chandra siddhartha
-
ఇంట్రస్టింగ్‌గా అనంత టీజర్
ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అనంత. ఈ చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా ఏ ప్రశాంత్ నిర్మిస్తున్నారు. అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ జే గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ముఖ్యపాత్రలు పోషిస్తుండగా ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. సిద్దు సోమిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో సినిమా సోల్ ఏంటనేది స్పష్టమయ్యేలా ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఈ టీజర్ చూసిన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ.. సినిమా చాలా బాగా వచ్చిందని అర్థమవుతోందని అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని తెలుస్తోందన్నారు. చిత్ర దర్శకులు మధు బాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. కథ వినగానే ప్రశాంత్ ముందుకొచ్చి ఈ సినిమా చేశారు. ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ పంచుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్టుతో రాబోతోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. చదవండి: విషాదం, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ నటుడు మృతి -
‘ఆటగదరా శివ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆటగదరా శివ జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది సంగీతం : వాసుకి వైభవ్ దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ నిర్మాత : రాక్‌లైన్ వెంకటేష్ ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి హార్ట్ టచింగ్ సినిమాలను తెరకెక్కించిన చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆటగదరా శివ. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు మూడేళ్ల విరామం తరువాత చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఆటగదరా శివపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..? కథ; జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ(ఉదయ్ శంకర్)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ.. జైల్లో సెంట్రీని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత పేపర్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్ అంటూ వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి..? కలిసిన వ్యక్తులు ఎవరు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; కన్నడలో ఘనవిజయం సాధించిన రామ రామరే సినిమాను దాదాపు అదే ఫీల్‌ను క్యారీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు చంద్రసిద్ధర్థ. కథగా చిన్నపాయింటే అయినా.. కథనంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాకు కీలకమైన జంగయ్య పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రకు కన్నడ నటుడు దొడ్డన్న ప్రాణం పోశారు. లుక్స్ పరంగానే కాదు నటనతోనూ మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో దొడ్డన్న నటన సూపర్బ్. బాబ్జీ పాత్రలో కనిపించిన ఉదయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కకపోయినా.. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదికి లెంగ్తీ రోల్ దక్కింది. తన మార్క్ పంచ్ డైలాగ్స్‌తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు ఆది.ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పాటు ఆపాత్రలో పరిచయం ఉన్న నటులెవరూ కనిపించలేదు. దర్శకుడు చంద్ర సిద్దార్థ తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌తో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఆటగదరా శివ సినిమాకు ప్రధాన బలం మాటలు. ‘ముందు క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు.. క్షమించిన వాడే బలవంతుడు’, ‘మనం ఉన్నప్పుడు లేనోళ్లు, పోయాక ఉంటే ఎంత పోతే ఎంత’, ‘చావు విముక్తి, బతుకు తృప్తి’ లాంటి డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారని ఈ సినిమా మెప్పించటం కాస్త కష్టమే. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ లవిత్ సినిమాటోగ్రఫి. నిర్జన ప్రదేశంలో పెద్దగా సెట్ ప్రాపర్టీస్‌ను వాడకుండా ఆసక్తికర విజువల్స్‌ను క్యాప్చర్ చేశారు. కన్నడ వర్షన్‌కు సంగీతమందించిన వాసుకీ వైభవ్ తెలుగు వర్షన్ కు కూడా మంచి సంగీతాన్నందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌తో పాటు, ఎట్టాగయ్య శివ పాటలకు మంచి రెస్సాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత తెలుగు సినిమాను నిర్మించిన రాక్‌లైన్ లైన్ వెంకటేష్ తమ బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాతో ఆకట్టుకున్నారు. ప్లస్ పాయింట్స్ ; కథా కథనం ప్రధాన పాత్రధారుల నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సాంగ్‌ను రిలీజ్ చేయనున్న పవన్
