critisism
-
స్టార్ హీరో సినిమాకు బాయ్ కాట్ సెగ.. ట్విటర్లో ట్రెండింగ్
Akshay Kumar Bachchhan Pandey Faces Criticism For This Reason: 'సూర్యవంశీ' సినిమాతో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టాడు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. తర్వాత వచ్చిన 'ఆత్రంగి రే' కూడా ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తాజాగా అక్కీ నటించిన చిత్రం బచ్చన్ పాండే. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అక్షయ్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 18న విడుదలైంది. ప్రస్తుతం మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుంటున్న బచ్చన్ పాండే విమర్శలు సైతం ఎదుర్కుంటోంది. #BoycottBachchhanpandey అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర ప్రజలను హత్య చేసే ఒక హింసాత్మక నేరస్థుడిగా ఉంటుంది. ఈ పాత్రకు పాండే అనే ఇంటి పేరును ఉపయోగించడంతో ఈ వివాదం రాజుకుంది. హిందువులను కించపరిచే విధంగా ఈ పాత్రను చిత్రీకరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అక్కీతోపాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతి సనన్, అర్షద్ వార్సీ, పంకజ్ త్రిపాఠి, సంజయ్ మిశ్రా, అభిమన్యు సింగ్ వంటి తదితరులు నటించారు. బచ్చన్ పాండే చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండా' మూవీకి రీమేక్. అలాగే ఈ మూవీని తెలుగులో 'గద్దలకొండ గణేష్'గా రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. How many people around you had you convinced to Boycott Hinduphobic Bollywood runs for Dawood Ibrahim ? I had convinced 157 people in my circle what about you ?#BoycottBollywood#BoycottBachchhanPaandey pic.twitter.com/Hw0QN7KRwQ — Nitika Singh🦋🇮🇳 (@itsNitikaSingh) March 17, 2022 Retweet Maximum If You Agree.#BoycottBollywood#BoycottBachchhanPaandey pic.twitter.com/lUAv7vyT33 — KIZIE (@sushantify) March 18, 2022 Do you guys remember from where Bollywood copied starcast for #BachchhanPaandey ? United Against Bollywood#BoycottBollywood #BoycottBachchhanPaandey pic.twitter.com/75v9bW2Hla — Nitika Singh🦋🇮🇳 (@itsNitikaSingh) March 17, 2022 AGREE ??#BoycottBachchhanPaandey pic.twitter.com/YwMsuASe0T — GD Bakshi (@GDBakshi2) March 18, 2022 -
జీహెచ్ఎమ్సీ తీరుపై సర్వత్రా విమర్శలు
-
రిజిస్ట్రేషన్‌కే పరిమితం !
ఒంగోలు: ఇన్‌స్పయిర్ ప్రాజెక్టుల ప్రదర్శన తొలిరోజు కేవలం రిజిస్ట్రేషన్‌కే పరిమితమైంది. బంద్ ప్రభావంతో ఎంపికైన ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు రావాల్సిన విద్యార్థులు, గైడ్లు రాలేకపోవడంతో ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి శిద్దా రాఘవరావు అనుమతి మేరకు శుక్రవారానికి వాయిదా వేశారు. స్థానిక సెయింట్ ఆగ్జీలియం అఖిల వికాస్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు వసతి సౌకర్యంతోపాటు భోజన సౌకర్యం కల్పించింది. గురువారం రాత్రికి గుంటూరు నుంచి 106కుగాను 91 ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా నుంచి 321కిగాను 248 ప్రాజెక్టులు నమోదయ్యాయి. మిగిలినవి కూడా శుక్రవారం ఉదయానికల్లా వస్తాయని డీఈవో తెలిపారు. ప్రాజెక్టుల ఎంపికపై విమర్శలు.. ఇన్‌స్పయిర్‌కు ఆన్లైన్లో పాఠశాలల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం వాటిని పరిశీలించి ఉత్తమమైనవిగా భావిస్తే జాతీయ కమిటీ ఎంపిక చేసి వాటి నిర్వహణకు అనుమతి ఇస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5 వేలు, విద్యార్థి, గైడ్ టీచర్ రవాణా తదితర ఖర్చులకు మరో రూ.5 వేలు కేంద్రం విడుదల చేస్తుంది. కానీ ఈ సారి ఎంపికైన ప్రాజెక్టులను పరిశీలిస్తే మార్కాపురం మండలంలోని ఒక పాఠశాలకు ఒకే ప్రాజెక్టుకు ఐదుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురికి అదే ప్రాజెక్టు మంజూరైంది. అదే విధంగా ఒక కేజీబీవీ పాఠశాలకు 5 ప్రాజెక్టులు, మరో గొట్లగట్టుకు 5 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఒకే పాఠశాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మంజూరు చేశారని, వీటికంటే మంచి ప్రాజెక్టులను ప్రతిపాదించిన పాఠశాలలకు మొండిచేయ్యి చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 182 పాఠశాలల నుంచి 321 ప్రాజెక్టులను ఎంపిక చేయడం ద్వారా కేంద్ర స్థాయిలోనే ప్రాజెక్టుల ఎంపిక సరిగా జరగలేదనే వాదనలు లేకపోలేదు. ఆకట్టుకున్న ప్రదర్శనలు.. ♦ గుంటూరు జిల్లా పెదకాకాని జెడ్పీస్కూలుకు చెందిన 10వ తరగతి విద్యార్థి టి.తరుణ్‌కుమార్ రూపొందించిన సోలార్ కారు ప్రాజెక్టు ఆకట్టుకుంది. సోలార్ ప్యానల్ ద్వారా మోర్టార్ కలిగిన చక్రాలు, బ్యాటరీల సాయంతో ఈ కారును తయారు చేశారు. అత్యంత తక్కువ వ్యయంతో ఇంధన సమస్యకు స్వస్తి చెప్పేందుకు తాను రూపొందించిన ప్రాజెక్టు ఉపయోగపడుతుదని విద్యార్థి చెబుతున్నాడు. ♦ ప్రకాశం జిల్లా మంగమూరుకు చెందిన విద్యార్థిని రూపొందించిన పాసివ్ ఇన్ఫ్రారెడ్ సెక్యూరిటీ సిస్టం కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం సెక్యూరిటీ కోసం ఎక్కువగా సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీని కారణంగా నిత్యం వీడియో రికార్డ చేయడం వల్ల ఎప్పుడైనా, ఏదైనా ఘటన జరిగిందీ లేనిదీ తెలుసుకోవాలంటే మొత్తం వీడియో పరిశీలించుకోవాలి. అయితే ఈ విద్యార్థిని రూపొందించిన ప్రాజెక్టు కేవలం మనుషులు లేదా జంతువులు ఆ ప్రాంతాలకు వెళ్లినపుడు మాత్రమే ఫొటో తీస్తుంది. అంటే మనిషి లేదా జంతువులో ఉన్న ఉష్ణోగ్రతలను గ్రహిస్తూ పనిచేస్తుంది. అదే విధంగా పొలాల్లో మోటార్లు ఆన్‌చేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మరణించే రైతులను ఎంతోమందిని చూస్తుంటాం. దానికి కూడా కేవలం మొబైల్ ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను చేపట్టేందుకు డ్యూయల్టోన్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టును ఇంకొల్లు మండలం పావులూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థి తయారుచేసి ఆకట్టుకున్నాడు. కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు పర్యవేక్షిస్తున్నారు. -
చీవాట్లు పెట్టినా... చులకన చేసినా..
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలకు అర్థం తెలియదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనాలు కోకొల్లలు. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నా మా తీరింతే అన్నట్టుగా ఉంది. కోర్టులు చీవాట్లు పెట్టినా... కొందరు విద్యార్థులు చులకనగా మాట్లాడినా వెనక్కి తగ్గరనేందుకు రెండు సంవత్సరాల కాలపరిమితితో నియమించబడిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి పూనుకోవడం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తించిన నాన్ టీచింగ్ సిబ్బంది గురువారం మూకుమ్మడిగా ఫైల్ సిద్ధం చేసిన అధికారిని నిలదీయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడంతో గుట్టు బట్టబయలైంది. అంతా మా ఇష్టం... ఆర్యూ ఉన్నతాధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తునారనేందుకు ఇంక్రిమెంట్ ఇవ్వదలచిన కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 40 వేలకు పైగా జీతం ఇవ్వడంతోపాటు హెచ్ఆర్ఎ ఇవ్వడం నిదర్శనం. సర్వీస్ రిజిస్టర్ లేకుండానే ఇంక్రిమెంట్లు ఎలా ఇస్తారనేది అర్థమవ్వని విషయం. అంతర్గత ఒప్పందం మేరకు నియమించుకుని దొడ్డిదారిన పర్మనెంట్ చేయడానికే ఈ ఎత్తుగడని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగానికి సూపరింటెండెంట్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడు. అయితే ప్రైవేట్ ఐటీ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తిని నియమించడమే నిబంధనలకు విరుద్ధం. అప్పట్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు కూడా. వైస్ చాన్స్‌లర్ నరసింహులు పదవీ కాలం ఏప్రియల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ ఇంక్రిమెంట్ల ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగిగా స్థిరపడేందుకు ఎత్తుగడ అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. నాన్‌టీచింగ్ సిబ్బంది పాపమేంటి ? వర్సిటీలో టైం స్కేల్ పొందుతున్న నాన్ టీచింగ్ సిబ్బంది 12 మంది ఉన్నారు. ఖాళీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరిని వదిలేసి మూడేళ్ల నుంచి మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తిని పర్మనెంట్ చేయడానికి పావులు కదపడంలో మతలబ్ ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా 110 మంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కంట్రాక్టు సిబ్బందికి టైంస్కేలు ఇవ్వని ఉన్నతాధికారులు సదరు ఉద్యోగికి అడ్డదారిన ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు చేస్తున్న తీరును ఉద్యోగులు తప్పుపడుతున్నారు. -
మోదీ అపాయింట్మెంట్ దొరకలేదు
న్యూఢిల్లీ: ఎన్డీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందంటూ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కేంద్రం తన విధానాలను మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యశ్వంత్ వ్యాఖ్యలను ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై వివరించేందుకు ఏడాది క్రితమే ప్రధాని మోదీ అపాయిమెంట్ కోరినా దొరకలేదని వెల్లడించారు. అందుకే తన అభిప్రాయాలను మీడియా ద్వారా తెలియజేశానన్నారు. ‘నాకు తలుపులు మూసుకుపోయాయని అర్థమైంది. ఇక మాట్లాడ్డానికి మీడియా తప్ప మరో మార్గం కనిపించలేదు. ప్రధాని మోదీకి చెప్పేందుకు నా వద్ద విలువైన సూచనలు ఉన్నాయి’ అని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం లాంటి ఆర్థికవేత్తల అభిప్రాయాలను ఏ ప్రభుత్వమైనా పెడచెవిన పెట్టరాదని సూచించారు. ప్రభుత్వంపై అసంతృప్తితోనే విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించినపుడు యశ్వంత్... ఇది తనపై చేసిన అత్యంత చవకబారు ఆరోపణ అని బదులిచ్చారు. సాంకేతికంగా ఇంకా తాను బీజేపీలో భాగమేనని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన తన కొడుకు జయంత్ తీరును కూడా యశ్వంత్ తప్పుపట్టారు. ఇలాంటి వాటిపై పార్టీ అధికార ప్రతినిధి లేదా సంబంధిత మంత్రి వ్యాఖ్యానించాలని, జయంత్ ఏ హోదాలో స్పందించారని ప్రశ్నించారు. జయంత్‌కు అంత ప్రముఖ స్థానం ఉన్నట్లయితే ఆర్థిక శాఖ నుంచి తప్పించి విమానయాన శాఖకు ఎందుకు మార్చారని నిలదీశారు. తాను, తన కొడుకు తమతమ విధులు నిర్వర్తిస్తున్నామని, ఇది తండ్రీకొడుకుల మధ్య సమస్యగా చూడొద్దని చెప్పారు. ‘నవభారతం’ కోసమే: జయంత్ యశ్వంత్ సిన్హా ఆంగ్ల దిన పత్రికలో రాసిన వ్యాసాన్ని జయంత్ ప్రస్తావిస్తూ...భారత ఆర్థి క వ్యవస్థపై గతంలో ఎన్నో కథనాలు వెలువడ్డాయని, కానీ ఈ వ్యాసం కొన్ని పరిమిత గణాంకాలు, సమాచారంపై ఆధారపడి ఉందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులకు కారణమవుతున్న మౌలిక సంస్క రణలను విస్మరించిందని అన్నారు. నవ భారతం, ఉద్యోగ సృష్టికి ఈ నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. 80 ఏళ్ల వయసులో పని కోసమే ఇలా.. ఆర్థిక వ్యవస్థపై యశ్వంత్ సిన్హా ఆరోపణలకు సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెదవి విప్పారు. ఆర్థిక మంత్రిగా ఆయన తన చెత్త రికార్డును మరచిపోయి, విధానాలపై కాకుండా వ్యక్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 80 ఏళ్ల వయసులో ఉద్యోగం కోసం ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో యశ్వంత్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఒకరిపై ఒకరు పరుష పదజాలం వాడారని, కానీ ఇప్పుడు ఇద్దరు కూడబలుక్కుని ఒకే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. -
చంద్రశేఖరరావు విమర్శలు అర్థ రహితం
– పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యాధికారుల సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు రాయవరం (మండపేట) :పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్ఆర్ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్ఆర్ఏ ఇస్తుందన్నారు. పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు చేసిన విమర్శలు అర్థ రహితమని పశువైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.సత్యనారాయణ, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అన్నారు. తప్పుడు విమర్శలు చేసిన చంద్రశేఖరరావుపై శాఖాపరమైన చర్యలకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు వారు తెలిపారు. రాయవరంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ పశువైద్యశాలల్లో గెజిటెడ్ అధికారులు పనిచేయాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే పశు సంవర్ధక శాఖలో రీఆర్గనైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. 1976లో జరిగిన రీఆర్గనైజేషన్ తర్వాత తిరిగి ఇప్పుడే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 500 గ్రామీణ పశువైద్యశాలల స్థాయిని వెటర్నరీ డిస్పెన్సరీ స్థాయికి పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పశువైద్యుల నియామకం చేపట్టారన్నారు. అందులో భాగంగా జిల్లాకు 39మందిని కేటాయించగా, ఇంకా 14 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్ డివిజన్లను 330 సబ్డివిజన్లుగా మార్పు చేశారన్నారు. పాడి రైతులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారన్నారు. ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణనను పశు సంవర్ధక శాఖలో పారా సిబ్బంది మాత్రమే చేపడతారన్నారు. పశుగణన అంతా తప్పుల తడక అన్న చంద్రశేఖరరావు.. వారు చేసిన సర్వేను వారే తప్పుబట్టినట్టవుతుందన్నారు. హెచ్ఆర్ఏ కోసం పోస్టులు అప్‌గ్రేడ్ చేశారంటున్న చంద్రశేఖరరావుకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పోస్టులను బట్టి కాకుండా ప్రభుత్వం గెజిట్ ద్వారా మాత్రమే హెచ్ఆర్ఏ ఇస్తుందన్నారు. -
చంద్రబాబును మించిన కులతత్వ వాది లేరు
హైదరాబాద్ : ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబును మించిన కులతత్వ వాది మరొకరు లేరని ఏపీ కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. సమాజంలో పుట్టుకకు, డబ్బులకు ముడిపెడుతూ చంద్రబాబు కొత్త తరహా కపట రాజకీయాలకు తెరతీస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలిలో విపక్ష నేత సి రామచంద్రయ్య, మాజీ మంత్రి శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిపాలన పక్కన పెట్టి కులాల మాట్లాడటమేంటని తప్పుబట్టారు. చంద్రబాబు తన మంత్రివర్గంలోగానీ, నామినేటెడ్ పదవుల్లోగానీ చివరకు పరిపాలనా పరంగా కూడా ఆయన కార్యాలయంలోగానీ కులాల వారిగా సమతుల్యత ఉందా చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం వారు ఇందిరాభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనట్లుగా విదేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చంద్రబాబు నియమించారని, ఆ నియామకాల్లోనూ కులతత్వాన్ని నిరూపించుకున్న ఘనత ఆయనదేనని విమర్శించారు. బీసీ వర్గాల నేత ఆర్ కృష్ణయ్యను తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలు పూర్తి కాగానే ఆయనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేని అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాపుల రిజర్వేషన్ల ఆందోళనకు సంఘీభావం తెలియజేయడానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవిలను మీకేం పనంటూ ప్రశ్నించడంలో అర్థం లేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెబుతూ సినీనటుడు పవన్ కల్యాణ్ ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మీడియాకు లీకులివ్వడం కాదని, ఆ విషయాలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తో అధికారికంగా చెప్పించాలని డిమాండ్ చేశారు. కాపుగర్జన సభలో జరిగిన హింసాత్మక సంఘటనలో రాయలసీమ పాత్ర అంటూ చెప్పడంపై రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ అంశంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు దళితులకు టికెట్లు ఇస్తే ఓడిపోతారంటూ చంద్రబాబు ఆ వర్గాలపై ఉన్న తన ధ్వేషాన్ని, అగ్రవర్ణ అహంకారాన్ని చాటుకున్నారని శైలజానాధ్ విమర్శించారు.