సాహసానికి సై!
ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫైట్లు చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికెంతో దమ్ము, ధైర్యం ఉండాలి. రజనీకాంత్‌కి ఇవి ఉన్నాయి కాబట్టే, తాను నటిస్తున్న తాజా చిత్రం ‘లింగా’లో ఓ సాహసోపేతమైన ఫైట్‌కి సై అనేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టేకర్ ఆధ్వర్యంలో త్వరలో ఈ క్లయిమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. ఇది భారీ పోరాట దృశ్యం అని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఫైట్ చేయలేదని లీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోరాట దృశ్యానికి సంబంధించిన కసరత్తుల్లో లీ నిమగ్నమయ్యారు. రజనీ స్టయిల్స్, ఫైట్స్‌కి వీరాభిమానులున్నారు. వాళ్లందరినీ ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు.