వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
(ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! )
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్‌లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment