సాహసానికి సై! | Rajinikanth's Lingaa shoot reaches climax | Sakshi
Sakshi News home page

సాహసానికి సై!

Sep 21 2014 11:29 PM | Updated on Oct 2 2018 6:48 PM

సాహసానికి సై! - Sakshi

సాహసానికి సై!

ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫైట్లు చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికెంతో దమ్ము, ధైర్యం ఉండాలి. రజనీకాంత్‌కి ఇవి ఉన్నాయి కాబట్టే, తాను నటిస్తున్న తాజా చిత్రం

 ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫైట్లు చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికెంతో దమ్ము, ధైర్యం ఉండాలి. రజనీకాంత్‌కి ఇవి ఉన్నాయి కాబట్టే, తాను నటిస్తున్న తాజా చిత్రం ‘లింగా’లో ఓ సాహసోపేతమైన ఫైట్‌కి సై అనేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టేకర్ ఆధ్వర్యంలో త్వరలో ఈ క్లయిమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. ఇది భారీ పోరాట దృశ్యం అని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఫైట్ చేయలేదని లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోరాట దృశ్యానికి సంబంధించిన కసరత్తుల్లో లీ నిమగ్నమయ్యారు. రజనీ స్టయిల్స్, ఫైట్స్‌కి వీరాభిమానులున్నారు. వాళ్లందరినీ ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement