కార్తీకమాసం చివరిరోజు కావడంతో శుక్రవారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కీసర (రంగారెడ్డి) : కార్తీకమాసం చివరిరోజు కావడంతో శుక్రవారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీరామలింగేశ్వరస్వామికి తైలాభిషేకం, అన్నపూజను వేద పండితులు వైభవంగా నిర్వహించారు.
లోకంలో క్షుద్బాధ తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ ఏటా కార్తీక మాసోత్సవాల్లో చివరి రోజున స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ఈ పూజలో భాగంగా వరి అన్నంతో గర్భాలయంలో శివలింగాన్ని పూర్తిగా కప్పివేయడం జరుగుతుందని... సాయంత్రం శివలింగంపై కప్పిన వరి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.