'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్! | Sreeja Konidela Shares Pic With Allu and Mega Family Childrens | Sakshi
Sakshi News home page

Sreeja Konidela: 'ఓకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు వారసులు.. సోషల్ మీడియాలో వైరల్'!

Nov 14 2023 6:43 PM | Updated on Nov 14 2023 6:56 PM

Sreeja Konidela Shares Pic With Allu and Mega Family Childrens - Sakshi

శ్రీజ కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కూతురిగా శ్రీజకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ఫ్యామిలీతో కలిసి హాజరైంది. తన ఇద్దరు కూతుళ్లతో వరుణ్ పెళ్లిలో సందడి చేసింది. పెళ్లిలో నూతన దంపతులతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.

(ఇది చదవండి: స్టార్‌ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?)

తాజాగా ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు ఉన్న ఫోటోను పంచుకుంది. అంతే కాకుండా పిల్లల మనస్తత్వం గురించి నోట్ రాసుకొచ్చింది. శ్రీజ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఇది చూసి ఫ్యాన్స్ సూపర్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఓకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు కుటుంబాల పిల్లలను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. కాగా.. 2016లో కల్యాణ్‌ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే.

(ఇది చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement