
‘కేజీయఫ్’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యశ్. ఆయన కీలక పాత్ర చేసిన ‘చంద్ర’ చిత్రాన్ని ‘మహాచంద్ర’ పేరుతో అనువదిస్తున్నారు. యశ్, ప్రేమ్ కుమార్, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. రూపా అయ్యర్ దర్శకత్వంలో షాన్వాజ్ నిర్మించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ – ‘‘కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. యశ్ కీలక పాత్రలో కనిపిస్తారు. శ్రియ అద్భుతమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: దామోదర వనాఛార్య, సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ్, కెమెరా: దాస్.
Comments
Please login to add a commentAdd a comment