టైటిల్‌తోనే ఆకట్టుకుంటోన్న సినిమా ఆటగదరా శివ. ఆ నలుగురు, అందరి బంధువయా, మధుమాసం లాంటి సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ ఈ సినిమాను తెరకెక్కించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకునే లా ఉండడంతో అందరికీ చేరువై.. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ఓ పాటను హీరో వెంకటేష్‌తో రిలీజ్ చేయించారు చిత్ర నిర్మాత. ఈ సినిమాలో మరో పాటను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ‘ఎట్టాగయ్యా శివ’ అనే లిరికల్ సాంగ్‌ను శనివారం సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నారు. రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్పై రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. Glad to announce that our own POWER STAR @PawanKalyan garu will be launching #YettagayyaShiva lyrical video at 6PM today on @MangoMusicLabel. A film by #ChandraSiddarth.#VasukiVaibhav musical.#AatagadharaaSiva #AGSOnJuly20th @RocklineEnt pic.twitter.com/CXeYOctvy6 — RocklineEnt (@RocklineEnt) July 14, 2018 -
చచ్చేవాడు.. చంపేవాడు కలిసే తిరుగుతున్నారు
‘ఆ నలుగురు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్దార్థ. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా.. మళ్లీ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్, టీజర్‌తో సినిమా కొత్తగా ఉండబోతోందని ముందే తెలియజేసేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పదునైన మాటలు, జబర్దస్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర పంచ్ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోన్నాయి. ఉరి తీయడానికి రమ్మని పిలిచి ప్రభుత్వం ఓ వ్యక్తికి లేఖ రాయగా, అదే టైంలో ఉరి శిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. ఈ ఇద్దరు కలిసి చేసే ప్రయాణామే ఈ సినిమా కథ. ‘హ్యాంగ్ మ్యాన్’ నేపథ్యంలో జరిగే ఈ కథలో ‘సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు... చంపేవాడు కలిసే తిరుగుతున్నారు’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. -
విడుదలకు సిద్ధమైన ‘ఆటగదరా శివ’
ఆ నలుగు, మధుమాసం, అందరి బంధువయా లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ ఏమో గుర్రం ఎగరావచ్చు ఫ్లాప్ అవ్వడంటో గ్యాప్ తీసుకున్నారు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన మార్క్ కనిపించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆటగదరా శివ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది కీకల పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్ : తెరపైకి మరో పేరు
సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు బాలయ్య. ముందుగా ఈ సినిమాను తేజ దర్శకత్వంలో రూపొందించాలని నిర్ణయించారు. అయితే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన తరువాత తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ లాంటి దర్శకులను సంప్రదించిన ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించేందుకు అంగీకరించకపోవటంతో బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దర్శకత్వ శాఖలో అనుభవం లేని బాలయ్య సీనియర్ దర్శకుల పర్యవేక్షణలో సినిమా చేయాలని భావిస్తున్నారట. ముందుగా ఆ బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అప్పగించాలని భావించినా.. రాఘవేంద్ర రావు బిజీగా ఉండటంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారభించారు. తాజాగా ఆ నలుగురు ఫేం చంద్ర సిద్ధార్థ, ‘ఎన్టీఆర్’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ -
ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'
ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సందేశాత్మక చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో అదే బాటలో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణ సారథ్యంలో ఆటగదరా శివా అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో పాటు ఆధ్యాత్మిక భావాలను కూడా చూపేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అంతా కొత్తవారితోనే తెరకెక్కించాలని నిర్ణయించారు. తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా సినిమాను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్, బాలీవుడ్ సినిమా భజరంగీ బాయ్ జాన్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు. ఆటగదరా శివా సినిమాను కూడా తన గత చిత్రాల స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. -
ఏమో గుర్రం ఎగరావచ్చు స్టిల్స్
-
‘కాటమరాయుడా...’
సినిమా ద్వారా నాలుగు మంచి విషయాలు చెబితే... ‘ఆర్ట్ ఫిలిం’ అని తేలిగ్గా పెదవి విరిచేసే రోజులివి. అయితే... చేదైన మంచిని కూడా తీయని రసగుల్లాలా నోటికి అందించడంలోనే ఉంది అసలైన ప్రజ్ఞ. దర్శకుడు చంద్రసిద్దార్థ్ చేసేది అదే. ఆ నలుగురు, మధుమాసం, ఇదీ సంగతి, అందరిబంధువయ.. ఇలా ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి కనిపిస్తూనే ఉంటుంది. అయితే... ఆ మంచి కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. దటీజ్ చంద్రసిద్దార్థ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’. సుమంత్, పింకీ సావిక జంటగా చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చంద్రసిద్దార్థ్ భిన్నమైన కథాంశంతో మరో సినిమా చేయబోతున్నారు. ‘కాటమరాయుడా...’ అనేది ఈ సినిమా టైటిల్. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై చంద్రసిద్దార్థ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.