
మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. లోపల వాళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉందనేది తెలియదు గానీ ఎవరికీ వాళ్లు ఏదేదో అనేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల టైంలో ఇది మరింత ఎక్కువైంది. తాజాగా ఈ విషయమై ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది స్పందించాడు. 'శివం భజే' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)
'అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన్ని అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొందరు అల్లు అర్జున్‌ని ఉద్దేశపూర్వకరంగానే ట్రోల్ చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అని ఆది చెప్పాడు.
(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')
Comments
Please login to add a commentAdd a comment