
'లింగ' థియేటర్లో రజనీ అభిమాని మృతి
మూత్రపిండాల సమస్య ఉన్నా లెక్కచేయకుండా తన అభిమాన నటుడి సినిమా చూడాలని వచ్చిన ఓ వ్యక్తి.. సినిమా థియేటర్లోనే ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) రజనీకాంత్ వీరాభిమాని. అతడు ఎలాగైనా 'లింగ' సినిమా చూడాలని అనుకున్నాడు.
తన నరానికి పెట్టిన డ్రిప్ ట్యూబ్ అలాగే ఉంచుకుని మరీ థియేటర్కు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో అతడికి చికిత్స జరుగుతోంది. అయినా ఎలాగోలా ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నాడు. సినిమా పూర్తయిన తర్వాత కూడా అతడు ఎంతకీ లేవకపోవడంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూడగా.. అప్పటికే మరణించాడు. పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని ఆస్పత్రికి పంపారు.