంలో త్యజించమని సూచించారు.
ఉప్పు
ఉప్పు లేని పదార్థాలే తీసుకోవాలి. అదికూడా సైంధవ లవణమైతే వినియోగించొచ్చు.
స్సైసీ ఫుడ్స్
మసాలతో కూడిన పదార్థాలు నిషిద్ధం.
నాన్ వెజ్
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్‌వెజ్ జోలికి పోకూడదు. మహా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసంతో ఆ ముక్కంటి అనుగ్రహం పొందేలా చేసుకునే పవిత్రమైన రోజు.
(చదవండి: లావుగా ఉన్నావంటూ భార్యతో సహా బిడ్డను వదిలేశాడు..కానీ ఆమె..!)
Comments
Please login to add a commentAdd a comment