
సాక్షి, మేడ్చల్: సంక్రాంతి పండుగరోజు మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కీసరం మండలం రాంపల్లి క్రాస్‌రోడ్డు దగ్గర ఆదివారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న కరీంగూడకు చెందిన ఓమ్‌ప్రకాష్‌రెడ్డి (24), అఖిలేష్‌రెడ్డి(23) తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘఠన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.