చంద్రశేఖరరావు విమర్శలు అర్థ రహితం
చంద్రశేఖరరావు విమర్శలు అర్థ రహితం
Published Tue, Feb 28 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
– పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యాధికారుల సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు
రాయవరం (మండపేట) :పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్‌డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్‌ఆర్‌ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్‌ఆర్‌ఏ ఇస్తుందన్నారు.
పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్‌డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్‌ఆర్‌ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్‌ఆర్‌ఏ ఇస్తుందన్నారు.
Advertisement