ఎన్టీఆర్‌ బయోపిక్‌ : తెరపైకి మరో పేరు | Direction Supervision By Chandra Siddhartha For Ntr Biopic | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 10:41 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Direction Supervision By Chandra Siddhartha For Ntr Biopic - Sakshi

సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు బాలయ్య. ముందుగా ఈ సినిమాను తేజ దర్శకత్వంలో రూపొందించాలని నిర్ణయించారు. అయితే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన తరువాత తేజ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటం, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ లాంటి దర్శకులను సంప్రదించిన ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించేందుకు అంగీకరించకపోవటంతో బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.

అయితే దర్శకత్వ శాఖలో అనుభవం లేని బాలయ్య సీనియర్‌ దర్శకుల పర్యవేక్షణలో సినిమా చేయాలని భావిస్తున్నారట. ముందుగా ఆ బాధ్యతను దర‍్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అప్పగించాలని భావించినా.. రాఘవేంద్ర రావు బిజీగా ఉండటంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారభించారు. తాజాగా ఆ నలుగురు ఫేం చంద్ర సిద్ధార్థ, ‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.


దర్శకుడు చంద్ర సిద్ధార్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement