
కీసరగుట్టపై కారు దగ్ధం
కీసర(మేడ్చల్ జిల్లా): కీసర మండలం కీసర గుట్టపై ఓకారు తగలబడిపోయింది. ప్రయాణంలో ఉన్న డస్టర్ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపుచేశారు. అయితే సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు తగలడం జరగలేదు.