Yaro Oruvan
-
‘లింగా’ విడుదల రోజే...
సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం విడుదల రోజే నూతన తారలు నటించిన యారో ఒరువన్ చిత్రం విడుదలవుతోంది. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం యారో ఒరువన్. నవ నటుడు రామ్ హీరోగా నటిం చిన ఈ చిత్రంలో నటి ఆదిర హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. కథ, కథనం, మాటలు చాయా గ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను కేఎన్ పైజూ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, తాను పలు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. యారో ఒరువన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే కనిపించకుండా పోయిన భార్య కోసం గాలించే భర్త రామ్, డిటెక్టివ్ ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనలే చిత్ర ఇతివృత్తం అని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లింగ విడుదలవుతున్న థియేటర్లు కాకుండా మిగిలిన థియేటర్లు తమకు లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ తేదీన మరో చిత్రం ఏదీ విడుదల కావడం లేదని అందువలనే తానీ చిత్రాన్ని విడుదల చేస్తున్నానని వివరించారు. -
హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్
హర్రర్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రం యారో ఒరువన్. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కె ఎన్ ప్రైజూ కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం అంటూ పలు బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత మలయాళ దర్శకుడు పద్మరాజు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. పలు బుల్లితెర సీరియళ్లకు దర్శకత్వం వహించిన కేఎన్ ప్రైజు తనకు సినిమారంగంలోని అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం ఉండడం వలనే ఈ చిత్రానికి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవజంట రామ్ ఆధిర హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ యారో ఒరువన్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అదృశ్యం అయిన తన భార్యను కనుగొనే ప్రయత్నంలో హీరో ప్రముఖ డిటెక్టివ్‌తో పాటు ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనల ఇతివృత్తమే యారో ఒరువన్ చిత్రం అన్నారు. ఇంటిలో అడవుల్లో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న అంశాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. తెన్మలై అచ్చన్ కోయిల్, కట్లపారై తదితర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్ర షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. హర్రర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు కె ఎన్ ప్రైజు పేర్కొన్నారు.