‘లింగా’ విడుదల రోజే... | 'Lingaa' to release on December 12 | Sakshi
Sakshi News home page

‘లింగా’ విడుదల రోజే...

Published Tue, Dec 2 2014 1:56 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

‘లింగా’ విడుదల రోజే... - Sakshi

‘లింగా’ విడుదల రోజే...

సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం విడుదల రోజే నూతన తారలు నటించిన యారో ఒరువన్ చిత్రం విడుదలవుతోంది. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం యారో ఒరువన్. నవ నటుడు రామ్ హీరోగా నటిం చిన ఈ చిత్రంలో నటి ఆదిర హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కథ, కథనం, మాటలు చాయా గ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను కేఎన్ పైజూ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, తాను పలు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించినట్లు తెలిపారు.
 
 యారో ఒరువన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే కనిపించకుండా పోయిన భార్య కోసం గాలించే భర్త రామ్, డిటెక్టివ్ ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనలే చిత్ర ఇతివృత్తం అని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లింగ విడుదలవుతున్న థియేటర్లు కాకుండా మిగిలిన థియేటర్లు తమకు లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ తేదీన మరో చిత్రం ఏదీ విడుదల కావడం లేదని అందువలనే తానీ చిత్రాన్ని విడుదల చేస్తున్నానని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement