సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్న పవన్‌ | Pawan Kalyan Will Release Aatagadharaa Siva Movie Lyrical Song | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 14 2018 3:53 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Will Release Aatagadharaa Siva Movie Lyrical Song - Sakshi

టైటిల్‌తోనే ఆకట్టుకుంటోన్న సినిమా ఆటగదరా శివ. ఆ నలుగురు, అందరి బంధువయా, మధుమాసం లాంటి సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ ఈ సినిమాను తెరకెక్కించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌ కూడా ఆకట్టుకునే లా ఉండడంతో అందరికీ చేరువై.. సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. 

సినిమాలో ఓ పాటను హీరో వెంకటేష్‌తో రిలీజ్‌ చేయించారు చిత్ర నిర్మాత. ఈ సినిమాలో మరో పాటను  పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ ‘ఎట్టాగయ్యా శివ’ అనే లిరికల్‌ సాంగ్‌ను  శనివారం సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నారు. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మించిన ఈ సినిమా  జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement