
ఆ నలుగు, మధుమాసం, అందరి బంధువయా లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ ఏమో గుర్రం ఎగరావచ్చు ఫ్లాప్ అవ్వడంటో గ్యాప్ తీసుకున్నారు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన మార్క్ కనిపించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆటగదరా శివ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది కీకల పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment