#BoycottBachchhanPaandey: Akshay Kumar-Starrer Faces Criticism for This Reason - Sakshi
Sakshi News home page

Bachchhan Pandey Movie: స్టార్‌ హీరో సినిమాకు బాయ్‌ కాట్‌ సెగ.. ట్విటర్‌లో ట్రెండింగ్‌

Published Sun, Mar 20 2022 10:42 AM | Last Updated on Sun, Mar 20 2022 1:51 PM

Akshay Kumar Bachchhan Pandey Faces Criticism For This Reason - Sakshi

Akshay Kumar Bachchhan Pandey Faces Criticism For This Reason: 'సూర్యవంశీ' సినిమాతో బ్లాక్‌ బ్లస్టర్ హిట్‌ కొట్టాడు యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్. తర్వాత వచ్చిన 'ఆత్రంగి రే' కూడా ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తాజాగా అక్కీ నటించిన చిత్రం బచ్చన్‌ పాండే. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అక్షయ్‌ కుమార్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 18న విడుదలైంది. ప్రస్తుతం మంచి పబ్లిక్‌ టాక్‌ తెచ్చుకుంటున్న బచ్చన్‌ పాండే విమర్శలు సైతం ఎదుర్కుంటోంది. #BoycottBachchhanpandey అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 

అయితే ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌  పాత్ర ప్రజలను హత్య చేసే ఒక హింసాత్మక నేరస్థుడిగా ఉంటుంది. ఈ  పాత్రకు పాండే అనే ఇంటి పేరును ఉపయోగించడంతో ఈ వివాదం రాజుకుంది. హిందువులను కించపరిచే విధంగా ఈ పాత్రను చిత్రీకరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అక్కీతోపాటు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, కృతి సనన్‌, అర్షద్‌ వార్సీ, పంకజ్‌ త్రిపాఠి, సంజయ్ మిశ్రా, అభిమన్యు సింగ్‌ వంటి తదితరులు నటించారు. బచ్చన్ పాండే చిత్రం తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'జిగర్తాండా' మూవీకి రీమేక్‌. అలాగే ఈ మూవీని తెలుగులో 'గద్దలకొండ గణేష్‌'గా రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement