‘కాటమరాయుడా...’
‘కాటమరాయుడా...’
Published Tue, Sep 24 2013 2:58 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
సినిమా ద్వారా నాలుగు మంచి విషయాలు చెబితే... ‘ఆర్ట్ ఫిలిం’ అని తేలిగ్గా పెదవి విరిచేసే రోజులివి. అయితే... చేదైన మంచిని కూడా తీయని రసగుల్లాలా నోటికి అందించడంలోనే ఉంది అసలైన ప్రజ్ఞ. దర్శకుడు చంద్రసిద్దార్థ్ చేసేది అదే. ఆ నలుగురు, మధుమాసం, ఇదీ సంగతి, అందరిబంధువయ.. ఇలా ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి కనిపిస్తూనే ఉంటుంది.
అయితే... ఆ మంచి కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. దటీజ్ చంద్రసిద్దార్థ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’. సుమంత్, పింకీ సావిక జంటగా చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చంద్రసిద్దార్థ్ భిన్నమైన కథాంశంతో మరో సినిమా చేయబోతున్నారు.
‘కాటమరాయుడా...’ అనేది ఈ సినిమా టైటిల్. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై చంద్రసిద్దార్థ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement