నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం! | Allu Arjun Exit From Mega Family Whatsapp Group | Sakshi
Sakshi News home page

Allu Arjun: మెగా వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యాడా?

Published Mon, May 20 2024 1:20 PM | Last Updated on Mon, May 20 2024 3:43 PM

Allu Arjun Exit From Mega Family Whatsapp Group

మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇ‍క్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)

మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్‌తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్‌ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement